Chilakaluripet Municipality: వైసీపీలో ఫైర్ బ్రాండ్‌గా అవతారం ఎత్తుతున్న మాజీ మంత్రి విడదల రజినీకి మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని షాక్ తగిలింది. ఆమె వేసుకున్న ఎత్తులు చిత్తయ్యాయి. చివరి నిమిషంలో వైసీపీ ఛైర్‌పర్సన్ అభ్యర్థి ఫ్లేట్ ఫిరాయించారు. టీడీపీ గూటికి చేరిపోయారు. ఈ విషయం తెలిసి మాజీ మంత్రి విడదల రజిని ఒక్కసారిగా షాకయ్యారు. దీంతో మరొక అభ్యర్థిని వెతికే పనిలోపడ్డారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీకి షాకులు తగులుతున్నాయి. చిలకలూరిపేట మున్సిపాలిటీలో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. చిలకలూరిపేట పురపాలక వైసీపీ ఛైర్‌పర్సన్ అభ్యర్థి కరీమూన్ షేక్ ఒక్కసారి ప్లేటు ఫిరాయించారు. వైసీపీ నుంచి టీడీపీ గూటికి వచ్చేశారు. ఆదివారం రాత్రి 10 గంటలకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో టీడీపీలో కరీమూన్ చేరారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం అభ్యర్థుల జాబితా ప్రకటించిన గంటల వ్యవధిలో ఈ పరిస్థితి చోటు చేసుకుంది. వైసీపీ ఛైర్‌పర్సన్ కరీమూన్ మీడియా ముందుకొచ్చారు. కూటమి ప్రభుత్వం పట్టణాభివృద్ధికి చేస్తున్న కృషిని చూసి తాము అందులో భాగస్వాములు కావాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో టీడీపీలో చేరుతున్నట్లు వెల్లడించారు.
తాము కూటమి తరఫున ప్రచారంలో పాల్గొంటామని, భర్త యూసఫ్ అలీ ఈ పార్టీలో చేరినట్టు వెల్లడించారు. వైసీపీ మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి టీడీపీలో చేరడంతో జనసేన ఖాతాలోకి చిలకలూరిపేట మున్సిపాలిటీ చేరింది. తొలిసారి చిలకలూరిపేట మున్సిపాలిటీ పీఠంపై జనసేన జెండా రెపరెపలాడనుంది. రాత్రి జరిగిన పరిణామాలతో ఒక్కసారిగా మాజీ మంత్రి విడదల రజినీ షాక్ అయ్యారు.
ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో పడ్డారు. పోటీలో ఉన్న మరొక అభ్యర్థికి మద్దతు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వెంటనే రాత్రికి రాత్రి వైసీపీ అభ్యర్థులతో ఆమె సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి గురువు టీడీపీ ఎమ్మెల్యే పుల్లారావు కొట్టిన దెబ్బకు రజినీ ఒక్కసారిగా షాకైంది. రానున్న రోజుల్లో ఇంకెన్ని షాకులు తగులుతాయోనని మున్సిపాలిటీలో కేడర్ చర్చించుకోవడం కొసమెరుపు.
ALSO READ: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. బద్దలైన వైసీపీ కంచుకోటలు, కూటమి ఖాతాల్లో 17 మున్సిపాలిటీలు
🚨 చిలకలూరిపేటలో వైసీపీకి బిగ్ షాక్! 💥
వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి షేక్ కరీమున్ టీడీపీలో చేరిక! 💛
ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్న కరీమున్.
🔥 అభివృద్ధి వైపు అడుగులు.. టీడీపీ వైపు చూపులు!#TDP #Chilakaluripet #PrathipatiPullarao pic.twitter.com/Cn6d3szQpu
— dhanekulamalli (@dhanekulamalli) October 25, 2026