Karthika Deepam 2 serial today Episode: సూరజ్ ఆఫీసుకు వెళ్లిన పోలీసులు జ్యోత్స్న నాలుగు రోజులు ఎక్కడున్నారని అడుగుతారు. అయితే ఎవరో తనను కిడ్నాప్ చేశారని జ్యోత్స్న చెప్పగానే.. వాళ్లెవరో గుర్తు పట్టగలవా అంటూ పోలీసులు అడిగితే.. లేదని తన కళ్లకు గంతలు కట్టారని చివరకు తనను రోడ్డు మీద వదిలేసినప్పుడు కూడా కళ్లకు గంతలు కట్టుకునే ఉన్నాయని అందవల్ల తాను వాళ్లను గుర్తు పట్టలేనని చెప్తుంది జ్యోతస్న అయితే మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని పోలీసులు అడిగితే.. ఉందని జ్యోత్స్న, మాలినిని చూపిస్తుంది.
దీంతో సూరజ్, మాలిని షాక్ అవుతారు. నన్ను చూపిస్తావేంటే.. అంటూ కోపంగా మాలిని అడిగితే.. తనకు మాలిని గారి మీదే అనుమానం ఉందని జ్యోత్స్న చెప్తుంది. తన కిడ్నాప్‌కు కారణం ఆవిడే అయ్యుండొచ్చని చెప్తుంది. అందుకు మాలిని కోపంగా చూస్తూ.. నేనే నిన్ను కిడ్నాప్ చేశానని నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా..? సాక్ష్యాలు చెప్పు.. నిరాధారాలతో నన్ను అనుమానిస్తే నేను తిరిగి నీమీద కేసు పెట్టాల్సి వస్తుంది అంటూ మాలిని బెదిరస్తే.. తన దగ్గర ఆధారాలు ఉన్నాయని జ్యోత్స్న చెప్తుంది. మాలిని తనను కిడ్నాప్ చేసిన తర్వాత సూరజ్ తనకు పంపించిన మేసేజ్ లే సాక్ష్యాలు అంటూ చెప్తుంది జ్యోత్స్న.
జ్యోత్స్న మాటలు విని మెసేజులు చెక్ చేసిన పోలీసులు మాలినికి వార్నింగ్ ఇస్తారు. ఈ కిడ్నాప్ కేసులో మిమ్మల్ని అనుమానితురాలిగా చేరుస్తున్నాం. ఇక ఈ కేసు కంప్లీట్ అయ్యే వరకు మీరు ఊరు విడిచి ఎక్కడికి వెళ్లకూడదు.. ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే తమ పర్మిషన్ తీసుకోవాలని.. ప్రతిరోజు స్టేషన్‌కు వచ్చి హాజరు కావాలని చెప్పి వెళ్లిపోతారు. బయటకు వెళ్లిన ఎస్సై కి కార్తీక్ షేక్ హ్యండ్ ఇస్తూ.. నవ్వడం మాలిని గమనిస్తుంది. ఇదంతా కార్తీక్ గాడి పనా చెప్తాను అనుకుంటూ వెళ్లిపోతుంది.
టిఫిన్ బండి దగ్గర ఉన్న శివనారాయణ ఇంకా ఎన్నాళ్లని ఈ టిపిన్ బండి నడిపిస్తాం దశరథ చిన్నగా ఎక్కడైనా హోటల్ పెడదాం.. ఆ తర్వాత లోన్ తీసుకుని రెస్టారెంట్ ఓపెన్ చేద్దాం అంటాడు. అందుకు దశరథ సరే నాన్న అలాగే చేద్దాం నేను ఒక ఫ్రెండ్‌ను కలిసి వస్తాను.. వచ్చేసరికి లేట్ అవుతుంది నా కోసం ఎదురు చూడొద్దు అంటూ దశరథ వెళ్లిపోతాడు. ఇక సుమిత్ర కూడా అందరం ఇక్కడే ఈ బండి దగ్గరే ఉంటే ఎలా మామయ్య..నేను ఏదైనా పని చూసుకుంటాను అని చెబితే.. నువ్వేం చేస్తావు సుమిత్ర వద్దులే నువ్వు ఇక్కడ కూడా ఉండొద్దు ఇంటికి వెళ్లమ్మా అంటాడు అయినా సుమిత్ర వినకుండా తాను ఏదైనా పని చూసుకుంటానని వెళ్తుంది సుమిత్ర.
ఆఫీసులో ఉన్న మాలిని కోపంగా కార్తీక్, దీపల దగ్గరకు వెళ్లి తిడుతుంది. నేను ఇచ్చే జీతంతో బతుకుతూ ఆ జ్యోత్స్నన మా మీదకే ఉసిగొల్పుతున్నారా..? ఆ పోలీస్ నీకు ఫ్రెండే కదా జ్యోత్స్న నా మీద కేసు పెట్టేలా చేసింది మీరే కదా అంటూ తిడుతుంది. కానీ కార్తీక్, దీపలు మాత్రం జ్యోత్స్న విషయంలో తాము ఇన్వాల్వ్ కాలేదని చెప్తారు. అయితే జ్యోత్స్నను కేసు వెనక్కి తీసుకోమని చెప్పండి అంటుంది మాలిని. అందుకు కార్తీక్, దీపలు తాము చెప్పినా జ్యోత్స్న కేసు వెనక్కి తీసుకోదని తామే కాదు ఇంట్లో వాళ్లు చెప్పినా వినదని చెప్తారు. సూరజ్ కు పీఏగా చేరింది అని ఇంట్లో వాళ్లకు తెలిసి వద్దని వారించినా వినకుండా జాబ్ కంటిన్యూ చేస్తుంది జ్యోత్స్న. జ్యోత్స్న వేడెక్కిన పెనం లాంటిది నువ్వు కావాలని ఆ పెనాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకున్నావు అది నిన్ను కాల్చే వరకు ఆగదు అత్తా అంటుంది దీప. మాలిని కోపంగా చూస్తుంది.
మరోవైపు ఏదైనా పని చూసుకుంటానని వెళ్లిన సుమిత్ర ఒకరి ఇంట్లో వంట మనిషిగా కావాలని బోర్డు చూసి లోపలికి వెళ్లి అడుగుతుంది. వాళ్లు సుమిత్ర చేసే వంట నచ్చితేనే వంట మనిషిగా తీసుకుంటామని చెప్తారు. సుమిత్ర అందుకు ఓకే అంటుంది. కిచెన్‌లోకి తీసుకెళ్లి వంట చేయమని చెప్తారు. సుమిత్ర వంట చేశాక వాళ్లు తిని వంటలు చాలా బాగున్నాయని సుమిత్రకు పని ఇస్తారు. నెలకు 7 వేలు జీతం ఇస్తామని చెప్తారు. సుమిత్ర సరేనంటూ పనిలో జాయిన్ అయిపోతుంది.
మాలిని కోపంగా దక్షిణమూర్తి దగ్గరకు వెళ్లి ఆఫీసులో జరిగిన విషయాలు చెప్తుంది. జ్యోత్స్న తన మీద కిడ్నాప్ కేసు పెట్టిన విషయం. కార్తీక్ ఎస్సైతో మాట్లాడుతూ ఉండటం.. కార్తీక్, ఎస్సై ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అన్న విషయం చెప్పి ఆ ముగ్గురు కలిసి మన ఆఫీసలో చేరి మనకు ద్రోహం చేయబోతున్నారు మామయ్య అంటూ చెప్పగానే. దక్షిణమూర్తి కోపంగా ఇదంతా ఎవరు నడిపిస్తున్నారో నాకు తెలుసు.. అక్కడే తేల్చుకుందాం పదమ్మా అంటూ దక్షిణమూర్తి, మాలినిని తీసుకుని బయలుదేరుతాడు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్ అయిపోతుంది.