Intinti Ramayanam Today Episode October 23 rd : నిన్నటి ఎపిసోడ్ లో.. ఉదయం లేవగానే అవని పూజ చేసి అందరికీ కావాల్సిన అవసరాలని తీరుస్తుంది. వంటగదిలోకి వెళ్లి భానుమతి దగ్గరికి పార్వతి ఏం చేస్తున్నారు అత్తయ్య అని అంటుంది ఇంట్లో ఒక్కటే అవని పనులు చేస్తుంది కదా.. అందుకే ఏదో ఒకటి నా వంతు సాయం చేద్దామని కూరగాయలు చదువుతున్నానని అంటుంది. ప్రణతి అవని వదిన ఒక్కటే ఉదయం లేసి అందరికీ కావాల్సినవన్నీ చేసిపెడుతుంది. కానీ పల్లవి వదిన శ్రీయ వదినలు మాత్రం ఏ మాత్రం పట్టించుకోకుండా పడుకున్నారు అని అంటుంది. పార్వతీ శ్రియ దగ్గరికి వెళ్లి ఏంటమ్మా ఇంకా లేవలేదు అవని ఉదయమే లేసి అన్ని పనులు చేస్తుంది. ఎంతగా అడిగినా సరే పల్లవి శ్రియాలు సరైన సమాధానం పార్వతి షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. అవని వెళ్లిన లాయరు చక్రధర్ కి ఫోన్ చేసి అసలు విషయాన్ని చెప్తాడు. ఇప్పుడే అక్కడికి వచ్చిన పల్లవి చక్రధర్ టెన్షన్ పడుతూ కనిపించడంతో ఏమైంది డాడీ అని అడుగుతుంది. మన సమస్య నాకు సీరియస్గా అనిపిస్తుంది అని చక్రధరం అంటాడు. రాజేశ్వరి ఈయన టెండర్ వెయ్యాలని వెళ్లాలనుకున్నాడు కానీ వెళ్ళలేదు ఏమయింటుందా అని ఆలోచిస్తూ ఉంటుంది. పల్లవి వీళ్లిద్దరూ మాట్లాడుకోవడం చూసినా రాజేశ్వరి ఏదో తప్పు జరుగుతుంది అని అనుకుంటుంది. మీ సమస్యలను తీసుకొచ్చి నా దగ్గర పెడతావు వాటిని తీర్చాలంటే నాకు ఇది అయిపోతుంది.
నీవల్లే ఇవన్నీ జరుగుతున్నాయి అని పల్లవి పై చక్రధర్ సీరియస్ అవుతాడు.. ఇకమీదట నీ సమస్యలని నా దగ్గరికి తీసుకురాకు. మనము ఫ్రాడ్ చేయించామని అవని కేసు పెట్టడానికి లాయర్ దగ్గరికి వెళ్ళింది. నువ్వు 50 లక్షలు తీసుకురాకుండా ఉంటే ఈ సమస్యలన్నీ వచ్చేది కాదు కదా.. అది ఎత్తుకొచ్చి మన ఇంట్లో పెట్టకుండా నీ ఫ్రెండ్ ఇంట్లో పెట్టింటే ఇంకా బాగుండేది. అనవసరంగా నామీద అనుమానం వచ్చేలా చేసావు అని పల్లవి పై చక్రధర్ అరుస్తాడు. వీళ్ళ మాటలు విన్న రాజేశ్వరి నేను ఊర్లో లేని సమయంలో ఎంత చేశారా అని అంటుంది.
కూతురికి కాపురాన్ని మంచిగా చూసుకోమని చెప్పాల్సింది పోయి ఇలా ఇంటిని నాశనం చేయాలని కోరుకుంటారా అని ఇద్దరిపై అరుస్తుంది. నాకు సలహాలు ఇవ్వద్దు అని చక్రధర్ అంటాడు. ఇక ఉదయం లేవగానే ఓ ఇద్దరు వ్యక్తులు టీవీ ఆర్డర్ పెట్టారని తీసుకొని వస్తారు.. మేమైతే టీవీ ఏమీ ఆర్డర్ ఇవ్వలేదు కదా అవని వదిన ఇచ్చిందేమో అని కమలనుకుంటాడు. అవనిని పిలిచి టీవీ ఆర్డర్ పెట్టావా అని అడుగుతారు. నేనేమీ టీవీ ని ఆర్డర్ పెట్టలేదు అని అంటుంది. ఇప్పుడే అక్కడికి వచ్చిన శ్రేయ నేను ఆర్డర్ పెట్టాను అని అంటుంది.
ఇంట్లో వాళ్లకి ఎలా కాలక్షేపం అవ్వాలో తెలియట్లేదు. ఇలా టీవీ పెట్టి మంచి పని చేశావు అని అందరూ శ్రీ అని పొగడ్తలు వర్షం కురిపిస్తారు. కానీ శ్రేయ మాత్రం మా బెడ్ రూమ్ లో పెట్టుకొని చూసుకోవడానికి నేను టీవీ ఆర్డర్ పెట్టాను అని అంటుంది. నాకు ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి ఏమీ లేదు అందుకే టీవీ పెట్టుకుని నాకు ఇష్టం వచ్చిన ఛానల్ని చూసుకుందామని అనుకున్నాను.. ఉదయం ఇంటి ఓనర్ వచ్చి అంతగా అరిచి పరువు తీసాడు కదా అతనికి ఇవ్వడానికి డబ్బులు లేవు. టీవీ కొనేదేదో అతనికి ఇవ్వచ్చు కదా అని కమలంటాడు. సి కూడా ఇంటి ఓనర్ డబ్బులు లేవని నాన్న రచ్చ చేశాడు కదా అప్పుడు వాళ్లకు ఇవ్వచ్చు కదా అని అంటాడు..
నీ భార్య చేసిన తప్పుకి మేమెందుకు బాధ్యులం అవ్వాలి.. అంత పెద్ద ఇంటిని అమ్మేసి అందరిని రోడ్డుకి ఇచ్చింది అని శ్రేయ దారుణంగా మాట్లాడుతుంది. రాజేంద్రప్రసాద్ ఏంటమ్మా శ్రీయ నువ్వు ఎప్పుడు చూసినా ఆ ఇంటి మీదే పడి ఏడుస్తూ ఉంటావు అయిపోయింది ఏదో అయిపోయింది కదా వదిలేయచ్చు కదా అని అంటాడు. నా టీవీ నా డబ్బులు నా ఇష్టం అని శ్రేయ అంటుంది. ఇక అందరూ కలిసి శ్రీయ ను తిట్టుకుంటారు..
అవని పాలు తీసుకొని అక్షయ్కి ఇవ్వాలని వస్తుంది. మొదట నాకొద్దు అన్న అక్షయ్ నువ్వు చేసిన పొరపాటు వల్ల ఇప్పుడు అందరూ నిన్నే అంటున్నారు. నువ్వు సపోర్ట్ చేయడానికి కూడా నాకు ఎటువంటి దారి దొరకడం లేదు. నువ్వు చేసిన ఈ పొరపాటే ఇందరి జీవితాలని మార్చేసింది అని అక్షయ్ అంటాడు. ఉదయం లాయర్ దగ్గరికి వెళ్ళావని కమల్ చెప్పాడు. అతను శ్రీకర్ ఫ్రెండ్ కాబట్టి శ్రీకర్ మాట్లాడిన మాటలు కూడా నాకు చెప్పాడు. ఇదంతా కాదు నాకు తెలిసిన ఒక లాయర్ ఉన్నరు. ఆ లాయర్ దగ్గరికి వెళ్లి మనం జరిగిన విషయాన్ని చెబుదామని అక్షయ్ అంటాడు.
Also Read:రోహిణికి టెన్షన్.. కోడళ్లతో ప్రభావతి పూజ.. సత్యం ఇంట దీపావళి సంబరాలు..
నాకు సపోర్ట్ చేసినందుకు థాంక్స్ అండి అని అవని అంటుంది. ఇక శ్రీయ మనం కొత్త టీవీని ఓపెన్ చేసి ఇష్టమైన ఛానల్ పెట్టుకుని చూద్దామని అంటుంది. ఇద్దరు కలిసి రాతిరి టీవీ పెట్టుకుని పెద్దగా సౌండ్ పెట్టి రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు. వీళ్ళ సౌండ్ కి లేచిన కమల్ ఇంట్లో అందరూ పడుకున్నారు ఆ మాత్రం మీకు బుద్ధి లేదా అని అంటాడు. మాటీవీ మా ఇష్టం మా గదులకు రావాల్సిన అవసరం నీకేంటి అని శ్రియ అంటుంది. నువ్వు ముందు ఇకనుంచి వెళ్ళు అని శ్రేయ కమల్ తో సీరియస్గా అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..