Intinti Ramayanam Today Episode September 11th: నిన్నటి ఎపిసోడ్ లో.. పార్వతితో వచ్చిన అవని అందరికి దిమ్మతిరిగే షాక్ ఇస్తుంది. అత్తయ్య గారిని పెద్ద చిన్న లేకుండా మాటలు అంటే నేను అసలు ఊరుకోను. నోటికొచ్చినట్టు మాట్లాడితే మర్యాదగా ఉండదు అని పల్లవి అంటుంది. అందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది అవని. అయితే శ్రీకర్తో మాట్లాడాలని బయటికి పిలుస్తుంది.. అక్కడికి వచ్చిన శ్రీకర్ నా భార్య అలా మాట్లాడడం తప్పేమీ కాదు కదా అని అవినీకి షాక్ ఇస్తాడు. అయితే అవని ఇంటికి వచ్చి ఆరాధ్యతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన అక్షయ్ ఆరాధ్యకు చాక్లెట్లు స్వీట్లు అన్ని చాలా తెచ్చిస్తాడు. నీకు జీతం వచ్చిందని నాకు ఇచ్చావు మరి మమ్మీకి ఏం తెచ్చావని అడుగుతుంది.. పార్వతి జ్వరమని హాస్పిటల్ కి వెళుతుంది. అక్కడ రాజేంద్రప్రసాద్ పార్వతిని చూసి ఆమెను తన ఇంటికి తీసుకొని వెళ్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. రాజేంద్రప్రసాద్ పార్వతిని అన్ని అడుగుతాడు.. ఇంట్లో జరుగుతున్న వాటి గురించి పార్వతి రాజేంద్రప్రసాద్ తో చెబుతుంది. అవినీకి ఫోన్ చేసిన రాజేంద్రప్రసాద్ నేను ఇవాల్టికి అత్తయ్యతో పార్టీ అక్కడికి వెళ్తాను అమ్మని అంటాడు. ఏదైనా సమస్య ఉంటే చెప్పండి మావయ్య గారు నేను వస్తాను అని అంటుంది అవని.. ఏ సమస్య లేదు నేను చూసుకుంటాను రేపు వస్తాను అని అంటాడు. ఇక రాజేంద్రప్రసాద్ పార్వతి తో కలిసి ఇంటికి వెళ్తాడు అక్కడ కమల్ అందరినీ తిడతాడు. ఇంతమంది ఉన్నారు అమ్మని ఒంటరిగా ఎందుకు హాస్పిటల్ కి పంపించారు అని అంటాడు. కానీ ఎవరు ఏం మాట్లాడుకున్నారంటే రాజేంద్రప్రసాద్ నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అని అంటారు..
రాత్రంతా పార్వతీని చూసుకున్న రాజేంద్రప్రసాద్ ఆమెకు తగ్గగానే ఉదయం నేను వెళ్ళిపోతాను అని అంటాడు. ఆ మాట వినగానే పార్వతి టెన్షన్ పడుతుంది. ఆగండి మీరు వెళ్లిపోతే నాకు బాధగా ఉంది నేను కూడా మీతో పాటే వస్తాను అని అంటుంది. మీ నాన్నతో కలిసి నేను అక్కడే ఉండాలని అనుకుంటున్నాను అని అందరితో చెప్పి అక్కడికి వెళ్ళిపోతుంది.. ఇక భానుమతి కూడా మీరు అక్కడికి వెళ్ళిపోతుంటే ఇక్కడ నేనేం చేయాలి? నా కొడుకు కోసం నేను అక్కడికే వస్తాను అని బ్యాగు తెచ్చుకుంటుంది.
అవని ఇంకా మావయ్య గారు రాలేదు ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటుంది.. ఆరాధ్య నానమ్మ తాతయ్య వచ్చేసారు అని అంటుంది. పార్వతి రాగానే అవని చాలా సంతోషంగా ఉంటుంది. మీకు ఎలా ఉంది అత్తయ్య అని అడుగుతుంది. నాకు ఇప్పుడేం బాగానే ఉంది అమ్మ పర్వాలేదు అని పార్వతి అంటుంది. రాజేంద్రప్రసాద్ నీకు ఒక గుడ్ న్యూస్ అమ్మ అవని మీ అత్తయ్య ఇకమీదట నుంచి మనతోనే ఉండడానికి వచ్చింది అని అంటాడు. ఇక అందరూ కలిసి అక్షయ్ ని అడుగుతారు.
అప్పుడే అక్కడికి వచ్చిన అక్షయ్ చక్రం తిప్పేసావా అందరిని నీ వైపు తిప్పుకున్నావని అవని అవమానించేలా మాట్లాడుతాడు. అయితే నువ్వేం బాధపడకు అమ్మా అవని.. వాడి మనసు మార్చేందుకే నేను మీ మావయ్య ఇక్కడికి వచ్చాము ఏదో ఒకటి చేస్తామని అంటుంది. పల్లవి ఇంట్లో జరుగుతున్న విషయాల గురించి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి చెప్తుంది. అయితే వాళ్లందరూ అక్కడ సంతోషంగా ఉంటున్నారు కదా వాళ్ళని ఇంటికి తీసుకొచ్చేందుకు నువ్వు ప్రయత్నం చేయని అంటాడు. ఇంట్లో వాళ్ళు ఒకే చోట ఉంటే విడగొట్టడానికి గొడవలు పెట్టడానికి వీలుగా ఉంటుంది అని సలహా ఇస్తాడు.
Also Read : మీనాను పొగిడేసిన ప్రభావతి.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సుశీల..రోహిణికి ప్రభావతి షాక్..
ఇకపోతే ప్రణతి అన్ని వంటలు సిద్ధం చేసి డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ఉంటుంది. భరత్ నువ్వు ఒక్కదానివి అన్ని పనులు చేసుకోకపోతే నన్ను కూడా సాయం అడగొచ్చు కదా అని అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన శ్రియ ఏం వంటలు చేశావు ఏం కూరలు చేశావు అని అడుగుతుంది. వెజ్ కూరలు చేశానని చెప్పగానే నాకు నాన్ వెజ్ లేకుండా ముద్ద దిగడానికి నీకు తెలుసు కదా నువ్వెందుకు చేయలేదని ప్రణతి పై అరుస్తుంది. అక్కడకు వచ్చిన పల్లవి శ్రియాని చంప పగలగొడుతుంది.. నన్ను కొడతావ్ ఏంటి అని శ్రీయా అడుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో పల్లవి విడగొట్టేందుకు ప్లాన్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..