BigTV English

Illu Illalu Pillalu Today Episode: కొడుకు కోసం కన్నీళ్లు పెట్టుకున్న రామరాజు..కూల్ డ్రింక్ కోసం ఆడాళ్ళ ఫైట్..వల్లికి షాక్..

Illu Illalu Pillalu Today Episode: కొడుకు కోసం కన్నీళ్లు పెట్టుకున్న రామరాజు..కూల్ డ్రింక్ కోసం ఆడాళ్ళ ఫైట్..వల్లికి షాక్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode October 23rd: నిన్నటి ఎపిసోడ్ లో..  ప్రేమ వద్దని చెప్తున్న సరే ధీరజ్ మాత్రం కొత్త జాబు నేను జాయిన్ అవ్వాలి అని ఆ జాబ్ లో జాయిన్ అవుతాడు. మొదటి పికప్ ఒక అమ్మాయికి రావడంతో వాళ్ల నాన్న ధీరజ్ ను చూసి టెన్షన్ పడతాడు. తన కూతురు అతనితో వెళ్తే సేఫ్ గా ఉంటుందా లేదా అని ఆ తండ్రి అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటాడు. మొత్తానికి ధీరజ్ తో పంపించడానికి అతను ఒప్పుకుంటాడు. ఆ తర్వాత షేరింగ్ కావడంతో దారి మధ్యలో మరో ఇద్దరూ అబ్బాయిలు ఎక్కుతారు. వాళ్ళు ఆ అమ్మాయిని చూసి తేడాగా ప్రవర్తిస్తారు. ఆ అమ్మాయి ఇబ్బంది పడుతూ ఉంటుంది. వాళ్ళని చూసిన ధీరజ్ కచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పాలని అనుకుంటాడు.


శ్రీవల్లి అమూల్యను బయటికి పంపించడం పై ఏదో ఉంది అని ప్రేమకు అనుమానం కలుగుతుంది. అసలు నువ్వు జాతరలో తప్పిపోవడం వెనక ఎవరు కారణం అని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ప్రేమ. ఆరోజు నువ్వు జాతరలో ఒక్కదానివే బయటికి వెళ్లడం వెనక ఎవరున్నారు అని ప్రేమ అడుగుతుంది. అమూల్య శ్రీవల్లి వదిన నన్ను తీసుకొని వెళ్ళింది వదిన.. ఆ తర్వాత మీ అన్నయ్య నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు.. వల్లికి చుక్కలు చూపించాలని ప్రేమ అనుకుంటుంది.. వల్లి ఎంత చెప్తున్నా సరే ప్రేమ నమ్మరు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శ్రీవల్లి ఇంట్లో ఉన్న మందు అంతా దాచేసాను కదా.. ఇక నాకు ప్రేమ మందు తాగుతుందని భయం లేదు అనుకొని హ్యాపీగా ఉంటుంది.. రామరాజు దగ్గరికి తిరుపతి వెళ్తాడు. అయితే రామరాజు మందు తాగుతూ తన బాధని తిరుపతితో చెప్పుకుంటాడు. కానీ తిరుపతి మాత్రం నువ్వు దుర్మార్గుడి బావ.. మందు కోసం ఇందాకడి నుంచి కుక్కలాగా గ్లాస్ పట్టుకొని నిలబెట్టుకుని ఉన్నాను కనీసం నువ్వు మందు వేద్దాం అని లేదు. సాటి తాగుబోతు గురించి నువ్వు ఆలోచించాలి కదా బావ అని అంటాడు.


కానీ రామరాజు మాత్రం ఆ ప్రసాద్ చేసిన పని తప్పే కదా అని అంటాడు. నా కొడుకుని ఇల్లరికం పంపించమని అడుగుతాడా..? అళ్లారు ముద్దుగా పెంచుకున్న నా కొడుకుని వాళ్ళింటికి ఎలా పంపుతాను.. రైస్ మిల్లు పనిచేయడం నామోషినా.. నిజంగానే సాగర్ కి మిల్లులో పనిచేయడం ఇష్టం లేదా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ తిరుపతికి చిరాకు తెప్పిస్తుంటాడు. తిరుపతి నువ్వు చాలా దుర్మార్గుడివి మందు వేయమని అడిగితే నీ సోది అంతా చెప్తావని అరుస్తాడు. రామరాజు ఏం మాట్లాడుతున్నావ్ రా అని కొడతాడు. నువ్వు మందు ఇవ్వకుండా ఏంటి నాకు ఇంక మందు దొరకదా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

బావా నువ్వు నాకు మందు పోయమంటే పోయావా.. నాకు ఇక మనదే దొరకదా ఏంటి అని తిరుపతి ఒక బాటిల్ మందు ని కూల్డ్రింక్ లో పోసుకుంటాడు. బాగా దాన్ని షేక్ చేసి తాగాలని అనుకుంటాడు. తిరుపతిని చూసిన వేదవతి నువ్వు దుర్మార్గుడివి రా అక్కకే అన్యాయం చేస్తావని అంటుంది. ఏంటక్కా ఏం మాట్లాడుతున్నావ్ నీకు నేనేం అన్యాయం చేశాను అని అంటాడు తిరుపతి. నువ్వొక్కడివే కూల్ డ్రింక్ తాగాలని అనుకుంటావా..? అక్కంటే నీకు ప్రేమ లేదా ఇటీవ్వు అని ఆ మందు కలిపిన కూల్ డ్రింక్ ను తీసుకొని వెళ్తుంది.

వేదవతి చేతిలో కూల్ డ్రింక్ బాటిల్ కనిపించడంతో అందరూ ఆడవాళ్లు నాకు నాకు అంటూ కొట్టుకుంటారు.. ఇదంతా కాదు మనం ఒక గేమ్ ఆడదాం అందులో ఎవరు గెలిస్తే వాళ్లకే ఈ కూల్ డ్రింక్ అని నర్మదా అంటుంది. ఏ ఆట తొక్కుడు బిళ్లనా, అష్టా చమ్మన ఏ ఆట చెప్పు ఏ దాంట్లో అయినా నేను విన్నరే అని వేదవతి అంటుంది.. మీ కాలంలోటి ఆటలు కాదమ్మా.. ఈ కాలంలో ఆటలు అని నర్మదా అనగానే వేదవతి కంప్యూటర్ కాలంలో పుట్టిన గవర్నమెంట్ ఉద్యోగి కోడలు నువ్వు ఏ ఆటనో చెప్పు ఏదైనా పర్లేదు అనేసి అంటుంది వేదవతి.

అందరూ కలిసి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడాలి అని నర్మదా అనగానే ఆ బాటిల్ ని తిప్పి అందరూ ఏది వస్తే అది చెప్పాలని అంటుంది. వేదవతి దగ్గరికి బాటిల్ రాగానే మీరు మావయ్యకి ఎన్ని ముద్దులు పెట్టారో చెప్పాలి అనగానే వేదవతి పాస్ అని అంటుంది. అలాగే ప్రేమ ధీరజ్ ని బాగా ఇష్టపడుతున్నావు కదా అసలు నిజం చెప్పు అని నర్మదా అడుగుతుంది. ప్రేమ కూడా పాస్ చెప్పడంతో ఆ బాటిల్ తిరిగి నర్మద వైపు వస్తుంది. శ్రీవల్లి నేను అడుగుతాను అని అంటుంది. సరే ఏంటో అడుక్కో అని నర్మదా అంటుంది. నువ్వు సాగర్ మరిది మామయ్యకు తెలియకుండా ఏదో చేస్తున్నారు కదా ఏంటి ఆ పని అని తెలివిగా అడుగుతుంది. కానీ నర్మద కూడా ఏమీ లేదు అని పాస్ చెప్పేస్తుంది.

Also Read : పల్లవి పై చక్రధర్ సీరియస్.. శ్రీయ పెద్ద గొడవ.. అవనికి సపోర్ట్ గా అక్షయ్..

మీరు నన్ను అడగరా ఏంటి అని శ్రీవల్లి అంటుంది. ముగ్గురు ఓడిపోయామంటే నువ్వే కదా విన్నర్. మాత్రం తెలియకుండానే నువ్వు ఎలా చదివావు అసలు అని అంటుంది నర్మదా. శ్రీవల్లి చేతికొచ్చిన కూల్డ్రింక్ ని ప్రేమ నర్మదలకి ఇచ్చి కూల్ చెయ్యాలని అనుకుంటుంది.. అయితే శ్రీవల్లి ప్రేమకు కూల్ డ్రింక్ ఇస్తుంది. అది తాగేసి బాటిల్ ని ప్రేమ శ్రీవల్లి చేతిలో పెడుతుంది. అది చూసిన తిరుపతి ఏంటమ్మా మొత్తం తాగేసావా అని అడుగుతాడు. ప్రేమ తాగేసింది అని శ్రీవల్లి చెప్పగానే తిరుపతి షాక్ అవుతాడు. అందులో మందు కలిపాను అమ్మ అది తాగేసిందా ఏంటో అనేసి వెళ్ళిపోతాడు తిరుపతి. శ్రీవల్లి మాత్రం మందు తాగేసిందంటే నాకు చుక్కలు చూపిస్తుంది అని టెన్షన్ పడుతూ గదిలోకి వెళ్లి దుప్పటి ముసుగేసుకుని భయపడుతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

 

Related News

Intinti Ramayanam Today Episode: పల్లవి పై చక్రధర్ సీరియస్.. శ్రీయ పెద్ద గొడవ.. అవనికి సపోర్ట్ గా అక్షయ్..

GudiGantalu Today episode: రోహిణికి టెన్షన్.. కోడళ్లతో ప్రభావతి పూజ.. సత్యం ఇంట దీపావళి సంబరాలు..

Brahmamudi Serial Today October 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ తో కలిసి ఇంటికి వెళ్లిపోయిన కావ్య

Today Movies in TV : గురువారం టీవీల్లోకి వచ్చేస్తున్న సినిమాలు.. ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే..

Nindu Noorella Saavasam Serial Today october 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఇంట్లోంచి వెళ్లిపోతానని అమర్‌కు చెప్పిన అమ్ము  

Tv Anchors : హీరోయిన్లను మించి యాంకర్స్ సంపాదన.. ఎవరికి ఎంత రెమ్యూనరేషన్?

MeghaSandesham : ‘మేఘ సందేశం ‘ భూమి అసలు పేరేంటి..? ఒక్కరోజుకు ఎంతంటే..?

Big Stories

×