Illu Illalu Pillalu Today Episode March 31st : నిన్నటి ఎపిసోడ్ లో.. సాగర్ తర్వాత రోజు ఉదయం ఆఫీసుకు వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటాడు.. అయితే తన పర్సులో డబ్బులు లేకపోవడంతో పెట్రోల్ కొట్టించుకోవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు అని ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఎంత చేసినా కూడా నా దగ్గర చిల్లి గవ్వ కూడా మిగలడం లేదు కదా.. ఇప్పుడు ఎవరిని అడగాలి అని ఆలోచిస్తాడు.. అప్పుడే అక్కడికి వచ్చిన నర్మదా ఏంటి రెడీ అయిపోయావా? ఇదిగో నీ లంచ్ బాక్స్ అని అంటుంది. కానీ సాగరు డబ్బులు గురించి అడగడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. నర్మద మాత్రం తనకి కావాల్సినవన్నీ దగ్గరుండి చేస్తుంది. నేను కలవాలి ప్రయత్నించడం కాదు.. నువ్వు కూడా ప్రయత్నించాలి అని అంటుంది. రెండు వైపులా ఉంటేనే ప్రయత్నించాలి అని నర్మదా అంటుంది.
కానీ సాగరు నా పర్స్ ఎక్కడ అని అడిగితే ఆ పర్సు ఇస్తుంది. ఏంటి ఈ పర్సులో ఏమైనా నా ఫోటో పెట్టుకున్నావా ఏంటి అని నర్మదా అడుగుతుంది. అందులో డబ్బులు లేకపోవడంతో సాగరు బాధ పడిపోతూ ఉంటాడు.. ఏంటి ఇందులో డబ్బులు లేవా అని నర్మదా అంటుంది. అప్పటి నుంచి అందుకేనేమో సార్ గారు అడగడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నారు అని నర్మదా అనుకుంటుంది..వల్లిని చందు స్కూల్లో డ్రాప్ చేసి వస్తాడు.. ప్రేమ నర్మద ఇద్దరు కూడా ఆ వల్లి అక్కకి ఎలాగైనా సరే చెక్ పెట్టాలి అని అనుకుంటారు. అయితే వల్లిని ఇరికించడానికి నేను ఆల్రెడీ ప్లాన్ చేశాను అని నర్మదా అంటుంది.. చందు బావ మళ్లీ అక్క కింద పడిందంట అని నర్మదా ఫోన్ చేసి స్కూల్ కి వెళ్ళమని చెప్తుంది.. అయితే మళ్లీ అక్కడ లేదని తెలుసుకున్న చందు కి దిమ్మతిరిగే షాక్ అవుతుంది.. ఒక్కసారిగా తన ఏంఏ సర్టిఫికేట్ ఫేక్ అని తెలియడంతో చందు షాక్ అయిపోతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. వల్లి ఎంఏ ఇంగ్లీష్ సర్టిఫికేట్ టు ఫేక్ అని ప్రిన్సిపల్ అంటున్నాడు అందులో నిజం ఎంత ఉందో నాకు అర్థం కావడం లేదు అని చందు అంటాడు. ఆ సర్టిఫికెట్ల గురించి మాకు ఎప్పుడో తెలుసు బాబు గారు మీకే తెలియాలని అలా చేసాము అని వాళ్ళ అంటారు. ఇప్పుడు మళ్లీ అక్క స్కూల్కి అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్లి ఉంటుంది. మీరు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్లి చూడండి అక్కడే ఉంటుంది అని చందు కి నర్మదా చెప్పగానే వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్తాడు. శ్రీవల్లి వాళ్ళ అమ్మానాన్న ప్రేమతో తినిపిస్తూ ఉంటే తింటూ ఉంటుంది అది చూసిన చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక తర్వాత చందు ఫోన్ చేసి వల్లిని అడగ్గానే.. నేను ఇక్కడే స్కూల్లో ఉన్న బావ అని కవరింగ్ చేస్తుంది కానీ చందు కి అడ్డంగా దొరికిపోతుంది. స్కూల్ కి వెళ్లి నీ సర్టిఫికెట్లు తీసుకొని వచ్చి జాబ్ మానేయద్దు పదా అనేసి తీసుకొని వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళగానే మళ్లీ నీ సర్టిఫికెట్ తీసుకురా అని ఎంత చెప్తున్నా సరే వినకుండా ఆపే ప్రయత్నం చేస్తుంది..
నిన్ను పెళ్లి చేసుకోవడం కోసమే ఎంఏ చదివినాము అని అబద్ధం చెప్పాం అంతే తప్ప.. ఇంకేమీ లేదు బావ అని శ్రీవల్లి ఎంత చెప్తున్నా సరే.. నన్నింత మోసం చేస్తావా అని చందు శ్రీవల్లి చెంప పగలగొడతాడు.. ఇక తర్వాత నువ్వు నన్ను ఎంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు. మా నాన్న ఎంతగా నమ్మాడు. అలాంటిది మా నాన్నను కూడా మోసం చేశారు.. ఈ విషయం మా నాన్నకు తెలిస్తే గుండె ఆగిపోతుంది. ఒక సర్టిఫికెట్ను దొంగగా క్రియేట్ చేయాలి అంటే ఎంత నెట్వర్క్ ఉండాలి.. అలాంటిది ఇలా చేశారు అంటే మీ బ్యాగ్రౌండ్ ఏంటో అర్థం కావడం లేదు. ఎన్ని మోసాలు చేశారో ఎన్ని కుట్రలు చేశారో అని చెందు అంటాడు.. వల్లి ఎంత చెప్తున్నా సరే చందు మాత్రం చాలా సీరియస్గా వల్లిన అక్కడ వదిలేసి ఇంటికి వచ్చేస్తాడు..
ఇప్పుడు ఎం ఏ సర్టిఫికెట్ల గురించి బయట పడిపోయి ఉంటది అక్క. ఆ వల్లి ముఖచిత్రం ఎలా ఉంటుందో నాకు చూడాలనిపిస్తుంది అని ప్రేమ అంటుంది.. చందు కోపమే రావడం చూసిన వీరిద్దరూ కూడా.. చందు బావ అంత కోపంగా వస్తున్నాడు అంటే వల్లికి చంప పగిలే ఉంటుంది అని అనుకుంటారు.. అప్పుడే అక్కడికి వచ్చిన వల్లిని చూసి వాళ్ళిద్దరూ ఏంటి టీచర్ గారు అప్పుడే స్కూల్ నుంచి వచ్చారు అని ప్రేమ నర్మదా అడుగుతారు.. అయితే మీ ఇద్దరికీ బాగా తెలుసు నన్ను అడ్డంగా ఇరికించింది. మీరిద్దరే కానీ ఇప్పుడు ఇలా నటిస్తున్నారేంటి అని వల్లి అంటుంది.. అది కాదు అక్క ఇందాకట్నుంచి చెంప మీద చెయ్యి తీయట్లేదు ఏమైంది అని అడుగుతుంది ప్రేమ.. చంపకమిలిపోయి ఉండడంతో ఒక్కసారిగా ఇద్దరు కూడా అయ్యయ్యో ఎంత కష్టం వచ్చింది అని అనుకుంటారు..
Also Read : కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం.. పల్లవి మాస్టర్ ప్లాన్.. చక్రధర్ కు షాక్..
ఇక తర్వాత చందు దగ్గరికి వెళ్లిన వల్లి అతని కోపాన్ని భరించలేక పోతుంది.. నేను చెప్పేది విను బావా అని ఎంత చెప్తున్నా సరే.. వినకుండా సీరియస్ అవుతుంది.. ఇక వీళ్లిద్దరూ వచ్చారంటే ఆ డ్రామా బ్యాచ్ కూడా వచ్చేస్తూ ఉంటారు అని ప్రేమ అంటుంది. అప్పుడే అక్కడికి భాగ్యం ఆనందరావు పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు.. ఆ తర్వాత అందరూ కలిసి రామరాజు విషయం తెలిసిపోయింది అని అనగానే వాళ్ళిద్దరూ ఎక్కడ చంపేస్తారు అని భయపడి కాళ్లు పట్టుకొని క్షమించమని అడుగుతారు. తర్వాత విషయం తెలియదు అని తెలుసుకొని ఇద్దరు కూడా 10 లక్షల డబ్బులు గురించి మాట్లాడతారు.. ఇక మొత్తానికి నర్మదా ప్రేమలో దెబ్బకి ఆనంద్ రావు భాగ్యం అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతారు.. ఇక రామరాజు కొబ్బరికాయలు వలుస్తూ ఉండగా వేదవతి చెమట తుడుస్తూ ఉంటుంది వీరిద్దరి రొమాంటిక్ సీన్ ఎపిసోడ్కి హైలైట్ గా మారుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…