E-Paper
Advertisement

రేమండ్ గ్రూప్ మాజీ ఛైర్మన్ విజయ్‌పత్ సింఘానియా ఇక లేరు

రేమండ్ గ్రూప్ మాజీ ఛైర్మన్ విజయ్‌పత్ సింఘానియా ఇక లేరు
Advertisement

Vijaypat Singhania: రేమండ్ గ్రూప్ మాజీ ఛైర్మన్ విజయ్‌పత్ సింఘానియా ఇక లేరు. ఆయన వయస్సు 87 ఏళ్లు. గతరాత్రి ఆయన ముంబైలో కన్నుమూశారు. ఈ విషయాన్ని సింఘానియా కుటుంబసభ్యులు తెలిపారు. విజయ్‌పత్ ఇక లేరన్న విషయాన్ని ఆయన కొడుకు, రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా ఎక్స్ వేదికగా వెల్లడించారు.

రేమండ్ గ్రూప్ మాజీ ఛైర్మన్ విజయ్‌పత్ సింఘానియా ఇక లేరు

Advertisement

ప్రముఖ వస్త్ర పరిశ్రమ రేమండ్ మాజీ ఛైర్మన్, కార్పొరేట్ దిగ్గజం, విమానయాన నిపుణుడు, విజయపత్ సింఘానియా శనివారం రాత్రి ముంబైలో మరణించారు. 87 ఏళ్లు కలిగిన ఆయన అనారోగ్యం క్షీణించడంతో శుక్రవారం ఆసుపత్రిలో చేర్చారు. శనివారం రాత్రి ఆయన మరణించారు. ఆదివారం చందన్‌వాడి శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి.

వ్యాపార కుటుంబానికి చెందిన విజయపత్ సింఘానియా రెండు దశాబ్దాలకు పైగా రేమండ్ వస్త్ర గ్రూప్ ఛైర్మన్‌గా పని చేశారు. రేమండ్ అంటే విజయపత్ అనే స్థాయికి ఆయన తీసుకెళ్లారు. 1980-2000 మధ్యకాలంలో రేమండ్‌ వస్త్రాలకు విశేషమైన ప్రాచుర్యం కల్పించారు. ఒకప్పుడు రేమండ్ దస్తులు వేసుకోవడానికి వినియోగదారులు అమితంగా ఇష్టపడేవారు కూడా.

Advertisement

ఏవియేటర్‌గా విజయ్‌పత్ సింఘానియా మరో అడుగు 

1938 అక్టోబర్ 4న జన్మించిన విజయ్‌పత్ సింఘానియా 1980లో రేమండ్ గ్రూప్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. దేశంలోనే కాకుండా విదేశాల్లో రేమండ్‌ను శక్తివంతమైన సంస్థగా తయారు చేయడంలో ఆయనది కీలకపాత్ర. పురుషుల ఫ్యాషన్ రంగంలో రేమండ్ అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్లలో ఒకటిగా మార్చేశారు.

బిజినెస్‌మేన్‌గా కాకుండా మంచి ఏవియేటర్ గా పేరు సంపాదించుకున్నారు. 5 వేలకు పైగా విమానం నడిపిన అనుభవం ఆయన సొంతం. అంతేకాదు 67 ఏళ్ల వయస్సులో హాట్ ఎయిర్ బెలూన్‌లో అత్యధిక ఎత్తుకు ప్రయాణించిన వ్యక్తిగా విజయపత్ రికార్టులకు ఎక్కారు. ఆయనకు 2006లో పద్మభూషణ్ పురస్కారం వరించింది.

ALSO READ: ఈ గ్యాస్ ల ఉపయోగాలు, తేడాలేంటి?

ఆయన చైర్మన్‌గా పదవీకాలం చివరిలో అనేక ఒడిదుడుకులు మొదలయ్యాయి. ఓ వైపు ఆర్థిక మాంద్యం, ఉక్కు-సిమెంట్ వ్యాపారాలు దెబ్బతిన్నాయి. చివరికి కొన్ని వ్యాపారాలను ఆయన అమ్మేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రెండ్‌కు అనుగుణంగా అడుగులు వేసే విజయ్ పథ్ సింఘినియా, నాయకత్వాన్ని తన కుమారుడు గౌతమ్ సింఘానియాకు అప్పగించారు. ఆనాటి నుంచి వ్యాపార కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

 

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×