E-Paper
Advertisement

మారనున్న పానగల్ ఆలయ రూపురేఖలు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!

మారనున్న పానగల్ ఆలయ రూపురేఖలు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!
Advertisement

Panagal Temple Beautification: నల్లగొండ జిల్లా కేంద్రానికి సమీపంలోని చారిత్రక పానగల్ శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయ రూపురేఖలు మారనున్నాయి. ఎంతో చరిత్ర, ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన ఈ ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు, నీటి కొలనును అద్భుతంగా సుందరీకరించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లను విడుదల చేసింది. ఇందుకు సంబంధించి పర్యాటక, సాంస్కృతిక శాఖ జీఓ నంబర్ 311ను జారీ చేసింది. ఈ నిర్ణయంతో పానగల్ ఆయల అభివృద్ధిపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

మరింత అద్భుతంగా ఆకట్టుకోనున్న పానగల్‌

చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మిక ప్రాధాన్యం, ప్రకృతి అందాలతో ఆకట్టుకునే పానగల్‌ను ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలను తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా వారసత్వ పర్యాటకం, ఆధ్యాత్మిక పర్యాటకం, పర్యావరణ పర్యాటకానికి అనువైన ప్రాంతంగా పానగల్‌ను తీర్చిదిద్దేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టబోతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఇంజినీరింగ్ బృందం ఈ ప్రాంతాన్ని పరిశీలించింది. అభివృద్ధి పనులకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం సుమారు రూ.20 కోట్లతో ప్రాథమిక అంచనాలను రూపొందించింది.  తాజాగా నిధులు విడుదల అయ్యాయి.

ఆలయ పరిసరాల్లో సుందరీకరణ పనులు

Advertisement

ఈ ప్రాజెక్టులో భాగంగా శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయ పరిసరాలతో పాటు సమీపంలోని నీటి కొలనులను, ఇతర  జలవనరులను అద్భుతంగా తీర్చిదిద్దనున్నారు. ఈ ప్రాంతానికి వచ్చే భక్తులు, పర్యాటకులకు మెరుగైన వాతావరణం కల్పించేలా ఏర్పాట్లు చేయనున్నారు. పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు ఇప్పటికే ఉన్న సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు ఆధునికీకరించనున్నారు. అయితే, ఏయే పనులు చేపట్టనున్నారు? వాటి రూపకల్పన ఎలా ఉండనుంది? అనే అంశాలపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

TGTDC ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు

తాజాగా నిధులు విడుదల అయిన నేపథ్యంలో పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి, కొత్త పర్యాటక యూనిట్ల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న యూనిట్ల అభివృద్ధి, ఆధునికీకరణ కోసం వీటిని చేయాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో వెల్లడించింది.  ప్రాజెక్టుకు సంబంధించి తదుపరి అవసరమైన చర్యలను హైదరాబాద్‌ లోని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చేపట్టనుంది.

స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం

Advertisement

పానగల్ అభివృద్ధి ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశముంది. దీంతో స్థానికంగా చిన్న వ్యాపారాలు, పర్యాటక సేవలు, ఇతర ఉపాధి ఆధారిత కార్యకలాపాలకు ఊతం అందనుంది. భక్తులు, చరిత్రపై ఆసక్తి ఉన్నవారు, పర్యాటకులు ఒకే ప్రాంతంలో ఆధ్యాత్మికతతో పాటు వారసత్వ సంపదను ఆస్వాదించే అవకాశం ఏర్పడుతుంది. మొత్తంగా పానగల్ శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.20 కోట్ల మంజూరు కావడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్ని పనులు అనుకున్నట్లు జరిగితే పానగల్‌కు రాష్ట్ర పర్యాటక రంగంలో మరింత గుర్తింపు లభించే అవకాశం ఉంది.

Read Also: మందు ముట్టరు.. కట్టుబాటు దాటరు.. 25 ఏళ్లుగా మద్యానికి దూరంగా 11 గ్రామాలు!

Tags

Related News

రైలు ప్రయాణంలో విండో సీటు కావాలా? టికెట్ బుక్ చేసే ముందు ఇది తెలుసుకోండి

రైలు ప్రయాణంలో మీ సీటు వేరే వ్యక్తి ఆక్రమించారా? గొడవ పడొద్దు.. వెంటనే ఈ పని చేయండి

బీచ్‌లో పిల్లాడిని వదిలేసి.. తల్లిదండ్రుల రీల్స్, ఛీ కొంచెమైనా సిగ్గుందా?

ప్రకృతితో కలిసి ప్రయాణం.. భారత్‌ లో చూడాల్సిన 7 విస్టాడోమ్ రైల్వే రూట్స్ ఇవే!

ప్రయాణికులకు అలర్ట్.. వందే భారత్ సహా పలు రైళ్ల టైమ్ మారింది!

కొడుకు కోసం 24 ఏళ్ల వెతుకులాట.. ఈ తండ్రి కథ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!

ఫ్యాన్స్‌ ను వెర్రోళ్లను చేసిన నా అన్వేష్.. మళ్లీ మాట తప్పేశాడుగా!

Big Stories

Advertisement
×