BigTV English

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి నర్మద స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రేమను గెలికిన వల్లి.. విశ్వం ప్లాన్ వర్కౌట్..?

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి నర్మద స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రేమను గెలికిన వల్లి.. విశ్వం ప్లాన్ వర్కౌట్..?

Illu Illalu Pillalu Today Episode September 11th: నిన్నటి ఎపిసోడ్ లో..  రామరాజు వేదవతి సంతోషంగా నవ్వుకుంటూ ఉండటం చూసినా భద్ర కన్నీళ్లు పెట్టుకుంటుంది. అక్కడికొచ్చిన విశ్వం ఏంటి అత్త వాళ్ళని చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నావు ఏమైంది అని అడుగుతాడు. పాతికేళ్ల క్రితం నా చెల్లెలు దూరమైపోయింది దాని గురించి నేను బాధపడుతూనే ఉన్నాను. చిన్న కూతురు లాగా పెంచుకున్న మేనకోడలు కూడా నాకు దూరం అయిపోయింది అది నేను తట్టుకోలేక పోతున్నాను. మనం కూడా ఆ రామరాజుకి అతని సంతోషాన్ని దూరం చేయాలి అని భద్ర అంటుంది. ఆ రామరాజు సంతోషాన్ని దూరం చేయాలి ఆడి మూడో కూతురు అమూల్యని నువ్వు ప్రేమించి ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవాలి.. ధీరజ్ గాడు ఎలాగైతే మన ప్రేమను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు అలానే పెళ్లి చేసుకోవాలి. నువ్వు పెళ్లి చేసుకుని దాంతో కాపురం చేయడానికి కాదురా దాన్ని టార్చర్ చేయడానికి.. ఆ రామరాజు మన ఇంటి గేటు ముందర కొచ్చి కన్నీళ్లు పెట్టుకోవాలి. అప్పుడు నా చెల్లెలు పోయిందని నా మేనకోడలు వెళ్ళిందని బాధ తుడిచిపెట్టి పోతుంది నాలో అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మంచి టైం లో వచ్చి డిస్టర్బ్ చేసింది అని శ్రీవల్లిని తిట్టుకుంటారు. అయితే ఏంటి వదిన ఇలా వచ్చావు ఏం కావాలి అని సాగర్ అడుగుతాడు. నేను కొంచెం నర్మదతో అర్జెంటుగా మాట్లాడాలి అని శ్రీవల్లి అంటుంది. అయితే శ్రీవల్లి నర్మద దగ్గరకు వచ్చి నేను ఒక విషయం గురించి మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. అది గురించి నాకు క్లారిటీ ఇస్తే ఆ తర్వాత మామయ్య గారి దగ్గర మీరు సేఫ్ గా ఉంటారు అని అడుగుతుంది. విషయం గురించి నువ్వు మాట్లాడాలనుకుంటున్నావు అని శ్రీవల్లిని అడుగుతుంది నర్మదా..

దేని గురించి మాట్లాడాలనుకుంటున్నావ్ అక్క అని అడుగుతుంది నర్మదా. నువ్వు సాగరు నిన్న ఎగ్జామ్స్ సెంటర్ దగ్గర కనిపించారట మా ఫ్రెండు ఫోన్ చేసి చెప్పింది ఎగ్జామ్ ఎందుకు రాశారు అని అడుగుతుంది. ఆ మాట వినగానే నర్మదా ఒక్కసారిగా షాక్ అవుతుంది. మేం ఎగ్జామ్ దగ్గరికి వెళ్లడమేంటి పక్కూర్లో పెళ్లికి వెళ్ళామని చెప్పాను కదా అని నర్మదా అంటుంది. పెళ్లి కి వెళ్ళారా అయితే ఫోటోలు దిగి ఉంటారు కదా అవి ఎక్కడున్నాయో ఒకసారి చూపించండి అని అడుగుతుంది. నువ్వు అడుగుతావని తెలియదు కదా అక్క ఈసారి నుంచి ఫోటోలు తీసుకుని వస్తాము అని నర్మదా అంటుంది..


ప్రేమ దగ్గరికి వెళ్లిన శ్రీవల్లి నువ్వు ఒక అబ్బాయిని తరుముకుంటూ పరిగెత్తావు నేను కూరగాయలకు వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు చూశాను అని అంటుంది. కాలేజీకి వెళ్తే రోడ్లమీద ఎందుకు పరిగెడతాను నీకు ఏమైనా పిచ్చా అని ప్రేమ అడుగుతుంది. నేను చూశాను అని చెప్తున్నాను కదా నువ్వెందుకు ఒప్పుకోవడం లేదు అని ప్రేమ ను శ్రీవల్లి అడుగుతుంది. నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావో నేను మాత్రం ఎక్కడా ఎవర్ని కొట్టలేదు పరిగెత్తలేదు అని ప్రేమ అంటుంది. రుజువులు లేకుండా అడిగితే ఎవరు ఒప్పుకుంటారు.

దేవుడా వీళ్ళని ఇరికించే మార్గం ఒకటి చూపించు అప్పుడు వీళ్ళని ఒక ఆట ఆడుకుంటాను అని శ్రీవల్లి అంటుంది. అప్పుడే తన చేతిలోకి ఒక పేపర్ వచ్చి పడుతుంది అది చూసిన శ్రీవల్లి షాక్ అవుతుంది. ప్రేమ ఒక అబ్బాయిని పరిగెత్తించినట్లు ఆ ఫోటో కనిపించడంతో ఒక్కసారిగా సంతోషంతో బయటికి వచ్చి గంతులు వేస్తుంది.. దేవుడు నా వైపే ఉన్నాడు. నాకు ఇంత మంచి చేస్తున్నాడని అస్సలు ఊహించలేదు అని డాన్సులు వేస్తుంది.

అమూల్యను ట్రాప్ చేసేందుకు విశ్వం రెడీగా ఇంటి ముందర వెయిట్ చేస్తూ ఉంటాడు. అమూల్య రాగానే విశ్వం అమూల్యను ఫాలో అవుతూ నిన్ను డ్రాప్ చేస్తాను బైక్ ఎక్కు అని అడుగుతాడు. మా అత్త కూతురిది కదా అందుకే నీతో ఇంత సరదాగా మాట్లాడుతున్నాను నేను నిన్ను డ్రాప్ చేస్తాను ఎక్కు బండి అని అడుగుతాడు.. విశ్వంకి చెప్పు చూపించి అమూల్య నేను రామరాజు కూతుర్ని చెప్పు తెగేలా కొడతాను ఈ విషయం నువ్వు గుర్తు పెట్టుకుంటే మంచిది అని అంటుంది. అయితే ఇదంతా చూస్తున్న భద్ర విశ్వం కు ఆ ఇంటి నుంచి మనకు ఒకరు సహాయం చేస్తే మన పని ఈజీగా అయిపోతుంది అని అంటుంది.

Also Read : భర్తకు దగ్గరైన రాజేంద్ర ప్రసాద్.. అవని పై అక్షయ్ సీరియస్.. పల్లవి ప్లానేంటి..?

అప్పుడే బయటికి వచ్చిన శ్రీవల్లిని చూసి వాళ్ళు ఈ తింగరిదే మనకు పనికి వస్తుంది దీని ఉపయోగించుకుని మనం అమూల్యని లైన్ లో పెట్టాలి అని భద్ర అంటుంది. ఇక శ్రీవల్లి లోపలికి వెళ్లి రామరాజుకు పేపర్ చూపించి అందులో మన ప్రేమ లాగే ఉంది కదా అని అడుగుతుంది.. వేదవతిని రామరాజు అడుగుతాడు. మన ప్రేమ ఎవర్నో తరుముతో వెళ్తుంది ఏంటి ఎవరు వాడు అని రామరాజు అడుగుతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ప్రేమను రామరాజు ఎవరు అబ్బాయిని అడుగుతాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Intinti Ramayanam Today Episode: భర్తకు దగ్గరైన రాజేంద్ర ప్రసాద్.. అవని పై అక్షయ్ సీరియస్.. పల్లవి ప్లానేంటి..?

GudiGantalu Today episode: మీనాను పొగిడేసిన ప్రభావతి.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సుశీల..రోహిణికి ప్రభావతి షాక్..

Nindu Noorella Saavasam Serial Today September 11th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీకి నిజం చెప్పిన సరస్వతి వార్డెన్‌

Brahmamudi Serial Today September 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేవతిని చూసిన రుద్రాణి – నిజం చెప్పొద్దన్న రాహుల్‌

Telugu Serials : సీరియల్స్ లో నటించి పెళ్లి చేసుకున్న రియల్ జంటలు వీళ్లే..!

Big Stories

×