E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: నర్మద పై కలెక్టర్ ప్రశంసలు.. రామరాజు గౌరవాన్ని కాపాడిన కోడళ్లు.. ధీరజ్ ప్రేమకు ప్రపోజ్..

Illu Illalu Pillalu Today Episode: నర్మద పై కలెక్టర్ ప్రశంసలు.. రామరాజు గౌరవాన్ని కాపాడిన కోడళ్లు.. ధీరజ్ ప్రేమకు ప్రపోజ్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode October 13th: నిన్నటి ఎపిసోడ్ లో.. నర్మదా ప్రేమ ఇద్దరు కూడా రామరాజు అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటారు. ఇద్దరు కోడళ్ళు నా ఇంటి పరువును తీస్తున్నారు అన్నారని బాధపడతారు. శ్రీవల్లి అమూల్యను తీసుకొని వస్తానని విశ్వంతో అంటుంది. అమూల్యని అక్కడ వదిలేసి శ్రీవల్లి వెళ్ళిపోతుంది. విశ్వం అమూల్య దగ్గరకొచ్చి పులిహోర కలుపుతూ ఉంటాడు. బలవంతంగా నీకు గాజులు కొనిస్తాను అని అంటాడు.. కామాక్షి ఎక్కడికొచ్చిందా చెల్లి చెయ్యి పట్టుకుంటావా నీకు ఎంత ధైర్యం రాని అంటుంది. వాళ్ళ ఆయన తీసుకొని వచ్చి కొట్టిస్తానని అంటుంది. కానీ విశ్వం ని చూసిన అతను అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు.. నర్మదా ప్రేమ దగ్గరకు వచ్చి మావయ్య గారు అన్న విషయాలు పట్టించుకుంటే బాధగానే ఉంటుంది. వాటిని పక్కన పెట్టి నువ్వు ధీరజ్ ని ప్రేమించడం ఎలా? నీ ప్రేమను చెప్పడం ఎలా? అని ఆలోచించు అంటూ నర్మదా సలహా ఇస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. నర్మద కలెక్టర్ ని పలకరిస్తుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో నిజాయితీగా పనిచేసే అవార్డు తీసుకునింది మీరే కదా అని కలెక్టర్ అడుగుతాడు. అవార్డు మాత్రమే కాదు సార్ నాకు ప్రమోషన్ కూడా వచ్చింది. అని నర్మదా అనగానే ఆయన వెరీ గుడ్ అమ్మ నువ్వు ఇలానే పని చేసుకుంటూ వెళ్లి మంచి అవార్డులను తీసుకోవాలి అని కోరుకుంటున్నా అని కలెక్టర్ అంటాడు. కలెక్టర్ తో నర్మద మాట్లాడడం చూసిన రామరాజు షాక్ అయిపోతాడు. ఇక నర్మదా మీరు ఏమనుకోనంటే మా కుటుంబాన్ని పరిచయం చేస్తాను అని అంటుంది. రామరాజుని కలెక్టర్ కి పరిచయం చేస్తుంది. కొద్ది నిమిషాల ముందు నా పరువును తీస్తున్నారు అన్న మాటలని రామరాజు జీర్ణించుకోలేకపోతాడు. మొత్తానికి నర్మదా కలెక్టర్ తో మాట్లాడిన విషయంపై రామరాజు సంతోషంగా ఉంటాడు.

Advertisement

మా మామయ్య 20 మందికి పని కల్పిస్తూ ఆదర్శంగా నిలిచారు అని నర్మద చెప్పిన మాటను తలుచుకొని మురిసిపోతూ ఉంటాడు. ఇక తర్వాత కలెక్టర్ ఎస్సై గారు గుడిలో ఎవరో చిన్న పాప తప్పిపోయిందని అనౌన్స్ చేశారు కదా ఆ పాప దొరికిందా అని అడుగుతాడు. అవును సార్ దొరికింది కానీ మేము వెతకలేదు ఒక అమ్మాయి తెలివిగా వెతికి ఆ పాపని తన తల్లిదండ్రుల వద్దకు చేర్చింది అని అంటారు. అవునా ఎవరు అమ్మాయి అని అనగానే ప్రేమ ధీరజ్ చిన్న పాపను తీసుకుని అక్కడికి వస్తారు. ఈ అమ్మాయి చాలా తెలివిగా అమ్మాయికి ఇష్టమైన పాటను పాడుతూ తన తల్లిదండ్రుల దగ్గరికి పాపని చేర్చింది అని పోలీసులు అనగానే కలెక్టర్ ప్రశంసలు కురిపిస్తాడు.

పక్కనే ఉన్న నర్మదా ఈమె నా తోడికోడలు సార్ అని అంటుంది. రామరాజు గారు మీ ఇద్దరు కోడలు మీ గౌరవాన్ని పెంచుతున్నారండి ఇద్దరు చాలా తెలివైన వాళ్ళు అని అనగానే రామరాజు సంతోష పడతాడు. కలెక్టర్ వెళ్ళగానే వేదవతి తన ఇద్దరు కోడల్ని తీసుకొని నా ముద్దుల కోడళ్లు అంటూ మురిసిపోతుంది.. ఇక శ్రీవల్లి తన తల్లిని దలుచుకొని నాకు వీళ్ళని చూస్తుంటే కుల్లేస్తుంది అంటూ అరుస్తుంది.. గుడి బయట వెతుకుతూ ఉండగా భాగ్యం ఆనందరావు బజ్జీలు అమ్మడం చూసి శ్రీవల్లి షాక్ అవుతుంది.

Advertisement

మీరు ఇక్కడ బజ్జీలు అమ్మడం మా మామయ్య గారు చూస్తే ఇంకేమైనా ఉందా అని అంటుంది. ఆల్రెడీ మీ మామయ్య గారు చూడడం అయిపోయింది మేము చెప్పడం అయిపోయింది అంత జరిగిపోయింది నువ్వేమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని భాగ్యం ఓదారుస్తుంది. ఆ ఇద్దరి కోడళ్ళ వల్ల ఈరోజు మా మామయ్య చాలా సంతోషంగా ఉన్నాడు. వాళ్ళిద్దరూ గౌరవాన్ని పెంచుతున్నారు అని అనగానే మామయ్య ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడు ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని దెబ్బ కొట్టాలి అని శ్రీవల్లి అంటుంది.

Also Read : నిజం చెప్పిన పల్లవి.. ఇంట్లోంచి గెంటేసిన కమల్.. అవనికి అక్షయ్ క్షమాపణలు..

ఇక ప్రేమ ఆలోచిస్తూ ఉండడం చూసిన నర్మదా ప్రేమ దగ్గరికి వచ్చి నువ్వు గ్రేట్ లేడీ అది ఇది అంటూ పొగడ్తలతో ముంచెత్తుతుంది. నీ తెలివికి ఊరందరు నీకు సన్మానం చేయాలని అనుకుంటున్నారు. ఏంటక్కా నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావ్ చిన్న పాప తప్పిపోతే అలా చేయడం తప్ప అని అడుగుతుంది. నువ్వు ధీరజ్ కి నీ ప్రేమ విషయం చెప్పడం తప్ప అన్ని మంచి పనులే చేస్తున్నావని నర్మదా అంటుంది. ఇప్పుడు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ధీరజే నీకోసం వస్తున్నాడు చూడు అని అంటుంది. ధీరజ్ నిజంగానే చేతిలో కవర్ పట్టుకొని రావడం చూసిన ప్రేమ సంతోషపడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

Big Stories

Advertisement
×