Podarillu Today Episode October 17th :మహాలక్ష్మి స్నానం చేసి బయటికి రాగానే జమున తన భర్తకి ఫోన్ చేసి మాట్లాడాలి. ఈ సచ్చినోడు ఏం చేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే జమున తన భర్తకి ఫోన్ చేయాలి అనే అనుకునే లోపల మహాలక్ష్మి హాయ్ అండి అని వస్తుంది ఎవరితోనో టెన్షన్ పడుతూ ఫోన్ చేయడానికి చూస్తున్నారు కదా.. అయితే ఎవరు లేరు అమ్మ నాకు ఎవరు ఉన్నారని నేను ఒక అనాధని అని అంటుంది.. అయితే మహాలక్ష్మికి నేను ఒక అనాధని అంటూ ఒక కట్టు కథ చెప్పడంతో మహాలక్ష్మి నిజమే అని నమ్ముతుంది కానీ జమున మాత్రం మహాలక్ష్మిని నమ్మించాను అని ఆలోచిస్తూ ఉంటుంది.. అయితే మహాలక్ష్మికి మాత్రం ఎక్కడో అనుమానం అయితే ఉంటుంది.
కేశవ ఆ స్థలం మీద ఆశలు వదులుకున్నాను అన్నయ్య అంటూ చాలా బాధపడిపోతూ ఉంటాడు దానికి నువ్వు ఎందుకురా బాధ పడిపోతున్నావు అని అందరూ కూడా తమ దగ్గర ఉన్న డబ్బులు అని తీసి పక్కన పెడతారు. ఇన్ని డబ్బులు ఎలా వచ్చాయి అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. మొత్తం మహాలక్ష్మి నారాయణతో కలిపి కేశవ కి కావలసిన డబ్బుల్ని అరేంజ్ చేసి ఇస్తారు. మొత్తం అందరూ కలిసి కేశవ కి సాయం చేస్తారు అయితే ఏం మహాలక్ష్మి కూడా సాయం చేయడంతో కేశవ ఎమోషనల్ అయిపోతాడు. మొత్తానికి ఈ ఎపిసోడ్ ఎమోషనల్ సెంటిమెంట్లతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.
జమున తాగుబోతు సచ్చినోడు.. ఏం చేస్తున్నాడో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోవాలి.. ఇంట్లో డబ్బులు గురించి ఒకసారి వీడికి చెప్పాలి అని ఫోన్ పట్టుకొని టెన్షన్ పడిపోతూ ఉండగా జమునకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చారా మహాలక్ష్మి వెనకాలే వస్తుంది. ఎందుకు టెన్షన్ పడుతున్నారు ఎవరికో ఫోన్ చేయాలని వచ్చారు కదా అని అడుగుతుంది. నేను ఎవరికీ ఫోన్ చేయడానికి రాలేదమ్మా చల్లగాలి కోసం ఇలా వచ్చాను అందుకే ఇలా పట్టుకున్నాను అని జమున ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తుంది.. అయితే జమున నాకు వంట చేయాల్సిన టైం అయింది నేను వెళ్తున్నాను అని లోపలికి వెళ్తుంది. మహాలక్ష్మికి మాత్రం ఎక్కడో అనుమానం అయితే ఉంటుంది.. నారాయణ మహాలక్ష్మి దగ్గరికి వచ్చి ఏమైంది ఏం జరిగింది అని అడుగుతాడు.
నారాయణ మహాలక్ష్మికి నిజం చెప్పమని ఎంతగా అడిగినా కూడా పాము తెచ్చి ఇంట్లో పెట్టావు ఏదో ఒక రోజు కాటేయకుండా ఉంటుందా..? అయితే నేను తప్పు చేశాను అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య అని మహాలక్ష్మి ఎంత అడిగినా కూడా నారాయణ మాత్రం సమాధానం చెప్పడు. చెప్పడం ఎందుకు మీరే తెలుసుకుంటారు కదా అనేసి అంటుంది. ఏదో దాస్తున్నాడని నాకు అర్థం అయిపోయింది అదేంటో నాకు అర్థం కావడం లేదు నారాయణ నిజం చెప్తే బాగుంటుంది అని మహాలక్ష్మి అనుకుంటుంది. మహాలక్ష్మికి కూడా నారాయణ నిజం చెప్పకపోవడంతో ఏదో ఉంది అని అనుమానం అయితే ఉంటుంది.
కేశవ కి షాపు వచ్చేసిందని ఆనందం తట్టుకోలేక తన గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్తాడు. అయితే అక్కడికి రాగానే ఏంట్రా ఇంత ఆనందంగా ఉన్నావు ఏం జరిగింది అని శైలు అడుగుతుంది నేను ఈ షాప్ కి ఓనర్ అయ్యాను అని చెప్పగానే అంతేనా దానికోసం ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని పిలిచావా ఇదేదో పెద్ద విశేషం లాగా చెప్పుకుంటున్నావే అని శైలు అనగానే కేశవ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అయితే నేను మెకానిక్ గా పని చేయడం దీనికి ఇష్టం లేదు అందుకే ఇలా మాట్లాడుతుంది అని కేశవ చాలా బాధపడిపోతాడు. నేను ఒక మెకానిక్ కాకుండా ఐఏఎస్ ఐపీఎస్ అయి ఉంటే దీనికి మంచిది కానీ నేను మెకానిక్ ని కదా మొదటి నుంచి నాకు ఇష్టం లేదని అనుకుంటుంది. నేను నచ్చాను కానీ నా పని మాత్రం దీనికి నచ్చలేదు అని అనగానే శైలు అది కాదురా అని అంటుంది. కానీ కేశవ్ మాత్రం చాలా ఫీల్ అయిపోతుంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది . రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…