E-Paper
Advertisement

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Raja Singh: తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. పార్టీ ఫైర్‌బ్రాండ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్వపక్ష నేతలపైనే తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ అగ్రనేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్‌లను లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు కమలం పార్టీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

ఆ ఇద్దరు రాజీపడితే సరిపోతుందా?

Advertisement

పార్టీలోని కొందరు సీనియర్ల వైఖరిపై రాజాసింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం బండి సంజయ్, ఈటల రాజేందర్ అనే ఇద్దరు నాయకులు ఒకచోట కూర్చుని, రాజీపడితే తెలంగాణలో బీజేపీ అధికారం లోకి వచ్చేస్తుందా? అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. నేతల మధ్య ఉండే వ్యక్తిగత ఈగోల వల్ల పార్టీకి భారీ నష్టం జరుగుతోందని, ఈ విషయాన్ని తాము ఢిల్లీలోని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

బూత్ క్యాడర్‌ను వదిలేసి మేయర్ పీఠాలా?

Advertisement

క్షేత్రస్థాయిలో పార్టీని నమ్ముకున్న బూత్ స్థాయి కార్యకర్తలను, క్యాడర్‌ను పట్టించుకోకుండా పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం సరికాదని రాజాసింగ్ హితవు పలికారు. గ్రౌండ్ రియాలిటీని గమనించకుండా, కార్యకర్తలను బలోపేతం చేయకుండా జీహెచ్ఎంసీ మేయర్ స్థానాలను గెలుచుకుంటామని చెప్పడం కేవలం పగటికలలే అవుతాయని ఎద్దేవా చేశారు.

Also Read: చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

మండుతున్న కార్యకర్తల గుండెలు

పార్టీ కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్న సాధారణ కార్యకర్తల గుండెలు మండుతున్నాయని, వారి ఆవేదనను నాయకులు గుర్తించడం లేదని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం పైస్థాయిలో ఉన్న కొద్దిమంది నాయకుల ఈగో వల్ల కిందిస్థాయిలో పార్టీ తీవ్రంగా నష్టపోతోందని మండిపడ్డారు. ఇప్పటికైనా అధిష్టానం జోక్యం చేసుకుని తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాజాసింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Related News

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

Big Stories

Advertisement
×