INDW vs NZW: వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లన్ని చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఇక ఈ టోర్నమెంట్లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మహిళల ( India Women vs New Zealand Women ) జట్ల మధ్య ఇవాళ రసవత్తర పోరు జరగనుంది. ఇప్పటికే 23 మ్యాచ్ లు పూర్తికాగా ఇవాళ 24వ మ్యాచ్ జరుగుతోంది. అయితే ఇవాళ జరిగే మ్యాచ్ న్యూజిలాండ్ తో పాటు టీమిండియాకు చాలా కీలకము. ఇందులో ఏ జట్టు ఓడిపోయినా ఇంటికి వెళ్లే ప్రమాదం పొంచి ఉంది.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో ( Dr DY Patil Sports Academy, Navi Mumbai) మ్యాచ్ జరగనుంది. ఎప్పటి లాగే మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఈ రెండు జట్లు తలపడతాయి. రెండున్నర గంటలకు టాస్ ప్రక్రియ ఉంటుంది. జియో హాట్ స్టార్ లేదా స్టార్ స్పోర్ట్స్ లో ఈ మ్యాచ్ లు తిలకించవచ్చు. ఈ మ్యాచ్ కు ఎలాంటి వర్షం అడ్డంకి లేదు.
వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో ఇవాళ టీమిండియా లేదా న్యూజిలాండ్, రెండిటిలో ఏదో ఒక జట్టు ఓడిపోవడం ఖాయం. ఓడిపోయిన జట్టు సెమీస్ ఆశలను వదులుకోవాల్సి ఉంటుంది. ఇంటికి వెళ్లే ప్రమాదం పొంచి ఉంటుంది. ఇప్పటికే ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మూడు జట్లు కూడా సెమీఫైనల్ కు వెళ్లాయి. నాలుగో స్థానం కోసం న్యూజిలాండ్ తో పాటు టీమ్ ఇండియా పోటీ పడుతున్నాయి. సెమీస్ వెళ్లేందుకు ఈ రెండు జట్లకు మాత్రమే అవకాశం ఉంది. ఇందులో టీం ఇండియా గెలిచి బంగ్లాదేశ్ పైన కూడా గెలవాల్సి ఉంటుంది. అప్పుడు ఎలాంటి సమస్య లేకుండా నేరుగా సెమీ ఫైనల్ కు వెళుతుంది. అలా కాదని ఇవాళ ఓడిపోతే, బంగ్లాదేశ్ పైన కచ్చితంగా విజయం సాధించాలి. దాంతో పాటు న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగే మ్యాచ్ లో కివీస్ ఓడిపోవాల్సి ఉంటుంది. అలా జరిగితే టీం ఇండియా రన్ రేట్ బాగుంటే సెమీ ఫైనల్ కు వెళుతుంది.
భారత మహిళల క్రికెట్ జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, రిచా ఘోష్ (డబ్ల్యుకె), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, స్నేహ రాణా, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గయాక్వాడ్, హర్లీన్ డియోల్
న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టు: సోఫీ డివైన్ (సి), అమేలియా కెర్, సుజీ బేట్స్, మ్యాడీ గ్రీన్, బ్రూక్ హాలిడే, జార్జియా ప్లిమ్మర్, లీ తహుహు, జెస్ కెర్, ఫ్రాన్ జోనాస్, ఇజ్జీ గజ్ (WK),