Intinti Ramayanam Today Episode October 13th : నిన్నటి ఎపిసోడ్ లో.. డబ్బులు దొంగతనం చేసి మా వదిన మీద నిందలు వేస్తావని అందరూ పల్లవి పై సీరియస్ అవుతారు. అటు శ్రీకర్ కూడా మా వదిన దొంగతనం చేసిందని అంటావా అని పల్లవి పై అరుస్తాడు. శ్రీయ కూడా నీకు అవని అక్క మీద కోపం ఉంటే వేరేలా తెచ్చుకోవాలి అంతేగాని ఇలా తీర్చుకోవడం ఎందుకు అని పల్లవి పై సీరియస్ అవుతుంది. ప్రణతి కూడా మా వదినని ఇలా ఇరికించడం మంచిదా అనుకుంటున్నావా..? మా వదిన తప్పంటావా అని బుద్ధి పెడుతుంది. భరత్ కూడా తనకు సాయం చేస్తుంటే మంచి దానివి అని అనుకున్నాను కానీ ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అని సీరియస్ అవుతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పల్లవి ఎంత చెప్తున్నా సరే కమల్ మాత్రం చెప్పిన మాట వినకుండా నువ్వు చేసింది తప్పే అని అంటాడు.. నిన్ను నా కూతురు కన్నా ఎక్కువగా నమ్మాను. కానీ నువ్వు చేసింది ఏంటి అని అంటుంది. నువ్విలాంటి పనులు చేస్తావని నేను అస్సలు ఊహించలేదు. నా చేతే అవని ఇంట్లోంచి బయటికి గెంటిస్తావా? లేనిపోనివి చెప్పి నన్ను నీమీద తప్పుడు అభిప్రాయం వచ్చేలా చేసింది. పల్లవిని అసలు నిజం అని బయటపెడుతుంది పార్వతి.. ఇక అక్షయ్ కూడా నీవల్ల నా భార్యను ఎంతో అపార్థం చేసుకున్నాను అని అంటాడు.
ఇక కమల్ ఇలాంటి మోసగత్తే.. ఇంట్లో ఇన్ని తప్పులు చేసిన తర్వాత కూడా ఎలా ఉంచాలి? నువ్వు నా ఇంట్లో అవసరం లేదు అని కమల్ పల్లవిని బయటికి లాక్కొని వస్తాడు. బావ నేను చెప్పేది విను బావ అని పల్లవి ఎంత చెప్తున్నా సరే కమల్ వినడు. లగేజ్ తో సహా బయటకి మెడ పట్టుకొని గెంటేస్తాడు. నీలాంటిది నా ఇంటికి ఈ ఇంటికి కోడలుగా పనికిరాదు అని అంటాడు. ఇంకెప్పుడూ ఈ ఇంట్లోకి అడుగు కూడా పెట్టొద్దు అని కమల్ అంటాడు. తర్వాత రాత్రి అక్షయ్ అవనికి సారీ చెప్తాడు. నువ్వు ఎంతగా అపార్థం చేసుకున్నాను.
Also Read: రచ్చ చేసిన బాలు.. సత్యం షాకింగ్ నిర్ణయం..? కామాక్షి దెబ్బకు ఫ్యూజులు అవుట్..
అక్షయ్ మౌనంగా ఉండడం చూసిన ఆరాధ్య ఏంటి నాన్న మౌనంగా ఉన్నావ్ పిన్ని వెళ్ళిపోయిందని బాధపడుతున్నావా అని అడుగుతుంది.. కానీ అక్షయ్ మాత్రం కాదమ్మా మీ అమ్మ తప్పేమీ లేదని నమ్ముతున్నాను అని అక్షయ్ అంటాడు. అమ్మ తప్పు చేయలేదు అని తెలుసుకున్నావు కదా మరి అమ్మకి నువ్వు సారీ చెప్పాలి కదా ఎలా చెప్తావు అని అడుగుతుంది. దానికి అక్షయ్ ఆరాధ్యకు ముద్దు పెడతాడు. అని రాగానే తనతో అక్షయ్ఇఅని రాగానే తనతో అక్షయ్ మాట్లాడతాడు. ఇదంతా నా తప్పే నీ గురించి తెలిసి కూడా నిన్ను అపార్థం చేసుకున్నాను నన్ను క్షమించు అని అంటాడు. అవని మీరు నా తప్పేమీ లేదని తెలుసుకుంటే చాలు అని అంటుంది. మీరిద్దరిలా కలిసి ఉంటే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా అని రాజేంద్రప్రసాద్ పార్వతి అంటారు.. మీరు ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలని వాళ్లు అంటారు. డబ్బులు పోయిన పర్వాలేదు కానీ వీళ్ళు ఇంత సంతోషంగా ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది అండి అని పార్వతి అంటుంది. నిజమే పార్వతి నేను కూడా అదే అనుకుంటున్నాను డబ్బులు పోయినా కూడా వీళ్ళిద్దరూ కలిసిపోయారు మళ్ళీ సంతోషంగా ఉంటారు అని నేను అనుకుంటున్నాను అని రాజేంద్రప్రసాద్ అంటాడు.
కమల్ పల్లవి చేసిన మోసాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. మంచి దానిలాగా నటించి ఇన్ని రోజులు మోసం చేసిందని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక తన గుర్తులను ఇంట్లో ఉంచకూడదని కమల్ నిర్ణయించుకుంటారు.. పల్లవికి సంబంధించిన వస్తువులు అన్నిటినీ కూడా తగలబెట్టాలని ఒకచోట వేస్తాడు. వాటికి నిప్పు పెట్టబోతుండగా అవని వచ్చి అడ్డుకుంటుంది. పల్లవి గురించి నాకు ముందే తెలుసు కన్నయ్య నువ్వేం అయిపోతావో అని నిజం చెప్పలేదు అని అవని అంటుంది. నువ్వు తప్పకుండా నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకొని అన్నయ్యకు దూరమయ వదిన అదే నాకు చాలా బాధగా ఉంది అని అంటాడు కమల్. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..