E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: వేదవతి ఎమోషనల్.. వల్లి ప్లాన్ సక్సెస్.. అమూల్య పై నర్మదకు అనుమానం..

Illu Illalu Pillalu Today Episodes: వేదవతి ఎమోషనల్.. వల్లి ప్లాన్ సక్సెస్.. అమూల్య పై నర్మదకు అనుమానం..
Advertisement

Illu Illalu Pillalu Today Episode September 1st:నువ్వు ఏ తప్పు చేయకపోయినా నువ్వు దొంగతనం చేసావని ఎలా అంటుంది రా అని అక్కడికి సడన్గా వచ్చిన భద్ర తిరుపతి తో అంటుంది. ఇన్నేళ్లు నువ్వు అక్కడ పని చేశావు కదా వాళ్ళు ఇచ్చిన మర్యాద ఇంతేనా.. అసలు నిన్ను అందుకే ఆ కూలోడింట్లో పని చేయొద్దు అని ఎంత మొత్తుకున్నా నువ్వు వినట్లేదు అని భద్ర తిరుపతిని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. మా తమ్ముడికి దొంగతనం చేయాల్సిన అంత కర్మ ఏం పట్టింది ఎందుకు నా తమ్ముడు దొంగతనం చేస్తాడు అని భద్రత తన అనుకున్న ప్లాన్ ప్రకారం రెచ్చిపోతుంది. నిజంగానే తిరుపతి దొంగతనం చేశాడా లేదా అని మాట్లాడకుండా డైరెక్ట్ గా వేదవతిపై అటాక్చే స్తుంది.. నా తమ్ముని దొంగ అనడానికి వాళ్లకి ఎంత ధైర్యం ఉంటుంది. పదవి వెళ్లి అడుగుదామని భద్ర తిరుపతిని తీసుకొని బలవంతంగా బయటికి వెళ్ళిపోతుంది.

అక్కా చెల్లెళ్ల మధ్య చిచ్చు..

బయటికి వెళ్లిన భద్ర ఏ వేదవతి అంటూ కేకలు వేసి పిలుస్తుంది… అయితే వేదవతి వాళ్ళు అక్కడికి వచ్చి నా తమ్ముని నేను దొంగ అని అనలేదు తీసారా అని అడిగాను అంతే అని అంటుంది.. భద్ర వాళ్ళు ఎంత చెప్తున్నా సరే వినకుండా గొడవకు దిగుతుంది.. మా తమ్ముని అవమానించేలా మీరు మాట్లాడారు. నా తమ్ముడు దొంగతనం చేశాడని ఎలా చెప్తున్నారు? నీ కొడుకు కూడా దొంగతనం చేశాడు కదా మరి అది ఆలోచించవా నువ్వు అని భద్ర రచ్చ చేస్తుంది.. కావాలని గొడవ పెట్టేసుకుంటుంది ఇదంతా చూసిన శ్రీవల్లి నిజంగానే తన ప్లాన్ సక్సెస్ అయింది అని సంతోషంగా ఉంటుంది. వేదవతి ఇంటికి తిరుపతి నీ భద్ర దూరం చేసేస్తుంది.. ఇక ఇంట్లోకి వెళ్లిన తర్వాత తిరుపతి దొంగతనం చేశాడని ఎలా అంటారు అని అందరూ అడుగుతూ ఉంటారు.

సాగర్ సీరియస్..

Advertisement

ఇంట్లోకి వెళ్లిన తర్వాత వేదవతి చాలా బాధపడిపోతూ ఉంటుంది. తన తమ్ముడిని దూరం చేసుకున్నాను అని బాధ పడిపోతూ ఉండగా.. ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఎందుకమ్మా నువ్వు మావయ్య దొంగతనం చేశాడు అని అన్నావు.. అసలు నువ్వు ఎలా అంటావ్ ఆ మాట ఇన్ని నెలలో మావయ్య ఏ రోజైనా డబ్బులు తీయడం నువ్వు చూసావా అంటూ అందరూ ఒక్కొక్కరుగా వేదవతిని నిలదీసి అడుగుతారు. కానీ సాగర్ మాత్రం ఏంటమ్మా నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావ్.. ఇన్నేళ్లు నేను రైస్ మిల్లులో పనిచేసినందుకుగాను ఐదు లక్షలు తీసుకున్నాను దానికి ఆయన నన్ను ఇంట్లో దొంగతనం చేసావు అది దీని మాట్లాడాడు. ఆయన కంటే కోపం ఆవేశం ఉంటుంది కాబట్టి అలా మాట్లాడాడు నువ్వు కూడా ఎందుకమ్మా ఆయన లాగా తయారయ్యావు అంటూ సాగర్ సీరియస్ అవుతాడు..

నర్మద పై రామరాజు సీరియస్..

వేదవతి తన తమ్ముడు వెళ్లిపోయాడని బాధ పడిపోతూ ఉండగా నర్మదా ఏంటి అత్తయ్య మీరు కూడా ఇలా చేశారు అసలు ఎందుకు మీరు బాబాయ్ మీద అలాంటి నిందలు వేశారు అని అడుగుతుంది. కానీ వేదవతి మాత్రం మౌనంగా బాధపడిపోతూ ఉంటుంది. ఎందుకు ఇలాంటి పని చేశావు అని అడుగుతూ ఉండగా శ్రీవల్లి మధ్యలో దూరిపోయి ఆవిడ బాధ పడిపోతూ ఉంటే మళ్ళీ మీరెందుకు ఇంకాస్త రెచ్చగొడుతున్నారు అంటూ పొలాలు పెడుతుంది. నువ్వెందుకు మధ్యలో ఊరికి వస్తున్నావు నేను అత్తయ్య గారిని అడుగుతున్నాను కదా అని నర్మదా శ్రీవల్లికి షాక్ ఇస్తుంది. కాని రామరాజు ఆపండి నిజం చెప్పాలనుకున్న ఆవిడే మౌనంగా ఉంది. అంతకుముందు చిన్నోడు విషయంలో అంతే ఇప్పుడు అంతే ఏం జరుగుతుందో చూడాలి అని రామరాజు సీరియస్ అవుతాడు దాంతో నర్మదతో పాటు ఇంట్లోనే వాళ్ళందరూ మౌనంగా ఉంటారు.

భద్ర పై శారదాంబ సీరియస్..

Advertisement

ఇక భద్ర ఇంట్లో వచ్చి కూర్చోగానే శారదాంబ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు భద్ర.. ఒక్కొక్కరిని ఆ ఇంటి నుంచి దూరం చేసి ఇంట్లో తెచ్చుకోవాలని అనుకుంటున్నావా..? మొన్న ప్రేమని తన భర్తకు దూరం చేసి తీసుకొని వచ్చి ఏం సాధించావు. ఇప్పుడు వీడ్ని కూడా తీసుకొచ్చావు అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అనే సీరియస్ అవుతుంది. అయితే నేను ఎవరిని విడగొట్టలేదు అమ్మ ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు అని భద్ర అంటుంది. ప్రేమనివాడు దారుణంగా అవమానించడు అందరిలో తన విషయాన్ని చెప్పి తనని ఇబ్బంది పెట్టాడు. అలాగే వీడిని పాతికేళ్లు పనోడిలాగా వాడుకొని ఇప్పుడు వదిలేస్తాడు.. కనీసం వీడికి పెళ్లి కూడా చేయలేదు కాబట్టి నేను వీడికి పెళ్లి చేస్తాను అని భద్ర లోపలికి వెళ్ళిపోతుంది.

విశ్వం ప్లాన్ సక్సెస్..

ఇక రాత్రి అవగానే అమూల్య పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది.. విశ్వం అక్కడ వెయిట్ చేస్తూ ఉండగా ఏంట్రా బండ సచ్చినోడా..? ఈ టైంలో అర్జెంటుగా మాట్లాడాలి అని ఫోన్ చేసావ్ ఉదయం మాట్లాడుకోవడానికి కుదరదా అని అంటుంది.. మా అన్నయ్య వదినని కలిపే ప్రయత్నం చేయమని చెప్తే నువ్వు ఏం చేస్తున్నావ్ నాకు అర్థం కావడం లేదు అని అమూల్య అంటుంది. అయితే ప్రేమ దురదలు ఇంట్లో నుంచి బయటకు రావడంతో అక్కడున్న అమూల్య విశ్వం ఇద్దరు కలిసి పేపర్ ప్లాన్ చేస్తారు. ఆ ప్లాను వాళ్ళిద్దరూ కలిసిపోవడానికి అన్న కొట్టుకోవడానికే పనికి వచ్చినట్లు ఉంటుంది విశ్వం ప్లాన్ దారుణంగా ఫెయిల్ అవుతుంది. ఇక సాగర్ అర్జెంటుగా వెళ్లాలి మనం బయటికి వెళ్లి పోదామని అంటాడు. సాగర్ ఇద్దరూ కలిసి అర్జెంటుగా బయటకు వెళ్లిపోతారు. నీ ప్లాన్ ఇంత దారుణంగా ఫెయిల్ అవుతాయి నేను అసలు అనుకోలేదు అని అమూల్య అనగానే విశ్వం ఫీల్ అవుతాడు.

అమూల్య పై నర్మద పై అనుమానం..

అమూల్య మెల్లగా ఇంట్లోకి వెళ్ళగానే.. అక్కడే ఉన్నా నర్మదకు దొరికిపోతుంది. అసలు నువ్వెందుకు బయటకెళ్ళి వస్తున్నావు అని అడుగుతుంది నర్మదా.. ఎక్కడికి వెళ్లావు అమూల్య అని అడగగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. నిజంగానే బయటికి వెళ్ళావా అని అడుగుతుంది అవును వదిన.. ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడుతూ బయటే ఉన్నాను అని అబద్ధం చెప్తుంది.. ఇప్పుడు కాదు మధ్యాహ్నం నువ్వు ఎక్కడికి వెళ్లావు అని అడుగుతుంది అమూల్య నేను కాలేజీలోనే ఉన్నాను అని ఎంత చెప్తున్నా సరే.. నర్మద మాత్రం నేను నిన్ను ఐస్ క్రీమ్ పార్లర్ లో చూశాను అని అంటుంది. ఆ మాట వినగానే అమూల్య షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: పార్వతికి పల్లవి వార్నింగ్.. కమల్ కు పల్లవి పై అనుమానం.. అవనికి నిజం తెలుస్తుందా..?

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

Big Stories

Advertisement
×