E-Paper
Advertisement

రేవంత్ సర్కార్‌పై BRS కరెంట్ వార్.. క్షేత్రస్థాయిలోకి హరీష్ రావు టీమ్!

రేవంత్ సర్కార్‌పై BRS కరెంట్ వార్.. క్షేత్రస్థాయిలోకి హరీష్ రావు టీమ్!
Advertisement

BRS Protests: స్వేచ్ఛ బ్యూరో: రైతుల సమస్యలే అజెండాగా బీఆర్‌ఎస్‌ మరో ఉద్యమానికి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ సరఫరా, అప్రకటిత కోతలు, లో-వోల్టేజీ సమస్యలు, సాగునీటి ఇబ్బందులు, ఎండుతున్న పంటలను కేంద్రంగా చేసుకుని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీయాలని గులాబీ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా విద్యుత్‌ సబ్‌స్టేషన్లు, కార్యాలయాల వద్ద నిరసనలు, ధర్నాలు, ముట్టడి కార్యక్రమాల ద్వారా రైతుల సమస్యలను రాష్ట్రస్థాయిలో చర్చకు తీసుకురావాలని యోచిస్తోంది. ఇప్పటికే పలుచోట్ల సబ్‌స్టేషన్లను సందర్శించిన పార్టీ నేతలు విద్యుత్‌ సరఫరాకు సంబంధించిన లాగ్‌బుక్‌లను పరిశీలిస్తూ క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఈ అనుభవాలను ఆధారంగా చేసుకుని ఉద్యమాన్ని మరింత విస్తరించే దిశగా పార్టీ నాయకత్వం వ్యూహాలు రచిస్తోంది.

లాగ్‌బుక్‌లే ప్రధాన అస్త్రం!

Advertisement

వ్యవసాయ విద్యుత్‌ సరఫరాపై ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు మధ్య వ్యత్యాసం ఉందన్నది బీఆర్‌ఎస్‌ ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో సబ్‌స్టేషన్లలో నిర్వహించే లాగ్‌బుక్‌లను పార్టీ నేతలు కీలక ఆధారాలుగా పరిగణిస్తున్నారు. ఏ సమయంలో విద్యుత్‌ సరఫరా చేశారు? ఎన్ని గంటలు సరఫరా నిలిచిపోయింది? ఎన్నిసార్లు ట్రిప్పింగ్‌ జరిగింది? లో-వోల్టేజీ సమస్యలు ఎంతవరకు ఉన్నాయి? వంటి అంశాలను పరిశీలిస్తూ వాస్తవ పరిస్థితులను వెలుగులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు సబ్‌స్టేషన్‌ను సందర్శించిన బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు గతంలో లాగ్‌బుక్‌ అందుబాటులో లేదని ఆరోపించారు. తాజాగా గద్వాల జిల్లాలోని గట్టు సబ్‌స్టేషన్‌ లాగ్‌బుక్‌ను పరిశీలించిన సందర్భంలోనూ వ్యవసాయానికి అంతరాయాలతో విద్యుత్‌ సరఫరా అవుతోందని విమర్శించారు. ఈ పరిణామాలతో విద్యుత్‌ సరఫరా అంశం అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ వివాదంగా మారింది.

ఎండుతున్న పంటలపై పోరాటం

Advertisement

విద్యుత్‌ కోతల ప్రభావం సాగుపై పడుతోందని, సరైన సమయంలో నీరు అందక పంటలు దెబ్బతింటున్నాయని రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ పేర్కొంటుంది. మోటార్లు పనిచేయకపోవడం, లో-వోల్టేజీ కారణంగా పరికరాలు దెబ్బతినడం, సాగునీటి విడుదలలో జాప్యం వంటి సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ భావిస్తోంది. ఎండిన పంటలను నిరసన కార్యక్రమాల్లో ప్రదర్శించడం, రైతులతో కలిసి సబ్‌స్టేషన్ల ఎదుట ధర్నాలు నిర్వహించడం ద్వారా సమస్య తీవ్రతను చాటాలని యోచిస్తోంది.రైతులకు రోజుకు ఎన్ని గంటలు విద్యుత్‌ అందుతోంది? సరఫరాలో అంతరాయాలు ఎందుకు ఏర్పడుతున్నాయి? సాగునీటి వనరులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోనూ పంటలకు నీరు ఎందుకు అందడం లేదు? అనే ప్రశ్నలను ప్రభుత్వం ముందుంచాలని బీఆర్‌ఎస్‌ వ్యూహరచన చేస్తోంది. రైతుల నుంచి ఫిర్యాదులు సేకరించి, స్థానిక సమస్యలను గుర్తించి, వాటి ఆధారంగా అధికారులను నిలదీయడం ద్వారా ఉద్యమానికి క్షేత్రస్థాయి బలం పెంచుకోవాలని చూస్తోంది.

బొగ్గు నిల్వలపైనా గురి

విద్యుత్‌ సరఫరాతోపాటు ఉత్పత్తి, బొగ్గు సరఫరా అంశాలను కూడా బీఆర్‌ఎస్‌ తన రాజకీయ పోరాటంలో భాగం చేస్తోంది. సింగరేణి బొగ్గు ఉత్పత్తి, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు సరఫరా, నిల్వల వివరాలు, విద్యుదుత్పత్తి సామర్థ్యం వినియోగం వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని పార్టీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.యాదాద్రి, భద్రాద్రి, కొత్తగూడెం, కాకతీయ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల పనితీరుపై గతంలోనూ బీఆర్‌ఎస్‌ ప్రశ్నలు సంధించింది. బొగ్గు కొరత ఉందంటున్నప్పుడు నిల్వలు ఎన్ని ఉన్నాయి? రోజువారీ అవసరాలకు అనుగుణంగా సరఫరా జరుగుతోందా? విద్యుదుత్పత్తి యూనిట్లు అందుబాటులో ఉన్నా వాటిని పూర్తిస్థాయిలో ఎందుకు వినియోగించడం లేదు? అనే అంశాలపై వివరాలు వెల్లడించాలని కోరుతోంది. ఈ ఆరోపణలకు సంబంధించిన అధికారిక గణాంకాలు, నిల్వల వివరాలను ప్రభుత్వం నుంచి సేకరించి ప్రజల ముందుంచడమే పార్టీ తదుపరి కార్యాచరణలో కీలకం కానుంది.

రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు సన్నాహాలు?

ఇప్పటికే స్థానికంగా జరుగుతున్న నిరసనలను రాష్ట్రవ్యాప్త కార్యక్రమంగా విస్తరించాలన్నది బీఆర్‌ఎస్‌ వ్యూహంగా కనిపిస్తోంది. విద్యుత్‌ శాఖ కార్యాలయాల ఎదుట ధర్నాలు, సబ్‌స్టేషన్ల ముట్టడి, రైతులతో సమావేశాలు, గ్రామస్థాయిలో సమస్యల గుర్తింపు వంటి కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహించే అవకాశముంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సంబంధించి పార్టీ అధిష్ఠానం నుంచి అధికారిక ఆదేశాలు వెలువడినట్లు నిర్ధారణ కావాల్సి ఉంది.జిల్లాల వారీగా విద్యుత్‌ సరఫరా సమస్యలు, ఎండుతున్న పంటలు, సాగునీటి ఇబ్బందులు, బొగ్గు నిల్వలపై అందుబాటులో ఉన్న సమాచారాన్ని సమీకరించి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రైతుల సమస్యలను స్థానిక స్థాయి నుంచి రాష్ట్రస్థాయి రాజకీయ అంశంగా మార్చడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నది బీఆర్‌ఎస్‌ లక్ష్యంఅని పార్టీ సీనియర్ నేత తెలిపారు.

రాజకీయంగా కీలకం కానున్న విద్యుత్‌ అంశం

వ్యవసాయ విద్యుత్‌ సరఫరా తెలంగాణ రాజకీయాల్లో కీలక అంశంగా ఉంది. గతంలో తాము వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ అందించామని బీఆర్‌ఎస్‌ చెప్పుకుంటుండగా, ప్రస్తుత ప్రభుత్వం సరఫరాపై చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయి పరిస్థితులను పోల్చి చూడాలని ప్రతిపక్షం కోరుతోంది. మరోవైపు, విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా, బొగ్గు లభ్యత వంటి అంశాలపై అధికారిక గణాంకాలు, సాంకేతిక కారణాలు కూడా సమగ్రంగా పరిశీలించాల్సి ఉంటుంది.రైతులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ అందించడం, సాగునీటి సమస్యలను పరిష్కరించడం, పంట నష్టాలను తగ్గించడం వంటి అంశాలే ఈ రాజకీయ పోరులో ప్రధాన పరీక్షగా మారనున్నాయి. బీఆర్‌ఎస్‌ ప్రతిపాదిస్తున్న నిరసనలు ఏ మేరకు కార్యరూపం దాలుస్తాయి? వాటికి రైతుల నుంచి ఎంత మద్దతు లభిస్తుంది? ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.

యాసంగిలో విద్యుత్ సమస్యలు?

యాసంగిలో విద్యుత్ సమస్య పొంచి ఉంది. ప్రస్తుత బొగ్గు నిల్వలు, ప్రాజెక్టులో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం సైతం యాసంగిలో వరికి ప్రత్యామ్నాయపంటలు వేసుకోవాలని రైతులకు సూచనలు ఇస్తుంది. క్రాప్ హాలిడే ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతుంది. ఇది సైతం రాబోయే కాలంలో అన్ని పార్టీలకు కీలక అంశంగా మారబోతున్నది. రాబోయే ఎన్నికలకు సైతం రాజకీయ పార్టీలకు ప్రచార అస్త్రంగా మారనుంది.

Also Read: నగరి మున్సిపల్ పీఠం ఏకగ్రీవం.. హైకోర్టుకు వెళ్తానన్న రోజా!

Tags

Related News

అందరు బాగుండాలి.. అందులో నేనుండాలి! ‘బంగారం’ పరమార్థం ఇదే! తెలంగాణ ప్రజల ‘బంగారు’ సందేశం..! ఆనవాయితీకి ఆధారమైన ఆ పురాణగాథలేమిటీ?

నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీల కోసం బీఆర్ఎస్ నయా స్కెచ్.. ఈ స్ట్రాటజీ వర్కౌట్ అయ్యేనా..?

పాలపిట్ట దర్శనం.. విజయానికి సంకేతం! పాలపిట్టతో తెలంగాణకు విడదీయలేని అనుబంధం..! పురాణాలేం చెబుతున్నాయి?

జగన్ హామీతోనే.. అంబటి ఆ వ్యాఖ్యలు? రివేంజ్ ప్లాన్ సిద్ధం!

అటు చెల్లి.. ఇటు లొల్లి.. జగన్ దారి ఎటు?

వారసత్వం కొనసాగిస్తున్న రాధా! నిలకడలేని రాజకీయమే రాధకు మైనస్‌.. తండ్రి నేపథ్యం, సామాజికవర్గమే కొండంత బలం…!

రహస్య మిత్రుల మధ్య గ్యాప్‌ పెంచిన బాబు! ఎస్‌ఐఆర్‌పై జగన్‌ నిరసన గళం.. సీఈసీ నియామకం సరికాదని పశ్చాత్తాపం…

Big Stories

Advertisement
×