E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: రొమాంటిక్ డ్యాన్స్ తో రెచ్చిపోయిన జంటలు.. సుక్కు ప్లాన్ ఫెయిల్.. బుక్కయిన వల్లి..

Illu Illalu Pillalu Today Episodes: రొమాంటిక్ డ్యాన్స్ తో రెచ్చిపోయిన జంటలు.. సుక్కు ప్లాన్ ఫెయిల్.. బుక్కయిన వల్లి..
Advertisement

Illu Illalu Pillalu Today Episode May 13th: వల్లి చందు కోసం పాలని తీసుకుని వెళుతుంది. ఆ పాలను తాగిన చందు మత్తుగా మారిపోతాడు. శ్రీవల్లి పాలను తాగేసాడు ఇప్పుడు మేము కలిసిపోవచ్చు అని చాలా సంతోషంగా ఉంటుంది. ఇక మొత్తానికి శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అవుతుంది. కన్యతో ఆ విషయం గురించి చెప్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఆ బంధం బలపడి శ్రీవల్లి తల్లి అవుతుందేమో చూడాలి..

రొమాంటిక్ డ్యాన్స్ తో రచ్చ..

పాలను తాగిన తర్వాత ఇటు ప్రేమ అటు నర్మదా పూర్తిగా మారిపోతారు. ప్రేమ ధీరజ్ మీదకి ఎక్కేసి అతన్ని తెగ గెలకేస్తుంది. అదేవిధంగా నర్మద కూడా సాగర్ వద్దంటున్నా సరే దగ్గరికి లాక్కుంటూ అతనికి ముద్దు పెట్టాలని ప్రయత్నాలు చేస్తుంది.. ఇద్దరు తోడికోడల్లు తమ మొగుళ్ళతో చేసిన అల్లరి అంతా ఇంతా కాదు.. ప్రేమ కో అందమా కోకచాటు ఆకు రాయి అంటూ రొమాంటిక్ సాంగ్ తో అదిరిపోయే స్టెప్పులు వేస్తుంది. అటు నర్మద కూడా ముద్దు కావాలి అంటూ పెద్ద రచ్చ చేస్తుంది.. వీరిద్దరిని ఈ పరిస్థితుల్లో చూసినా వాళ్ళ మొగుళ్ళు ఏమయింటుందని షాక్ లో ఉండిపోతారు.. ఆ తర్వాత ఈ రొమాంటిక్ సాంగ్ తో ఎపిసోడ్ కాస్త హైలెట్గా మారుతుంది.. రాత్రంతా వీళ్ళు చేసిన హంగామా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది..

వల్లికి షాకిచ్చిన చందు..

Advertisement

పాలు తాగిన తర్వాత వల్లిని చందు దగ్గర తీసుకుపోతాడు.. అయితే రొమాంటిక్ మూడ్ లో ఉన్న చందు ని ఇప్పుడే వస్తాను బావ ఆగండి అంటూ వల్లి బయటకు వస్తుంది.. సుకన్యకు ఈ విషయం చెప్పాలని వల్లి సుకన్యను వెతుక్కుంటూ వచ్చి ఆ విషయం చెబుతుంది.. వీళ్ళిద్దరు కూడా కాసేపు డ్యూయెట్ సాంగ్ తో అదిరిపోయే స్టెప్పులు వేస్తారు. మొత్తానికి ఈ ఎపిసోడ్ లో మూడు జంటల డాన్స్ తో హైలెట్గా నిలుస్తుంది. అయితే వల్లి అనుకున్న కళ నెరవేరకుండా పోతుంది.. పాలు తాగిన తర్వాత చందు వల్లి బయటకు వెళ్లడంతో గుర్రు పెట్టి నిద్రపోతాడు.. ఎలాగైనా సరే తల్లి కావాలన్నా వల్లి మొదటి ప్రయత్నం దారుణంగా ఫెయిల్ అవుతుంది. చందు వల్లికి దిమ్మతిరిగిపోయేలా షాక్ ఇస్తాడు..

సుకన్య కోసం తిరుపతి వేట..

తిరుపతి కూడా పాలను తాగుతాడు.. ఇంట్లో ఉన్న సుకన్య కోసం నేను వచ్చేస్తున్నాను నువ్వు కాసుకో అంటూ రంకెలు వేసుకుంటూ తనని వెతుక్కుంటూ వెళ్తాడు.. తిరుపతి కేకలు విన్న సుకన్య అతనికి ఎలాగైనా సరే దూరంగా ఉండాలి అని అంటుంది. మిగిలిన జంటలు రొమాంటిక్ సాంగులతో రచ్చ చేస్తే.. సుకన్య మాత్రం ఈ రాత్రి తనకు కాల్ రాత్రి అవ్వకూడదు అని తిరుపతి నుంచి తప్పించుకోవాలని పారిపోతూ ఉంటుంది. తిరుపతి సుకన్య కోసం ఎంతగా వెయిట్ చేస్తుంటాడో వెళ్లి ధీరజ్ని పట్టుకుంటాడు.. మాలాంటి పెళ్లి కాని వాళ్ళకి ఇంకా పెళ్లి కాకుండానే చేయాలి సన్యాసాన్ని తీసుకునేలా చేస్తారా అని తిరుపతి అక్కడి నుంచి నిరాశగా వెళ్ళిపోతాడు.

అడ్డంగా దొరికిన శ్రీవల్లి..

Advertisement

రాత్రి పాలు తాగిన తర్వాత నాకు చాలా తలనొప్పి తీస్తుంది ఎలాగైనా సరే కాఫీ తాగాలి అని నర్మదా వంట గదిలోకి వెళ్తుంది. అప్పుడే వంట గదిలో ఉన్న సుకన్య పాయసం చేస్తూ రీల్స్ చేస్తూ ఉంటుంది. పొద్దున్నే పాయసం ఎవరికోసం చేస్తున్నావు అని నర్మదా అడుగుతుంది.. ఈ కడుపుతో ఉంది కదా వల్లి కోసమే ఇది చేస్తున్నాను అని చెప్పగానే నర్మదకు అనుమానం వస్తుంది. ఇక పాయసం తీసుకుని వల్లి గదిలోకి వెళ్లిన శ్రీ సుకన్యకు వల్లి తీరును చూసి అనుమానం వస్తుంది.. రాత్రి ఏం జరగలేదా ఎందుకు ఏమైంది అని అడుగుతుంది.. వీళ్ళ మాటలు విన్న నర్మదా మీరిద్దరు మాట్లాడుకుని నేను విన్నాను ఏ మందు కలిపింది.. ఏ మందు కలిపావు పాలల్లో అని అడుగుతుంది. వీళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు కదా తనువులు కలిస్తే బాగుంటుంది అని పాలల్లో చిన్న మందు కలిపాను కానీ అది ఫెయిల్ అయింది అని సుకన్య అంటుంది.

శ్రీవల్లి మాట నమ్ముతుందా..?

అవును చెల్లాయి మీ బావగారు నన్ను ఇంటికి తీసుకొచ్చారు తప్ప నాతో బాగా లేరు.. నన్ను భార్యగా చూడడం లేదు అందుకే ఇలా చేసాము అని అనగానే నర్మదా ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతుంది.. అయితే సుకన్య శ్రీవల్లీలు మరోసారి ప్లాన్ చేసి చందు నీ బుట్టలో వేసుకోవాలని అనుకుంటారు.. నర్మదకు అనుమానం రాకుండా ఏదైనా చేయాలి అని శ్రీవల్లి అనుకుంటుంది..

ప్రేమకు షాకిచ్చిన ధీరజ్..

ప్రేమ గదిలోకి వెళ్తుంటే ధీరజ్ ఆపుతాడు.. ఏంట్రా గదిలోకి వెళ్ళనివ్వకుండా ఆపుతున్నవ్ ఏంటి ఏం జరిగింది నీకు అని ప్రేమ అడుగుతుంది.. ఇందులోకి వెళ్లి ఏం చేస్తావు అని అడుగుతాడు.. లోపలికి వెళ్ళగానే తలుపేస్తావు ఆ తర్వాత నడుము గిల్లుతావు ఆ తర్వాత ఇంకా ఏదో చేస్తావు అని ధీరజ్ ప్రేమతో అంటాడు.. నువ్వు రాత్రంతా ఇదే చేసింది అని ధీరజ్ చెప్తున్నా సరే ప్రేమ మాత్రం అస్సలు నమ్మదు.. వీళ్లిద్దరి సయ్యాట ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read : ‘పొదరిల్లు ‘ సీరియల్ లవర్స్ కు బిగ్ షాక్.. మహా అవుట్..!

Related News

Kissik Talks: నిజాలు అక్కర్లేదు.. ఆరేళ్ల బంధంపై సోనియా ఊహించని కామెంట్!

Gundeninda GudiGantalu Today episode: చింతామణి నెక్స్ట్ ప్లానేంటి..? బాలు పై అరుణ్ రివేంజ్.. శృతి ఎంత పని చేసింది..?

Podarillu Today Episode : కేశవ, శైలు రొమాన్స్..అడ్డంగా దొరికిపోయిన శైలు.. విడాకుల కోసం కోర్టుకు మహా..

Illu Illalu Pillalu Today Episodes: గుడ్ న్యూస్ చెప్పిన ధీరజ్.. వల్లికి అనుమానం.. ప్రేమపై నర్మద సీరియస్..

Intinti Ramayanam Today Episode: పల్లవికి శ్రీయ స్ట్రాంగ్ వార్నింగ్.. పాపం పల్లవి.. కన్నీళ్లు పెట్టుకున్న అవని..

Podarillu Maneesha : ‘ పొదరిల్లు ‘ మనీష ఏం చదివిందో తెలుసా..?

Janaki Parinayam Vishnu : ‘జానకి పరిణయం ‘ విష్ణు జీవితంలో కష్టాలు.. కన్నీళ్లు పెట్టించే స్టోరీ..

Telugu Serials : కన్నడ హీరోయిన్ల భర్తలు ఏం చేస్తుంటారో తెలుసా..?

Big Stories

Advertisement
×