KishkindhaPuri: ‘కిష్కింధపురి’.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas)హీరోగా, అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్గా తెరకెక్కుతున్న చిత్రం ఇది. హారర్ కాన్సెప్ట్ తో రాబోతున్న చిత్రం కావడంతో అంచనాలు పెరిగిపోయాయి. నిజానికి గత కొంతకాలంగా యాక్షన్, హై బడ్జెట్ చిత్రాలకు దూరంగా ఉన్న ఈయన.. ఇప్పుడు కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలపై దృష్టి పెడుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల ‘భైరవం’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఇప్పుడు ‘కిష్కింధపురి’అంటూ మరో కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ తో మన ముందుకు రాబోతున్నారు. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 12వ తేదీన విడుదల కాబోతోంది.
ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పిల్లలతో పాటు భయపడే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఈ సినిమాకు రాకూడదని హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి తోడు సినిమా ప్రారంభమైన 10 నిమిషాల తర్వాత ప్రేక్షకులు ఎవరైతే ఫోన్ పట్టుకుంటారో.. ఇక నేను సినీ పరిశ్రమ నుంచే తప్పుకుంటానని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సవాల్ విసరడం ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది. అయితే ఇలాంటి విషయాలు జరగక ముందే ఇప్పుడు మంగళవారం రాత్రి హైదరాబాద్లోనే ఒక థియేటర్లో.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ , మీమర్స్ కి స్పెషల్ షో వేశారు. ఈ స్పెషల్ షో చూసిన వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
సినిమాకి అదే హైలెట్..
స్పెషల్ షో చూసిన తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంది అనే విషయానికి వస్తే.. 2:05 గంటల నిడివి ఉన్న ఈ కిష్కింధపురి సినిమాలో డైరెక్టర్ కౌశిక్ హారర్ ఎలిమెంట్స్ ని చాలా చక్కగా చూపించారని.. అనవసరమైన హంగులకు పోకుండా.. కథను సూటిగా చెప్పాడు అని చెబుతున్నారు. అంతేకాదు సినిమా స్టార్ట్ అయిన మొదటి 30 నిమిషాలు విజువల్స్ బాగున్నాయని, ఇంటర్వెల్ ఎపిసోడ్ దగ్గర వచ్చే ట్విస్ట్ మరింత బాగుందని చెబుతున్నారు. పైగా సినిమాకి ప్రధాన ఆకర్షణ అనుపమ నటనని.. సెకండ్ హాఫ్ లో ఆమె దెయ్యం పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరీ నటించింది అంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ALSO READ:kantara Chapter 1 OTT: భారీ డీల్ కుదుర్చుకున్న కాంతార 2.. ఎన్ని కోట్లో తెలుసా?
చెమటలు పట్టడం గ్యారెంటీ..
సాధారణంగా హర్రర్ మూవీలకు ఇచ్చే సౌండింగ్.. ఈ సినిమాకు మరో బలం అని, అది ఎం.ఆర్ రాధాకృష్ణన్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేశారని చెబుతున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ కి ఈ జోనర్ కొత్త అయినప్పటికీ.. తన పాత్రలో చక్కగా ఒదిగిపోయాడని.. ఫస్ట్ ఆఫ్ కాస్త నెమ్మదిగా సాగినా.. సెకండ్ హాఫ్ లో మాత్రం భయంతో చెమటలు పట్టేస్తాయని చెబుతున్నారు. మొత్తానికైతే ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని.. పూర్తి పాజిటివ్ టాక్ ఇచ్చేస్తున్నారు.
బజ్ కి – టాక్ కి సంబంధం లేదే..
ఇదిలా ఉండగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసినప్పుడు కొంతమంది కొన్ని కొన్ని చిత్రాలతో పోలుస్తూ ఈ సినిమా కాపీ కంటెంట్ అని కూడా నెగిటివ్ కామెంట్లు చేశారు. కానీ ఇప్పుడు స్పెషల్ షో చూసిన వారి నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తుంటే..స్పెషల్ షో ఎఫెక్ట్.. ఉన్న బజ్ కి.. టాక్ కి అసలు సంబంధమే లేదు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.