E-Paper
Advertisement

Assembly Security: అసెంబ్లీ సెక్యూరిటీ స్టాఫ్​ పై మంత్రి దామోదర రాజనరసింహ సీరియస్..!

Assembly Security: అసెంబ్లీ సెక్యూరిటీ స్టాఫ్​ పై మంత్రి దామోదర రాజనరసింహ సీరియస్..!
Advertisement

Assembly Security: స్వేచ్ఛ బ్యూరో: అసెంబ్లీలో సెక్యూరిటీ స్టాఫ్​ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని స్వయంగా ఎమ్మెల్యేలే వాపోతున్నారు. తాము ఎమ్మెల్యేలమని తెలిసినా సెక్యూరిటీ స్టాఫ్​ ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటూ ఎమ్మెల్యేలు తప్పుబడుతున్నారు. పైగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను అసెంబ్లీ సెక్యూరిటీ స్టాఫ్​ అడ్డుకోవడానికి ఆయా ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. కొందరు స్టాపైతే పై నుంచి ఆదేశాలు సార్ అంటూ దాటవేస్తున్నారని ఎమ్మెల్యేలు చెప్తున్నారు. సోమవారం అసెంబ్లీలో కొందరు సెక్యూరిటీ స్టాఫ్​ ప్రదర్శించిన తీరు తమకు అవమానం కల్గించేలా ఉన్నదంటూ ఎమ్మెల్యేలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక సీఎల్పీ మీటింగ్ జరుగుతున్న హాల్ ముందు కాంగ్రెస్ పార్టీ లెజెస్టేటివ్ ఆఫీస్‌లో పనిచేసే ఓ అటెండర్ హాడావిడి చేశారని స్వయంగా పోలీస్ స్టాఫ్​ చెప్తున్నారు. తమను కూడా ఇక్కడ ఉండాలి.. అక్కడ ఉండాలి.. వాళ్లను రానీయొద్దు.. వీళ్లను అడ్డుకోవాలంటూ ఆయన హుకుం జారీ చేసినట్లు చెప్పడం తమను కూడా ఆశ్చర్యాన్ని కల్గించిందని అక్కడే డ్యూటీలో ఉన్న స్టాఫ్​ తెలిపారు. పార్టీ కార్యాలయంలో అటెండర్ హోదాలో వర్క్ చేసే వ్యక్తి హాడావిడిని చూసి అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లు కూడా అవాక్కయ్యారట. ఇది ఎమ్మెల్యేల మధ్య చర్చంశనీయంగా మారింది.

ప్రజాప్రతినిధులకే తప్పని అవమానం..!

చట్టసభల వేదికగా ఉండాల్సిన అసెంబ్లీ ప్రాంగణం ఇప్పుడు సెక్యూరిటీ సిబ్బంది ఆంక్షల పర్వానికి వేదికైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల గొంతుకను వినిపించేందుకు వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలను సైతం ‘గేట్’ దగ్గరే అడ్డుకుంటూ సెక్యూరిటీ సిబ్బంది ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.అసెంబ్లీ ఆవరణలో ప్రజాప్రతినిధుల పట్ల భద్రతా సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశమైంది. తమ సొంత నియోజకవర్గాల సమస్యలపై చర్చించేందుకు వచ్చే ఎమ్మెల్యేలను సైతం లోపలికి వెళ్లనివ్వకుండా గంటల తరబడి నిలబెట్టడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. తమను ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నిస్తే, “మాకు పై నుంచి ఆదేశాలు ఉన్నాయి” అంటూ సిబ్బంది ఒకే రకమైన సమాధానం ఇస్తుండటం గమనార్హం. సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ముందు ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల సామేలు, విజయరామరావులు డిప్యూటీ సీఎం ఛాంబరు లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో అక్కడ ఉన్న గన్ మెన్లు ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు. లోపలికి వెళ్లాలంటే స్లిప్ లో పేర్లు రాయాలని సూచించినట్లు తెలిసింది. అవమానానికి గురైన ఎమ్మెల్యేలు అసంతృప్తితో అక్కడ్నుంచి వెనుదిరిగి వెళ్లిపోయినట్లు సమాచారం.

Advertisement

Also Read: Heavy Rains: వడగండ్ల వాన.. కాసేపట్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం, బయటకు మాత్రం రావొద్దు..!

మంత్రి దామోదర రాజనర్సింహ సీరియస్..

మరోవైపు మంత్రి దామోదర రాజనర్సింహకు సైతం చేదు అనుభవం ఎదురైంది. సెక్యూరిటీ సిబ్బంది ప్రవర్తనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వని పద్ధతిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. శాసన మండలి ప్రాంగణంలోని కమిటీ హాల్ లోకి వెళ్లేందుకు మంత్రి దామోదర రాజనర్సింహా చైర్మన్ ఎంట్రన్స్ నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆయన కు సమీపంలో మంత్రి సీతక్కతో పాటు ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ కూడా ఉన్నట్లు తెలిసింది. కానీ ఆ వే నుంచి వెళ్లేందుకు అక్కడున్న సెక్యూరిటీ స్టాఫ్​ మంత్రిని అనుమతించలేదు. దీంతో మంత్రి దామోదర రాజనర్సింహా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. “నేను మంత్రిని..నన్నే ఆపుతారా”అంటూ సెక్యూరిటీ స్టాఫ్​ పై నిప్పులు చెరిగారు. ఇది ఎమ్మెల్యేల సర్కిళ్లలో బిగ్ డిస్కషన్ గా మారింది.

Advertisement

Also Read: BJP Strategy: త్వరలో జిల్లాకో స్పోక్స్ పర్సన్ నియామకం: రాంచందర్ రావు

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×