E-Paper
Advertisement

Road Accident: లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. నుజ్జైన ముందుభాగం, నందిగామలో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident: లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. నుజ్జైన ముందుభాగం, నందిగామలో ఘోర రోడ్డు ప్రమాదం
Advertisement

Road Accident: అతివేగం ప్రమాదకరం.. రోడ్లపై ఆ తరహా బోర్డులు కనిపిస్తాయి. అయినా వాహనాదారులు ఏ మాత్రం తగ్గలేదు. ఇక ప్రైవేటు బస్సుల గురించి చెప్పినక్కర్లేదు. వేగంగా వెళ్లాలన్న కంగారులో ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నాయి. తాజాగా ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు, ఓ లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో దాదాపు 10 మంది వరకు గాయపడ్డారు. అసలేం జరిగింది?

నందిగామలో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement

ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ ట్రావెల్స్‌ బస్సు లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో దాదాపు 10 మంది వరకు తీవ్రగాయాలు అయ్యాయి. ఘటన సమయంలో బస్సులో దాదాపు 20 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు.

క్షతగాత్రులను అంబులెన్సులో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.  సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తోంది కావేరీ ట్రావెల్స్‌కి చెందిన ఓ బస్సు.  హైవేపై లారీని ఓవర్ టేక్ చేయబోయింది. ఈ క్రమంలో వేగంగా మరో లారీని ఢీకొట్టింది.

Advertisement

లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు

ప్రమాద తీవ్రతకు  బస్సు ఎడమ భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. 10 మంది వరకు గాయాలు అయ్యాయి. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.  గాయపడినవారిలో ముగ్గురు మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు.  ప్రమాదం తర్వాత ఆ రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది.

క్రేన్ సాయంతో వాహనాన్ని పక్కకు పెట్టి, ట్రాఫిక్ క్లియర్ చేశారు పోలీసులు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. బస్సుతోపాటు లారీ డ్రైవర్లను పోలీసులు విచారిస్తున్నారు. అలాగే ప్రయాణికుల నుంచి ఘటనకు సంబంధించిన సమాచారం సేకరించారు పోలీసులు.

ALSO READ: బేగంపేట్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో ముగ్గురు

 

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×