E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవికి కొత్త టెన్షన్.. కొట్టుకున్న భరత్, కమల్.. ఆరాధ్య కిడ్నాప్..

Intinti Ramayanam Today Episode: పల్లవికి కొత్త టెన్షన్.. కొట్టుకున్న భరత్, కమల్.. ఆరాధ్య కిడ్నాప్..
Advertisement

Intinti Ramayanam Today Episode October 19th: ఇంటికి వచ్చిన మీనాక్షి పల్లవి దగ్గరికి వెళ్లి నీకు అక్కడ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. అవని నీకు కొట్టించడం మహా పాపం అంటూ మీనాక్షి మాట్లాడడంతో పల్లవి నీకు పెద్ద కూతురు అంటే చాలా ఇష్టం కదా మరి నాతో ఎందుకు వచ్చావు అక్కడే ఉండాల్సింది కదా అని అంటుంది. ఆ మాట విన్న మీనాక్షి నాకు నువ్వు వేరు అవని వేరు కాదు నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే కాబట్టి నీకోసం నేను వచ్చేసాను అని చెప్తుంది. అయితే పల్లవి నువ్వు కేసు వెనక్కి తీసుకోకపోతే నీ మీద అక్షయ్ కేసు పెడతానని అన్నాడు ఆ తర్వాత మీ నాన్న కానీ నీ భర్త గాని ఎవరు రారు అని అంటుంది. అయినా కూడా పల్లవి ఏమాత్రం భయపడకుండా ఏం జరిగినా పర్వాలేదు అవని మీద పెట్టిన కేసును వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు అని మొండిగా ఉంటుంది ఇక మీనాక్షి నీకు కష్టాలు నువ్వే కోరి తెచ్చుకుంటున్నావు అనుభవించు అంటూ వెళ్ళిపోతుంది.

పల్లవి అరెస్ట్..

ఇక కాసేపటి తర్వాత ఇంటికి పోలీసులు రావడంతో పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు మీకు నేను పంపిన గిఫ్ట్ బాగోలేదా అందిందా అసలు అని అంటుంది. ఆ మాట వినగానే పోలీసులు మీరు ఇచ్చిన గిఫ్ట్ కోసం రాలేదు మీతో మాట్లాడాలని వచ్చాము అని అంటారు. చెప్పండి అసలు మీకేం కావాలి టీ కాఫీ జ్యూస్ ఇలాంటివి ఏమైనా కావాలా అని అడుగుతుంది పల్లవి మేము మీ మర్యాదల కోసం ఇక్కడికి రాలేదు మీ మీద కేసు పెట్టారు కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్లడానికి వచ్చాము అని చెప్పగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. నా మీద ఎవరు కేసు పెట్టారు నన్ను అరెస్ట్ చేస్తారా ఏం మాట్లాడుతున్నారు అని పల్లవి అంటుంది ఆ మాట వినగానే పోలీసులు మీ ఆయన నీ మీద కేసు పెట్టారు. నిన్ను అరెస్ట్ చేస్తున్న పద పోలీస్ స్టేషన్ కి అని అంటారు ఆ మాట వినగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంతా పల్లవి కల అయితే ఎలాగైనా సరే అవని మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకోవాలి అని అనుకుంటుంది.

అవని కోసం కన్నీళ్లు..

Advertisement

శ్రేయ శ్రీకర్ ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లి అవన్నీ పరిస్థితిని చూసి ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంటారు. నీకేంటి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని బాధ పడిపోతూ ఉంటారు. నిజంగానే ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఆ పల్లవిని. నాకు తల్లి లేదని బాధపడ్డాను కానీ నిన్ను చూసిన తర్వాత నాకు తల్లి అన్న సంగతి మర్చిపోయాను. అలాంటి నీకు ఇలా జరిగితే తట్టుకోలేకపోతున్నాను అక్కని శ్రేయ బాధ పడిపోతూ ఉంటుంది. అయితే పల్లవి ఇలా చేస్తుందని అసలు ఊహించలేదు అక్క నువ్వు తనని ఎప్పటికప్పుడు క్షమిస్తూ వచ్చావు కానీ ఇప్పుడు ఇలా చేసి నిన్ను బాధ పెట్టింది అంటే పల్లవి అస్సలు ఏం చేస్తుందో అర్థం కావడం లేదు అని శ్రియ అంటుంది.

పల్లవి కేసు వెనక్కి తీసుకుంటుందా..?

పల్లవిని మీనాక్షి తీసుకొని పోలీస్ స్టేషన్ కి వస్తుంది. పల్లవి రావడం చూసి కమల్ ఒక్కసారిగా రెచ్చిపోతాడు. మా వదిన మీదే కేసు పెడతావా అని పల్లవి మెయిల్ కి కొట్టడానికి వస్తాడు. అయితే అప్పుడే అప్పుడున్న భరత్ కమల్ ని కొట్టడానికి ముందుకు వస్తాడు ఇద్దరు కాసేపు గొడవపడతారు. అయితే వాళ్ళిద్దర్నీ ఆపడానికి ఎంతగా ప్రయత్నించిన సరే ఆగకపోవడంతో ఇద్దరి మీద కేసులు పెట్టి లోపల వేస్తాను అని ఆ సీఐ అంటుంది. ఇక పల్లవి కేసుని వాపస్ తీసుకోవడానికి వచ్చాను అని చెప్పగానే అందరు ఒక్కసారిగా షాక్ అవుతారు. పల్లవి కేసు వెనక్కి తీసుకోవడంతో ఏమైంది ఎందుకు ఇంత మార్పు జరిగింది అని ఆలోచిస్తూ ఉంటారు. పల్లవి బయటికి రాగానే అవని వెళ్లి బాధ పడిపోతూ నువ్వు ఎంత తప్పు చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అని వార్నింగ్ ఇస్తుంది.

పల్లవికి పార్వతి వార్నింగ్..

Advertisement

పల్లవి అవనీని కొట్టించింది అని తెలుసుకున్న పార్వతి పల్లవికి ఫోన్ చేస్తుంది. నువ్వు ఎన్ని తప్పులు చేసినా అవని నిన్ను వెనకేసుకొని వచ్చింది. నీ గురించి ఎవరికీ చెప్పనివ్వకుండా నన్ను అడ్డుపడింది మీ మావయ్య గారిని చంపాలని చూసింది.నువ్వే కాబట్టి నీ గురించి ఒక్క మాట చెప్తే నా కొడుకులు నేను ఎక్కడున్నా వెతికి మరీ చంపేస్తారు. కానీ అవని మాట విని నేను చెప్పకుండా ఆగను మళ్ళీ నువ్వు ఇంకా తప్పులు మీద తప్పులు చేస్తున్నావు. ఇక నువ్వు ఎప్పటికీ మారవా అని వార్నింగ్ ఇస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Also Read : ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఆ సీరియల్ అవుట్..!

Related News

Illu Illalu Pillalu Today Episodes: కేసు వెనక్కి తీసుకున్న వల్లి.. భాగ్యంకు షాక్.. చందు విడాకులు..?

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఆ సీరియల్ అవుట్..!

Brahmamudi Serial Today Episode October 19th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు పెట్టిన పోటీలో ఐశ్వర్య గెలుస్తుందా..?   

Monday TV Movies : సోమవారం టీవీ సినిమాలు.. డోంట్ మిస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 19th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని తీసుకెళ్లిన నన్స్ ఎవరు..? ఎవరు పంపిస్తే వచ్చారు..?

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Big Stories

Advertisement
×