E-Paper
Advertisement

Tamilnadu Politics: సీఎం విజయ్‌‌కు పొలిటికల్ పరీక్ష.. చీఫ్ విప్‌గా కారు డ్రైవర్ కొడుకు శబ్రినాథన్

Tamilnadu Politics: సీఎం విజయ్‌‌కు పొలిటికల్ పరీక్ష.. చీఫ్ విప్‌గా కారు డ్రైవర్ కొడుకు శబ్రినాథన్
Advertisement

Tamilnadu Politics: తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమైంది విజయ్ ప్రభుత్వం. అయితే ఫ్లోర్ టెస్ట్‌కు ముందు తమిళనాడులో వేగంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా విరుగంబాక్కం నియోజకవర్గం ఎమ్మెల్యే, కారు డ్రైవర్ కొడుకు శబ్రినాథన్ చీఫ్ విప్‌గా నియమించారు సీఎం విజయ్.

సీఎం విజయ్‌‌కు పొలిటికల్ పరీక్ష

Advertisement

తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమైంది విజయ్ ప్రభుత్వం. అయితే ఫ్లోర్ టెస్ట్‌కు ముందు తమిళనాడులో వేగంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా విరుగంబాక్కం నియోజకవర్గం ఎమ్మెల్యే, కారు డ్రైవర్ కొడుకు శబ్రినాథన్ చీఫ్ విప్‌గా నియమించారు సీఎం విజయ్.

తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వానికి సీఎం విజయ్ నేతృత్వం వహిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకు బలపరీక్ష ఎదుర్కొంటున్నారు. 234 మంది సభ్యులున్న తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటర్లు పూర్తి మెజార్టీ ఇవ్వలేదు. అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించింది.

Advertisement

బలపరీక్షకు అంతా రెడీ.. చీఫ్ విప్‌గా కారు డ్రైవర్ కొడుకు శబ్రినాథన్

ఈ నేపథ్యంలో కాంగ్రెస్, వీసీకే, వామపక్ష పార్టీలు , ముస్లిం లీగ్ మద్దతు ఇవ్వడంతో టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో టీవీకే కూటమి బలం 120కి చేరింది. బలపరీక్షలో పాస్ కావాలంటే అధికార పార్టీకి కనీసం 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఒక్క ఓటుతో గెలిచిన టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతిని అసెంబ్లీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హైకోర్టు మంగళవారం ఆదేశించింది.

జరుగుతున్న పరిణామాలను తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేశారు సీఎం విజయ్. ముఖ్యంగా మద్దతు ఇచ్చిన, ఇవ్వని పార్టీల అధినేతల ఇంటికి వెళ్లి వారితో మాట్లాడారు సీఎం విజయ్. దీంతో వారి వైపు నుంచి సానుకూలం పవనాలు వీస్తున్నాయి. ఇదే సమయంలో మంగళవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

ALSO READ: ‘బంగారం కొనకండి’.. ఇందిరా గాంధీ పాత పేపర్ క్లిప్పింగ్ నిజమేనా?

అన్నాడీఎంకె రెండు గ్రూపులుగా చీలిపోయింది. దీంతో షణ్ముగం ఇంటికి వెళ్లి స్వయంగా ఆయనతో మాట్లాడారు సీఎం విజయ్. తమ పార్టీకి చెందిన 30 మంది ఎమ్మెల్యేల మద్దతు ప్రభుత్వానికి ఇస్తామని ఆయన బహిరంగ ప్రకటన చేశారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బల పరీక్షలో గెలవడం సునాయాసం కానుంది.

రాజకీయ పరిణామాలు జరుగుతుండగా ముఖ్యమంత్రి విజయ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కారు డ్రైవర్ కొడుకు శబ్రినాథన్ టికెట్ ఇవ్వడం, ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన్ని ప్రభుత్వం చీఫ్‌విప్‌గా నియమించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ నియామకం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

తమ ప్రభుత్వం సామాన్యులకు, విధేయతకు పెద్దపీట వేస్తుందని చెప్పకనే చెప్పారు సీఎం విజయ్. సామాన్యుడికి ఉన్నత పదవి దక్కడంపై కొందరు ప్రశంసిస్తున్నారు. విమర్శించినవారు లేకపోలేదు. అనుభవం లేని వ్యక్తికి కీలకమైన పదవిని ఇవ్వడం సరికాదని విమర్శిస్తున్నారు.

Related News

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. ఉత్తరాఖండ్‌లో హిమానీనదాల మాటేంటి? ముప్పు పొంచివుందా?

ప్రధాని మోదీ మరోసారి విజ్ఞప్తి.. బంగారం కొనుగోళ్లపై కీలక వ్యాఖ్యలు, స్వదేశీ మంత్రంతోపాటు

Big Stories

Advertisement
×