Illu Illalu Pillalu Today Episode October 17th: పోలీస్ స్టేషన్ కి సుకన్య అలాగే తిరుపతి వెళ్తారు. వాళ్ళిద్దరూ కూడా భోజనం తీసుకుని వచ్చాము కాస్త భోజనం చేయండి అక్క బావ అంటూ అనగానే ఎందుకు మామయ్య తీసుకొచ్చావు. మళ్ళీ చేసిన గాయం బాధ ఇంకా ఎక్కువవుతుంది తప్ప తగ్గలేదు ఆకలిగా లేదు అని చందు అంటాడు. అటు రామరాజు అన్నం తినాలన్న ఆకలి లేదురా నేను ఏరి కోరి తెచ్చుకున్న వాళ్లే నన్ను ఇంతగా మోసం చేస్తారని తెలిసి నా గుండె తరుక్కుపోతుంది ఇంకా ఆకలి ఎక్కడ ఉంటుంది అని రామరాజు కన్నీళ్లు పెట్టుకుంటాడు. అటు వేదవతి కూడా సుకన్యను చూసి ఒక్కసారిగా రెచ్చిపోతుంది. కానీ సుకన్య అలాంటి తప్పు ఏదైనా చేస్తే వెంటనే దాన్ని వదిలేస్తాను అని తిరుపతి అంటాడు.
రామరాజు వాళ్ళని కోర్టుకు తీసుకెళుతున్నంగా నర్మదా ఆ సాక్ష్యాన్ని తన ఫ్రెండుని ఇవ్వమని అడుగుతుంది. అయితే అందరూ బయలుదేరగానే ఎదురుగా భద్రం వచ్చి వాళ్లకి దిష్టి తీస్తూ కారు వెళ్ళకుండా ఆకు తిని చెంబులో నీళ్ళు పోసి కొబ్బరికాయ కొడుతుంది. ఆ రామరాజు గారిని వేదవతిని జైలుకు పంపించడానికి మీరు వెళ్తున్నారా అయితే నేను జైల్లో కలుస్తాను అని చెప్పండి అని భద్ర అంటుంది. ఇక భద్రకు దిమ్మ తిరిగిపోయేలా కౌంటర్లు ఇస్తాడు ధీరజ్. ఇక నర్మద వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్తారు అయితే అటు భాగ్యం వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లడానికి వెళ్తుండగా విశ్వం అడ్డుగా వస్తాడు.. విశ్వం ఈ కేసును వాపస్ తీసుకోవాలి లేదంటే నా సంగతి తెలుసుగాని ఎంతగా చెప్పినా సరే వాళ్లు మాత్రం అస్సలు వినరు. మీ అత్తయ్య మమ్మల్ని ఇలా కేసు పెట్టమని చెప్పింది.. మీ అత్తకి ఫోన్ చేసి నువ్వు అడ్డుపడుతున్నావని చెప్తాను అని భాగ్యం అనగానే విశ్వం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
వేదవతిని రాత్రి నుంచి తినమని బ్రతిమిలాడిన కూడా అస్సలు తినకపోవడంతో కింద పడిపోతుంది.. అసలే ఆరోగ్యం బాగో లేకపోవడంతో పాటుగా ఆమె తినకుండా ఉండడంతో కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఇక పోలీస్ స్టేషన్ లో డాక్టర్ వచ్చి ఆమెను చెక్ చేసి ఏమి తినకపోవడం వల్లే కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పడంతో అందరూ కాస్త ఊపిరి పీల్చుకుంటారు.. అప్పటివరకు తిరుపతి వాళ్ళందరూ టెన్షన్ పడిపోతూ ఉండగా అప్పుడే ధీరజ్ వాళ్ళందరూ కూడా వచ్చి వేదవతి పడిపోయింది అని తెలుసుకొని కంగారు పడిపోతూ ఉంటారు. అయితే వేదవతి లేస్తుంది నాకు ఏం కాలేదు రాని ఎంత చెప్పినా సరే అందరూ తినమని బ్రతిమలాడుతారు అప్పుడే ఎస్ఐ వచ్చి మీరు ఇలా తినకుండా ఉంటే మీకే నష్టమని చెప్తుంది.
భాగ్యం వాళ్ళు పోలీస్ స్టేషన్ కి రాగానే వేదవతి అలా పడిపోయిందని తెలుసుకొని ఇది నాటకం అని అంటారు. అయితే భాగ్యం మాట విని వేదవతి చంపేస్తాను ఎక్కువ మాట్లాడితేనే అంటుంది. చూసారా సాయి గారు ఇప్పటివరకు పడిపోయిందని నాటకం ఆడింది ఇప్పుడు నన్నే చంపేస్తాను అంటుంది ఇది పోలీస్ స్టేషన్ లోనే నన్ను చంపుతాను అంటున్నారు చూసారా ముందు వీళ్ళని మీద మరో కేసు పెట్టి జైలుకు పంపించండి అని భాగ్యం అంటుంది. అయితే భాగ్యం మాటకి ఇంకాస్త రెచ్చిపోతుంది.. కొట్టడం కాదు మాట్లాడితే చంపేస్తాను అని వేదవతి అనగానే చూసారా ఎస్సై గారు చంపేస్తాను అంటుంది వీళ్ళని కోర్టుకు తీసుకెళ్లండి అని భాగ్యం నానా హంగామా చేస్తుంది. వాళ్లని కాదు మిమ్మల్ని కూడా కోర్టుకు తీసుకొని వెళ్తాము అని ఎస్ఐ చెప్పగానే భాగ్యం ఒక్కసారిగా షాక్ అవుతుంది.
భాగ్యం మాటకు మాట చెప్తూ ఉండగా ఎస్సై కూడా నర్మదా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్తామని చెప్తున్నారు మీ మీద కూడా వాళ్ళు కేసు పెడతామని అంటున్నారు. మీరు మాట తెలుసుకోండి. అయితే భాగ్యం ఆ మాట వినగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏదేమైనా కూడా పోలీస్ స్టేషన్ లో తేల్చుకుంటాము అని అందరూ అంటారు. అయితే మేము కూడా వాళ్ళ మీద కేసు పెట్టి మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ని తీసుకొని వెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తాము కేసు పెట్టండి అని నర్మదా కూడా అనడంతో భాగ్యం కాస్త వెనక్కి తగ్గుతుంది కానీ మళ్ళీ మాకేం భయం లేదు కేసులుకి వాటికి విడిచి మేము భయపడే రకం కాదు.. మేము అక్కడే తెలుసుకుంటాము అని భాగ్యం కూడా అంటుంది. అయితే ఈ కేసు ఇప్పట్లో తేలేదా లేదు మీరు మాట్లాడుకొని కోర్టుకు వెళ్ళండి అక్కడే తెలుసుకోండి అని ఎస్ ఐ ఉంటారు కానీ నర్మద మాత్రం ఎలాగైనా సరే బల్లిని ఒప్పించాలని అనుకుంటుంది కానీ తన మాటని వల్లి వినదు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..