E-Paper
Advertisement

ఇంటింటి రామాయణం.. మార్చి 31 : కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం.. పల్లవి మాస్టర్ ప్లాన్.. చక్రధర్ కు షాక్..

ఇంటింటి రామాయణం.. మార్చి 31 : కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం.. పల్లవి మాస్టర్ ప్లాన్.. చక్రధర్ కు షాక్..
Advertisement

Intinti Ramayanam Today Episode March 31st : నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేశ్వరి నీ మీద చాలా కోపంగా ఉంది కదా ఏమనింది కచ్చితంగా నేను తిట్టే ఉంటుంది కదా అని పార్వతి అడుగుతుంది.. అవును అత్తయ్య నన్ను దారుణంగా పెట్టింది. కానీ మా నాన్న మాత్రం నన్ను సంతోషపరిచేలా చేశారు. పూజ కోసం నేను వస్తాను అంత సిద్ధం చేసుకోండి అని అన్నారు అని అవని అంటుంది.. పోనీలే మీ అమ్మ కోరిక మీ నాన్న తీర్చాలని అనుకుంటున్నాడు రేపు పూజకి అంతా సిద్ధం చేద్దామని పార్వతి అంటుంది.. ఇక తర్వాత అక్షయ్ ఈ మాత్రం పార్వతిని అడగాలనుకుంటున్న విషయాన్ని అడగకుండా చేస్తుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసిన పల్లవి ఈ పూజకి డాడ్ ని రాకుండా చేయాలి అప్పుడు అవని తిక్క కుదురుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. పాతికేల్లా నిరీక్షణ తర్వాత మీ అమ్మ కోరిక నెరవేరుతుంది కదా పూజకు సంబంధించిన పనులన్నీ నేను చూసుకుంటాను అని అక్షయ్ అంటాడు..

వీళ్ళు పూజకి ఎలాగైనా ఆటంకం కలిగించాలి అంటే మా నాన్న అనే వాడు లేకుండా చేయాలి అని పల్లవి అనుకుంటుంది.. వీళ్ళ అమ్మకి అవనికి మా నాన్న దగ్గరైతే, నాకు మా మామ కి డాడ్ దూరం అయిపోతాడు.. తర్వాత అందరూ కూడా మమ్మల్ని చూసి నవ్వుకుంటారు.. ఇదంతా జరగకూడదు అంటే మా డాడీ ప్రాణాలతో ఉండకూడదు అని పల్లవి అనుకుంటుంది.. భోజనంలో విషం కల్పిస్తుంది కానీ చక్రధర్ తినకపోవడంతో పల్లవి ప్లాను దారుణంగా ఫీల్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. గుడికి వెళ్ళడానికి అందరూ కూడా పద్ధతిగా పట్టు వస్త్రాల్లో తయారయ్యి వస్తారు. పార్వతి మిమ్మల్ని ఇలా చూస్తుంటే అందరి దిష్టి తగిలేలా ఉంది నేను దిష్టి తీస్తాను అని అంటుంది..శ్రీరామనవమి సందర్భంగా పూజ కోసం అందరూ గుడికి వెళ్తారు. పార్వతి వాళ్ళని చూసిన పంతులుగారు మీరు వచ్చారు చాలా సంతోషంగా ఉంది. మీరు మీ వారు ప్రతి ఏడాది కూడా సీతారాముల కళ్యాణం కు మంగళసూత్రం ఇస్తారు. ఇవాళ జరిగే కళ్యాణానికి కూడా మీ కుటుంబ సభ్యులే మంగళసూత్రం ఇవ్వడం చాలా మంచిది చాలా సంతోషంగా ఉంది. అమ్మ అని అంటాడు ఇక రండి ముందుగా మీరు విగ్రహాలకు అభిషేకం చేయించాలి అని పంతులుగారు చెప్పడంతో అందరూ సరే అని అంటారు.. ఇక అందరూ కలిసి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొని వచ్చి గుడిలో కళ్యాణం కోసం ఏర్పాటుచేసిన స్థలంలో ఉంచుతారు.

అయితే పార్వతి కమల్ పల్లవిలను ప్రదక్షిణాలు చేయమని పంపిస్తుంది . అదేంటి ఎవరు చేయకుండా మేమిద్దరమే ప్రదక్షిణాలు చేయడం ఏంటమ్మా అని కమలడుగుతాడు. పిల్లలు కలగని వాళ్ళకి అక్కడ 18 చుట్లు ప్రదక్షిణాలు చేస్తే పిల్లలు వెంటనే కలుగుతారు అని నమ్మకం.. ముందు మీరు వెళ్లి ప్రదక్షిణాలు చేయపొండి అని పార్వతి పంపిస్తుంది.. బయటికి వెళ్ళిన తర్వాత కమల్ చేయు ప్రదక్షిణాలు చేయు అనగానే పల్లవి షాక్ అవుతుంది.. ఏంటి ప్రదక్షిణాలు నేను ఒక్కదాన్నే చేయాలా అత్తయ్య గారు ఇద్దరూ చేయమని పంపించారు కదా అని అంటుంది.. అవును ఇద్దరినీ చేయమంది కానీ నాకు దేవుడి మీద భక్తి ఉంది అలాగే పెద్దలంటే గౌరవం ఉంది కాబట్టి నేను చేయాల్సిన అవసరం లేదు నువ్వు చేయాలి అని కమలంటాడు..

Advertisement

ఎండలో అక్కడ ప్రదక్షణాలు చేయడానికి పల్లవి చాలా ఇబ్బంది పడుతుంది.. మొత్తానికి కమల్ ప్రదక్షిణాలను పల్లవి చేత పూర్తి చేస్తాడు.. అందరూ లోపలికి వెళ్లి కూర్చొని ప్రణతి వాళ్ళు ఇంకా రాలేదేంటి అని అక్షయ్ అడుగుతాడు. అప్పుడే ప్రణతి మీనాక్షి ఇద్దరు కూడా ఆటోలో నుంచి దిగుతారు వాళ్ళిద్దరినీ వెళ్లి ఆమె దగ్గర నుండి లోపలికి తీసుకొని వస్తుంది.. ఏంటి భరత్ రాలేదు అంటే అతనికి ఏదో పని ఉందంట రావడానికి కుదరదు అని చెప్పాడు అని ప్రణతి అంటుంది. ఇక అందరూ కలిసి అమ్మవారికి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు.. ఇక తర్వాత కళ్యాణ సమయం దగ్గర పడిపోతుంది మీవారు వచ్చారా అని పంతులుగారు అడుగుతారు.

చక్రధర్ పూజ కోసం వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటాడు.. భానుమతి అ మీనాక్షి పక్కన కూర్చుని మీ ఆయన పూజ చేస్తే.. ఇక మీ ఆయన నీకు శాశ్వతంగా దూరం అయిపోతాడు అని చెప్పగానే రాజేశ్వరి తను ఎలాగైనా పూజకు వెళ్ళనివ్వకుండా ఆపాలని అనుకుంటుంది.. చక్రధర్ రెడీ అవుతుంటే గదిలోకి వెళ్లి అక్కడ నిలిచి ఉంటుంది. రాజేశ్వరిని చూసిన చక్రధర్ నా గదిలోకి రావద్దు నువ్వు అన్నావు.. ఇప్పుడు నువ్వే గదిలోకి వచ్చావు అని సంతోషంగా ఉంటాడు.. కానీ రాజేశ్వరి మాత్రం ఏమీ మాట్లాడకుండా చక్రధర్ ఫోన్ తీసుకొని బయట గొల్లం పెట్టేస్తుంది.. అది గమనించిన చక్రధర్ నేను పూజకు వెళ్లాలి ఇలా చేయడం మహా పాపమని ఎంతగా చెప్తున్న సరే రాజేశ్వరి మాత్రం తలుపు తీయదు..

Also Read :‘కార్తీక దీపం ‘ జ్యోత్స్న ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసిందో తెలుసా..?

కళ్యాణం కి సమయం సమీపిస్తుంది మీ వారు వచ్చారా మంగళసూత్రం ఇవ్వడానికి దంపతులు కావాలి కదా అని మీనాక్షిని పంతులుగారు అడుగుతారు.. అవని దారిలో ఉన్నా రండి వస్తున్నాడు అని అంటుంది.. ఫోన్ చేయగానే ఇంకా చక్కెర రాలేదు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది.. ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన రాజేశ్వరి మీ నాన్న పూజకు రాడు రాలేదు అని అనగానే షాక్ అవుతుంది.. ఇక అవని చేసేదేమీ లేక తలంబ్రాలను శ్రియా శ్రీకర్నివమని చెప్తుంది.. చక్రధరి ఇంకా రాలేదు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది.. పల్లవి కి ఫోన్ చేసినా రాజేశ్వరి మీ నాన్న ఇక రాడు అని చెప్పగానే చాలా సంతోషంగా ఉంటుంది.. అక్కడికి ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో పల్లవిని చక్రధర్ చంపబోతాడు ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది చూడాలి…

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×