Bigg Boss 9: తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 షో ఇప్పుడు కాంట్రవర్సీ బ్యూటీలతోనే నిండిపోయిందని చెప్పవచ్చు. తాజాగా వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన 6 మంది కంటెస్టెంట్స్ కూడా ఇటీవల సోషల్ మీడియాలో భారీగా నెగెటివిటీ మోటగట్టుకున్న వారే. అలాంటి వారిలో మోక్షా రమ్య (Ramya moksha)కూడా ఒకరు. ఇటీవల అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదంతో ఒక్కసారిగా పాపులర్ అయిన ఈ ముగ్గురు అక్కచెల్లెళ్ళు నెటిజన్స్ దెబ్బకి బిజినెస్ క్లోజ్ చేసుకున్నారు. ఇప్పుడిప్పుడే సమస్యల నుండి బయటపడుతూ కొత్తగా మళ్లీ బిజినెస్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే.
అందులో భాగంగానే ఇటీవల కాంట్రవర్సీ మాటలతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ లో ఒకరైన రమ్య మోక్ష.. తాజాగా వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టింది. అందులో భాగంగానే హౌస్ లోకి వెళ్ళకముందే తన జర్నీ గురించి ఏవీ వీడియోలో చెబుతూ.. ఎమోషనల్ అయ్యింది.” రాజమండ్రిలో రోజ్ మిల్క్ ఎంత ఫేమస్సో.. నేను కూడా అంతే ఫేమస్.. మాది ఒక చిన్న ఫ్యామిలీ అమ్మానాన్న.. నేను, అలేఖ్య, సుమ.. ఇదే మా కుటుంబం” అంటూ చెప్పింది. అలాగే తన తండ్రి ఆఖరి చూపు చూసుకోలేక పోయాను అంటూ ఎమోషనల్ అయింది.
ఏవీలో భాగంగా రమ్య మాట్లాడుతూ.. “నాకు ఫిట్నెస్ అంటే ఎంతో ఇష్టం. నేను చేసిన ఫిట్నెస్ వీడియోలకు భారీగా క్రేజ్ పెరిగింది. సోషల్ మీడియాలో అలా ఫేమస్ అవడం వల్లే పచ్చళ్ల బిజినెస్ మొదలుపెట్టాము. తక్కువ సమయంలోనే మా వ్యాపారం బాగా పెరిగింది. అయితే ఒకరోజు నేను సినిమా షూటింగ్ ఉందని కొడైకెనాల్ కి వెళ్లాను. ఆరోజు ఉదయం 5 గంటలకు నాన్న చనిపోయారు. నేను వచ్చేసరికి నాన్న అంత్యక్రియలు పూర్తి చేశారు. నేను ఎంతో బ్రతిమలాడాను. కనీసం రెండు నిమిషాలు ఉంచండి.. నాన్న కడసారి చూపు చూసుకుంటాను అని.. కానీ అప్పటికే సమయం ఆసన్నమైందని అంత్యక్రియలు జరిపించేశారు.. ఇప్పటికీ ఆ నరకం అనుభవిస్తూనే ఉన్నాను.ఆ రోజు నేను షూట్ కి వెళ్లకుండా ఉండాల్సింది. ఆ సినిమా చేయకుండా ఉండాల్సింది అని బాధపడని రోజు లేదు.. అలా నాన్న ఆఖరి చూపుకు నోచుకోలేకపోయాను” అంటూ ఎమోషనల్ అయింది రమ్య.
నాన్న మరణించిన వారానికి ఆడియో రిలీజ్ లంటూ వివాదాలలో చిక్కుకున్నాము. ఎవరెవరో వచ్చి తిట్టేవాళ్ళు. అలా ఎన్నో ఫేస్ చేశాము. అదే సమయంలో ఒక కస్టమర్ ధరలు ఎందుకు అంత ఎక్కువ అని అడిగేసరికి మా అక్క కోపం తట్టుకోలేక రివర్స్లో తిట్టింది. క్షణికావేశంలో జరిగిన తప్పు వల్ల మా జీవితాలు తారుమారయ్యాయి. బిజినెస్ క్లోజ్ చేసి పరిస్థితి వచ్చింది. అంటూ తన బాధను చెప్పుకొచ్చింది రమ్య. మరి బిగ్ బాస్ షోలో రమ్య మెప్పిస్తుందా? ట్రోలర్స్ కి ఛాన్స్ ఇవ్వకుండా గట్టిగా నిలబడుతుందా? అనేది తెలియాల్సి ఉంది.
ALSO READ:Bigg Boss 9: 5 వారాలకు గానూ.. ఫ్లోరా, శ్రీజ దమ్ము ఎంత సంపాదించారో తెలుసా?