Tuni Rape case update: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తునిలో సంచలనం సృష్టించిన బాలిక అత్యాచారం కేసు కీలక మలుపు తిరిగింది. నిందితుడు తాటిక నారాయణరావు గతరాత్రి ఆత్మహత్య పాల్పడ్డాడు. పోలీసులు అదుపులో ఉన్న నిందితుడు ఆత్మహత్యకు ఎలా పాల్పడ్డాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తునిలో బాలిక అత్యాచారం ఘటన
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తునిలో మైనర్ బాలికపై అత్యాచారం రెండురోజుల కిందట జరిగింది. నిందితుడు తాటిక నారాయణరావు అరెస్టు చేశారు పోలీసులు. బుధవారం రాత్రి తుని గ్రామీణ పోలీసుస్టేషన్ నుంచి కోర్టుకు తరలిస్తున్నారు. ఆ సమయంలో బహిర్భూమికి వెళ్తానని పోలీసులకు చెప్పాడు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత సమీపంలో చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు నిందితుడు.
ఉన్నట్లుండి చెరువులో పెద్ద శబ్దం రావడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు గజ ఈతగాళ్లు రంగంలోకి దింపారు. వారి సాయంతో గాలింపు చేపట్టారు. చివరకు నిందితుడు నారాయణరావు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు ఆత్మహత్య, ఎలా జరిగింది?
మనవరాలి వయసున్న బాలికను పాఠశాల నుంచి తీసుకెళ్లాడు నారాయణరావు. అలా బాలికతో పరిచయం పెంచుకున్నాడు. పాఠశాలకు వెళ్లే సమయంలో తినుబండారాలు కొనిపెట్టడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. తాను తాతనంటూ పాఠశాల సిబ్బందికి చెప్పాడు నారాయణరావు. బాలిక ఆరోగ్యం సరిగాలేదని, ఆసుపత్రిలో చూపిస్తానంటూ మంగళవారం స్కూల్ నుంచి బయటకు తీసుకువెళ్లాడు.
ALSO READ: ఢిల్లీలో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు క్రిమినల్స్ హతం
తొండంగి సమీపంలోని ఓ తోటలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి బాలిక పాఠశాలకు వెళ్లింది. చివరకు బాలిక పేరెంట్స్‌కు ఈ విషయం తెలిసింది. బాలిక కుటుంబసభ్యులు, స్థానికులు నిందితుడు నారాయణరావుకు దేహశుద్ధి చేశారు. ఈ విషయం తెలియగానే పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి నిందితుడు నారాయణరావుని అరెస్టు చేశారు.
ఈ వ్యవహారంపై బుధవారం రోజంతా ఏపీ అంతటా రచ్చ అయ్యింది. నిందితుడి వ్యవహారశైలిపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్న మంత్రి లోకేష్ రియాక్ట్ అయ్యారు. పోలీసుస్టేషన్ నుంచి కోర్టుకు నిందితుడ్ని తరలిస్తుండగా చెరువులో దూకి గల్లంతయ్యాడు. ఉన్నట్లుండి నిందితుడు ఆత్మహత్య చేసుకోవడాన్ని ఆయన కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. పోలీసులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న తుని మైనర్ బాలిక అత్యాచార కేసు నిందితుడు
కాకినాడ జిల్లా తునిలో బాలికపై అత్యాచారం చేసిన కేసులో, బుధవారం రాత్రి కోర్టుకు తరలిస్తుండగా మూత్రవిసర్జన కోసం వెళ్లి చెరువులో దూకిన నిందితుడు టీడీపీ నేత తాటిక నారాయణ రావు
గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు… https://t.co/RKQdgnPnR9 pic.twitter.com/owU4kvQjRG
— ChotaNews App (@ChotaNewsApp) October 23, 2025