BAN VS PAK: బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ ( Bangladesh vs Pakistan) మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్నటితో మొదటి టెస్ట్ పూర్తికాగా… రెండో టెస్టు జరగాల్సి ఉంది. అయితే ఢాకా వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది. పాకిస్తాన్ పైన ఏకంగా 104 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది బంగ్లాదేశ్. తమ సొంత గడ్డపై పాకిస్తాన్ జట్టును ఓడించిన సరికొత్త హిస్టరీని నమోదు చేసుకుంది బంగ్లాదేశ్. అయితే ఈ క్రమంలో మోడీ టెస్ట్ లో అద్భుతంగా రాణించిన నజ్ముల్ హొస్సేన్ శాంటోకు ( Nazmul Hossain Shanto ) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ క్రమంలో అతనికి ఎలక్ట్రిక్ స్కూటర్ ను (electric scooters ) ప్లేయర్ ఆఫ్ ది అవార్డు కింద గిఫ్ట్ ఇచ్చారు. అయితే ఈ గిఫ్ట్ పైన సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ నడుస్తున్నాయి.
బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ ( Bangladesh vs Pakistan) మధ్య జరిగిన మొదటి టెస్టు సందర్భంగా నజ్ముల్ హొస్సేన్ శాంటో ప్లేయర్ ఆఫ్ ద అవార్డు కింద ఎలక్ట్రిక్ స్కూటర్ ను సొంతం చేసుకున్నాడు. ఈ స్కూటర్ ధర కేవలం రూ. 40,000 అన్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ రోడ్డున పడిందని ఇండియన్ ఫ్రాన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఒకప్పుడు క్రికెటర్లకు కార్లు, లక్షల్లో డబ్బులు ఇచ్చిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్.. ఇండియాతో పెట్టుకున్న తర్వాత దిగజారిపోయిందని సెటైర్లు పేల్చుతున్నారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ తర్వాత బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పూర్తిగా నష్టపోయిందని వెల్లడిస్తున్నారు. అందుకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కింద ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తున్నారని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అదే బీసీసీఐ అయితే SUV, లగ్జరీ కార్లను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కింద అందించేదని చెబుతున్నారు. 40 వేల స్కూటర్లను బీసీసీఐ అస్సలు ఇచ్చేది కాదు అంటున్నారు.
మొన్న టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ జరిగినప్పుడు అర్ధాంతరంగా బంగ్లాదేశ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ టోర్నమెంట్ నేపథ్యంలో ముస్తాఫిజుర్ రహమాన్ పైన వేటు వేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ నేపథ్యంలోనే ఐపిఎల్ ప్రసారాల పైన గత బంగ్లాదేశ్ ప్రభుత్వం బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. ఇక టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో శ్రీలంకలో తమ మ్యాచ్ లు నిర్వహించాలని బంగ్లాదేశ్ కోరింది. దీనికి ఐసిసి నో చెప్పడంతో.. బంగ్లాదేశ్ బహిష్కరించింది. టి20 ప్రపంచ కప్ 2026 నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడంతో.. ఆ దేశ క్రికెట్ బోర్డు కు తీవ్ర స్థాయిలో నష్టం జరిగింది. దాని ఫలితమే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు అంటూ ఇండియన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు.
Bangladesh players getting electric scooters for winning a Test match while Indian players casually collect SUVs and luxury cars after bilateral series wins 😭
That’s the difference between celebrating a historic moment… and being used to dominating world cricket for decades.… pic.twitter.com/Zw9MVRaKS7
— Brutal Truth (@sarkarstix) May 12, 2026