E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: అయ్యో ప్రేమ.. ధీరజ్ పరిస్థితి దారుణం.. షాకిచ్చిన సేటు..

Illu Illalu Pillalu Today Episodes: అయ్యో ప్రేమ.. ధీరజ్ పరిస్థితి దారుణం.. షాకిచ్చిన సేటు..
Advertisement

Illu Illalu Pillalu Today Episode October 24th : భాగ్యం బయట కూర్చుని ఆపిల్స్ తింటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఆనందరావు అమ్ముడు ఎక్కడ కనిపించడం లేదు అమ్మ కోసం ఫ్రెష్ కూరగాయలు తీసుకొని వచ్చాను అని అంటాడు. అయితే భాగ్యం ఎలా వెళ్లిందో ఎక్కడికి వెళ్లిందో నాకు తెలియదు అని చెప్తుంది. ఆనందరావు మాత్రం కంగారు పడిపోతూ ఉంటాడు.. అయితే లోపలికి వెళ్లి చెక్ చేసిన ఎస్ఐ అక్కడ వల్లిలేదని తెలుసుకొని ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది. అయితే తిరుపతి వల్లిని తన ఇంటి దగ్గర వదిలి పెట్టేసి వస్తాడు. వల్లి ఎంత బాధ పడుతున్నా సరే తిరుపతి మాత్రం నేనేం చేయలేనమ్మ అప్పుడప్పుడు నర్మస దగ్గరికి వెళ్లి అడుగు తను ఏదో ఒకటి చేస్తుంది అని చెప్తాడు ఇక మళ్ళీ రాడంతో ఆ ఎస్సై ఆనందరావుకి భాగ్యంకి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది.

ప్రేమను బయటకు పంపించిన ధీరజ్..

ప్రేమని ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని ధీరజ్ తన బ్యాగు ని తీసుకొని బయటికి తీసుకెళ్తూ ఉంటాడు. అయితే అప్పుడే సుకన్య అక్కడికి వచ్చి ఇంటికి కోడల్ని బయటకు పంపించే ఆచారం ఉందా ఏంటి నిన్నవల్లిని ఈరోజు ప్రేమని రేపు నర్మదని ఆ తర్వాత నన్ను కూడా పంపించేస్తారని అనడంతో అప్పుడే అక్కడికి వచ్చిన వేదవతి తింగరి మొహం వేసుకొని ఏది పడితే అది అనద్దు అని అంటుంది. అయితే ప్రేమ అసలు నిజం చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు..

ప్రేమ మాటతో నర్మదా షాక్..

Advertisement

ప్రేమని అస్సలు ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండనివ్వను అని ధీరజ్ తన బట్టలు సర్ది బయటకు తీసుకొని వస్తూ ఉండగా.. అందరూ ఏమైందిరా ఎందుకురా దాన్ని పంపించాలి అనుకుంటున్నాం.. ఏదైనా తప్పు చేసిందా అని అడుగుతారు.. అయితే ఈ క్రమంలో సుకన్య కాస్త ఓవరాక్షన్ చేస్తుంది దానికి వేదవతి కౌంటర్ల వర్షంతో నోరు మూయిస్తుంది.. మరి ఏం చేసింది రా ప్రేమ అంతగా తనని ఎందుకురా ఇంట్లో నుంచి పంపించాలి అనుకుంటున్నావు అని ధీరజ్ ని అందరూ అడుగుతారు. ఇది ఏం చేసిందో తెలుసా అని అంటున్న సరే ప్రేమ నేనేం చేయలేదు కేవలం పాట పాడాను అంతే అని అంటుంది.. పాట పాడితే అంత ఘోరంగా పాడావా నువ్వు అలా పాడడం వల్లే ధీరజ్ నేను ఇంట్లో నుంచి పంపిస్తున్నాడని నర్మదా అంటుంది.

ఏంటి.. 30లక్షలా..?

నేను అంత అద్భుతంగా పాట పాడను మొత్తానికి ధీరజ్ని గెలిపించాను అని ప్రేమ అంటుంది. ఏంటి ధీరజ్ ని నువ్వు గెలిపించావా ఏం మాట్లాడుతున్నావ్ ప్రేమ అని నర్మదా అడుగుతుంది. నేను పాడిన పాట ఏంటో తెలుసా వేలంపాట.. అందులో కార్ ఏజెన్సీ మనకే వచ్చింది ధీరజ్ కొద్దిరోజుల్లో కార్ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాడు అంటూ గొప్పగా చెప్తుంది. 12 లక్షలు పడాల్సిన పాటని ఏకంగా 30 లక్షలు పడి నా కొంప ముంచేసింది అని ధీరజ్ చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. ఆ డబ్బులు నేను ఎక్కడ నుంచి కట్టాలి నీ బాబు దగ్గరనుంచి కట్టాలా అని ధీరజ్ ప్రేమని అంటాడు అయితే ప్రేమ మాత్రం మా బాబు ఎందుకు ఈ బేబీ చాలు నా నగలు అమ్మేసి కట్టేద్దామని అంటుంది. అది నగలు కాదే నాగుపాములు నా మెడకు చుట్టుకున్నాయి నన్ను చంపబోయే దానికే అవే చాలు అని ధీరజ్ భయపడిపోతూ ఉంటాడు.

ప్రేమకు సపోర్ట్ గా రామరాజు..

Advertisement

ఏంట్రా ఇక్కడ ఏదో పెద్ద రచ్చ జరుగుతున్నట్టు ఉంది ఎందుకురా మీరందరూ బయట ఉన్నారు అని రామరాజు అడుగుతాడు. వేలంపాటలు ప్రేమ చాలా ఎక్కువ రేటుకి పాట పాడింది అని తీరేస్ చెప్పగానే ఒక్కొక్కసారి ప్రత్యర్థుల ఒత్తిడిని తట్టుకోవడానికి అలా చేయాల్సిందే అని ప్రేమకు సపోర్టుగా రామరాజు అనగానే చూసావా మావయ్య గారు కూడా నాకు సపోర్ట్ గా ఉన్నారు అని ప్రేమ చాలా సంతోషంగా ఉంటుంది. ఒకటి రెండు కాదు నాన్న 30 లక్షల కి పాట పాడింది అని ధీరజ్ టెన్షన్ పడిపోతుంటాడు.. నేనున్నా కదరా నేను చూసుకుంటాలే అని రామరాజు భరోసా ఇస్తాడు.. మనం కొన్నిసార్లు చేసిన పొరపాట్లు మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి అది గుర్తుపెట్టుకుంటే మంచిది అని రామరాజు అనగానే అందరూ మౌనంగా ఉండిపోతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Gundeninda GudiGantalu Today episode: ప్రభావతి పై అనుమానం.. రోహిణి ఇరుక్కుంటుందా..?చివర్లో షాకింగ్ ట్విస్ట్..

Related News

Intinti Ramayanam: కమల్ కు కొత్త గర్ల్ ఫ్రెండ్.. ఆమె బ్యాగ్రౌండ్ ఇదే..?

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతి పై అనుమానం.. రోహిణి ఇరుక్కుంటుందా..?చివర్లో షాకింగ్ ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: పల్లవికి విడాకులు ఇస్తున్న కమల్.. శ్రీకర్ కు టెన్షన్.. అవని సూపర్ ప్లాన్..

Brahmamudi Serial Today Episode October 24th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రేఖ ప్లాన్ అట్టర్ ప్లాప్ – సుభాష్ సేఫ్

Podarillu Today Episode : అడ్డంగా దొరికిపోయిన జమున.. గుండె బద్దలు కొట్టే నిజం.. నారాయణ ఇచ్చిన ట్విస్ట్..

Podarillu Maha: మహాకు బంఫర్ ఆఫర్.. ఇది అస్సలు ఊహించిఉండరు..

Saturday Movies : సినిమాల జాతర.. శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు..

Big Stories

Advertisement
×