Future city to Amaravati: ఏపీ-తెలంగాణకు సంబంధించి శుభవార్త. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు కీలక అడుగు ముందుకు పడింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అలైన్‌మెంట్ దాదాపుగా ఖరారైంది.ఫ్యూచర్ సిటీకి సమీపంలోని తిప్పారెడ్డిపల్లి నుంచి ఈ రహదారి ప్రారంభమై ఏపీలోని అమరావతి మీదుగా బందరు పోర్టుకు అనుసంధానం కానుంది.
ఏపీ పునర్విభజన చట్టంలో కొన్ని అంశాలపై ఇటీవల కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహించింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి ఏపీ రాజధాని అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీపీఆర్ రెడీ చేసి చర్యలు చేపట్టాలని కేంద్ర రవాణా శాఖకు సూచనలు చేసింది.
ఈ నేపథ్యంలో ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి బాగుంటుందని తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేయడం, కేంద్రానికి తెలపడం జరిగిపోయింది. ఫోర్త్ సిటీ నుంచి అమరావతికి మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేకు రూ.10 వేల కోట్ల అవుతుందని అంచనా వేసింది. 12 లేన్ల ఎక్స్‌ప్రెస్ వే రూపొందనుంది. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి 211 కిలోమీటర్లు.
బందర్ పోర్టుకు దాదాపు 297 కిలోమీటర్లు. ఇరు ప్రాంతాల మధ్య 12 లేన్లతో నిర్మించాలని కేంద్రానికి తెలుగు రాష్ట్రాల ప్రతిపాదనలు చేశాయి. ఫ్యూచర్ సిటీ సమీపంలోని తిప్పారెడ్డిపల్లి ప్రాంతం నుంచి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే ప్రారంభమై అమరావతి మీదుగా బందరు పోర్టుకు అనుసంధానం కానుంది. కొత్త ఎక్స్‌ప్రెస్ వే ద్వారా ఈ నగరాల మధ్య దూరం కేవలం రెండున్నర గంటలు.
ALSO READ: బోధన్ టౌన్లో ఉగ్ర కలకలం.. ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు
రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల మీదుగా హుజూర్‌నగర్‌కు కుడివైపు ఎక్స్‌ప్రెస్ హేవే కొనసాగుతుంది. ఏపీలో సత్తెనపల్లి మీదుగా అమరావతి క్యాపిటల్ సిటీకి అనుసంధానమై చివరకు లంకెలపల్లి మీదుగా బందరు పోర్టుకు చేరనుంది. ఫ్యూచర్‌సిటీ నుంచి తెలంగాణ సరిహద్దు వరకు సుమారు 118 కిలోమీటర్లు ఉండనుంది. అక్కడి నుంచి బందరు పోర్టుకి 180 కిలోమీటర్లు.
ఫ్యూచర్‌సిటీ నుంచి అమరావతికి కేవలం 211 కిలోమీటర్లు. హైదరాబాద్-విజయవాడ మధ్య దూరంతో పోలిస్తే ఇది 57 కిలో మీటర్లు తక్కువ కూడా. అంటే హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారికి అది సమాంతరంగా రానుంది. మధ్య ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని ఇరురాష్ట్రాల అధికారుల అంచనా.
తొలుత 6 నుంచి 8 వరుసలతో నిర్మించాలని భావిస్తున్నాయి. దశలవారీగా 12 లేన్లకు విస్తరించాలని ఫ్యూచర్ ప్లాన్. ఢిల్లీ-మీరట్ హైవే 12 వరుసలు, ఢిల్లీ-గుర్గావ్ మధ్య 16 లేన్లతో ఎక్స్ ప్రెస్ వేలు ఉన్న సంగతి తెల్సిందే.