E-Paper
Advertisement

ఇల్లు ఇల్లాలు పిల్లలు.. మార్చి 29: బిందె పై శ్రీవల్లి డ్యాన్స్..చుక్కలు చూపించిన నర్మద..సాగర్, నర్మద ఒక్కటవుతారా?

ఇల్లు ఇల్లాలు పిల్లలు.. మార్చి 29: బిందె పై శ్రీవల్లి డ్యాన్స్..చుక్కలు చూపించిన నర్మద..సాగర్, నర్మద ఒక్కటవుతారా?
Advertisement

Illu Illalu Pillalu Today Episode March 29th : నిన్నటి ఎపిసోడ్ లో.. ఆనంద్ రావు భాగ్యం ఇద్దరు చాలా సంతోషంగా ఒకరినొకరు పొగుడుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ రొమాంటిక్ కపుల్ గా ఉంటారు. భాగ్యం ఏంటి నీ సరసాలు మీ వయసు ఏంటి? నువ్వు చేసే పని ఏంటి? అని అంటుంది.. వయసు అయిపోయిన దెయ్యాలు స్మశానంలో కూర్చుని వేదాలు వల్లిచ్చాయి అంట అలా ఉంది నీ పరిస్థితి అని భాగ్యం అంటుంది.. అదేంటి భాగ్యం ఇడ్లీలు మిగిలిపోయాయి కదా అని వాటిని పడేస్తామా ఏంటి పిండిలో కలిపేసి పునుగులు వేసుకుని అమ్మేస్తాం కదా అలానే ఇది కూడా అనేసి ఆనందరావు అంటాడు. ఈ వయసులో చేసేది ఏమీ లేదు కానీ ఇప్పుడు ఇలా రెచ్చిపోతున్నావేంటి దూరంగా కూర్చో నేను అక్కడ మా అమ్మడు ఏం చేస్తుందో ఎలా ఉందో ఫోన్ చేసి కనుక్కోవాలి అని భాగ్యం శ్రీవల్లికి ఫోన్ చేస్తుంది. బాధపడుతూ కూర్చున్న శ్రీవల్లి నీ రెచ్చగొట్టి దొంగతనానికి పంపిస్తారు భాగ్యం ఆనందరావు.. కానీ అక్కడ శ్రీవల్లి మాత్రం అడ్డంగా ఇరుకుంటుంది.. ఫోన్ కొట్టేసి ప్రేమకు చుక్కలు చూపించాలి అని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. ప్రేమ ఫోన్ ను కొట్టేసిన శ్రీవల్లి నర్మద, ప్రేమలకు అడ్డంగా దొరికిపోతుంది.. నువ్వు ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ వాయిస్ రికార్డింగ్ లో వాళ్ళందరికీ వినిపించేస్తాము అని ప్రేమ నర్మదా ఇద్దరు కూడా వల్లిని కంగారు పెట్టిచేస్తారు. ఇక వల్లిని డాన్స్ వేయమని ఇద్దరు కూడా ఫోర్స్ చేస్తారు. కచేరి బాగా చేయాలి లేదంటే మాత్రం ఈ వీడియో అందరికీ పంపించేస్తాను అని ప్రేమ బెదిరిస్తుంది. వల్లి మాత్రం ఇక చచ్చినట్టు వాళ్ళు చెప్పినట్లు చేస్తుంది.. ఆ తర్వాత శ్రీవల్లి చచ్చినట్లు డాన్స్ చేయడంతో వాళ్ళిద్దరూ తెగ నవ్వేసుకుంటారు. బిందు పై నిలబడి శ్రీవల్లి చేసిన నాట్యాన్ని చూసి ప్రేమ నర్మద ఇద్దరు కూడా తెగ నవ్వేసుకుంటూ ఉంటారు. కిందకు దిగావ్ అనుకో ఈ వీడియో కచ్చితంగా అందరికీ వెళ్ళిపోతుంది అని బెదిరిస్తారు.

Advertisement

ఇక శ్రీవల్లి చేసేదేమీ లేక ఆ బిందె పై నాట్యం చేస్తుంది.. వీళ్ళిద్దరూ నన్ను ఆడుకుంటున్నారు. వీళ్ళిద్దరి జుట్టు నాకు దొరక్కపోదు అని శ్రీవల్లి ఆలోచిస్తూ భిన్న పై డాన్స్ చేస్తూ ఉంటుంది. మా అమ్మ ఫోన్ కొట్టేస్తే ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుందని చెప్పింది. కానీ నా నెత్తిన ఇంకొక ప్రాబ్లం తెచ్చి పెట్టింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇంకా రెచ్చిపోతున్నారు అని శ్రీవల్లి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఏంటి బల్లి అక్క నువ్వు చేసే వాటికి అన్నిటికీ నోరు మూసుకొని ఉంటున్నాం కదా అని మమ్మల్ని చేతకాని వాళ్ళని అనుకుంటున్నావా అని నర్మదా అంటుంది..

నీకు ఎన్నిసార్లు అవకాశాలు ఇచ్చినా కూడా నువ్వు ఇలానే తప్పుల మీద తప్పులు చేస్తూ పోతావు. ఇక నీకు ఏ విషయం చెప్పకూడదు ఎన్ని ఛాన్సులు ఇచ్చినా నువ్వు ఇంతే కాబట్టి నీ గురించి ఇప్పుడు తప్పక చెప్పాల్సిందేనని నర్మదా అంటుంది.. ఆ మాట వినగానే శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.. ఇక డాన్స్ వేస్తూ జారిపోయి కింద పడిపోతుంది. ఎంత లేపిన సరే శ్రీవల్లి లేవకపోవడంతో ఆ ఇద్దరు కూడా మన ప్లాన్స్ సక్సెస్ అని అక్కడ నుంచి వెళ్ళిపోతారు.. నన్ను తెగ ఆడేసుకుంటున్నారు అని శ్రీవల్లి వాళ్ళు వెళ్ళిన తర్వాత లేచి బాధపడిపోతూ ఉంటుంది.

Advertisement

వీరిద్దరిని ఎలాగైనా సరే నా గుప్పెట్లో పెట్టుకోవాలి అని శ్రీవల్లి మరో ప్లాన్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇక సాగర్ తర్వాత రోజు ఉదయం ఆఫీసుకు వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటాడు.. అయితే తన పర్సులో డబ్బులు లేకపోవడంతో పెట్రోల్ కొట్టించుకోవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు అని ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఎంత చేసినా కూడా నా దగ్గర చిల్లి గవ్వ కూడా మిగలడం లేదు కదా ఇప్పుడు ఎవరిని అడగాలి అని ఆలోచిస్తాడు.. అప్పుడే అక్కడికి వచ్చిన నర్మదా ఏంటి రెడీ అయిపోయావా? ఇదిగో నీ లంచ్ బాక్స్ అని అంటుంది. కానీ సాగరు డబ్బులు గురించి అడగడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. నర్మద మాత్రం తనకి కావాల్సినవన్నీ దగ్గరుండి చేస్తుంది.

Also Read :‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ టీఆర్పీ రేటింగ్.. మార్చి నెలలో హైలెట్ ఎపిసోడ్స్..

ఎంత చేస్తున్న సరే పెళ్ళాం మీద కనికరం లేదా.. నేను కలవాలి ప్రయత్నించడం కాదు నువ్వు కూడా ప్రయత్నించాలి అని అంటుంది. రెండు వైపులా ఉంటేనే ప్రయత్నించాలి అని నర్మదా అంటుంది కానీ సాగరు నా పర్స్ ఎక్కడ అని అడిగితే ఆ పర్సు ఇస్తుంది. ఏంటి ఈ పర్సులో ఏమైనా నా ఫోటో పెట్టుకున్నావా ఏంటి అని నర్మదా అడుగుతుంది. అందులో డబ్బులు లేకపోవడంతో సాగరు బాధ పడిపోతూ ఉంటాడు.. ఏంటి ఇందులో డబ్బులు లేవా అని నర్మదా అంటుంది. అక్కడితో ప్రోమో పూర్తవుతుంది. ఇక సోమవారం ఎపిసోడ్ వల్లిని ఎలా ఆడుకుంటారో చూడాలి..

 

Related News

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×