E-Paper
Advertisement

టిష్యూ పేపర్ ఎంత పని చేసింది? ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్, ఏం జరిగింది?

టిష్యూ పేపర్ ఎంత పని చేసింది? ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్, ఏం జరిగింది?
Advertisement

Air India Flight: ఈ మధ్యకాలంలో విమానాలకు బాంబు బెదిరింపు తీవ్రమవుతున్నాయి. ఎక్కడో దగ్గర ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా సౌదీ అరేబియా నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియాకి చెందిన ఓ విమానానికి బాంబు బెదిరింపు వచ్చాయి. పరిస్థితి గమనించిన పైలట్, వెంటనే అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. అసలు ఏం జరిగింది?

బాంబు బెదిరింపు.. ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

సౌదీ అరేబియాలోని దమ్మామ్ నుండి ఢిల్లీకి వస్తోంది ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం. సోమవారం సాయంత్రం అహ్మదాబాద్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలోని వాష్ రూమ్‌లో సిబ్బంది ఓ టిష్యూ దొరికింది. అందులో బాంబ్ అనే పదం రాసి ఉంది. దాన్ని క్యాబిన్ సిబ్బంది తొలుత గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే వారు పైలట్ల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే విమానాన్ని అహ్మదాబాద్‌కు మళ్లించారు. సోమవారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్‌ అయ్యింది. విమానం ల్యాండ్ కాగానే ప్రయాణికులను వెంటనే దించేశారు.

Advertisement

 

సౌదీ నుంచి ఢిల్లీ విమానం.. టిష్యూ పేపర్ ఎంత పని చేసింది?

అప్పుడు విమానంలో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో సహా భద్రతా సంస్థలు పూర్తిగా తనిఖీ చేశాయి. బాంబు ఆనవాళ్లు లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అందులోని ప్రయాణికులకు టెర్మినల్‌-2లో అప్పటివరకు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని అధికారులు తెలిపారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ యాదవ్ తెలిపారు. విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపులకు పాల్పడింది ఎవరన్న దానిపై దర్యాప్తు ప్రారంభించాయి. విమానంలోని ప్రయాణికులను విచారించారు.

Advertisement

ALSO READ: ఒకప్పుడు జైలు.. ఇప్పుడు లగ్జరీ హోటల్.. ఈ వింత ప్రదేశం ఎక్కడ ఉందంటే?

Related News

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

అజంతా To ఎల్లోరా.. 6 రోజుల క్రేజీ టూర్.. ధర మరీ ఇంత తక్కువా?

జపాన్‌కు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ఢిల్లీ నుంచి ఒసాకాకు నాన్‌స్టాప్ విమానాలు!

సౌదీ అరేబియాకు వెళ్లే భారతీయులకు అలర్ట్.. అక్టోబర్ 24 వరకు ఫ్లైట్స్ క్యాన్సిల్!

ఇండియన్ పాస్‌పోర్ట్ ర్యాంక్ పెరిగింది.. కానీ, వీసా ఫ్రీ దేశాలు తగ్గాయ్!

రైలు ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. ఆఫ్‌లైన్ టిక్కెట్లకూ ఇన్సూరెన్స్.. రూ. 10 లక్షల బీమా కవరేజ్!

విమానాల్లో అగ్ని ప్రమాద ఘటనలు.. పవర్ బ్యాంకులపై DGCA నిషేధం! ఇంకా ఏంటంటే..

Big Stories

Advertisement
×