Mumbai: కాలం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఎండాకాలంలో బస్సుల్లో అగ్నిప్రమాదాలు జరిగేవి. ఇప్పుడు వర్షాకాలంలోనూ బస్సులు తగలబడుతున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా ముంబైలోని ఓ టూరిస్టు బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ప్రయాణికులు, డ్రైవర్ సేఫ్‌గా బయటపడ్డారు. అసలు ఘటన ఎలా జరిగింది?
శుక్రవారం సాయంత్రం ముంబైలోని గోరేగావ్ ఈస్ట్ మెట్రో స్టేషన్ వద్ద టూరిజం బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బస్సు నుండి పొగ దట్టంగా వ్యాపించడం మొదలైంది. కొద్ది సమయానికి వాహనం అంతా మంటలు వ్యాపించాయి. ప్రమాదానికి గురైన బస్సు ముంబై నుంచి గుజరాత్ వెళ్తోంది. ఘటన సమయంలో ఐదుగురు ప్రయాణికులు, డ్రైవర్ క్షేమంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఎలాంటి గాయాలు కానీ ప్రాణనష్టం జరగలేదు.
శుక్రవారం సాయంత్రం ముంబైలోని గోరేగావ్ ఈస్ట్ మెట్రో స్టేషన్ కింద గుజరాత్‌కు MJ 01 AN 1695 నెంబరు గల టూరిజం బస్సులు బయలుదేరింది. ఒబెరాయ్ గార్డెన్ సిటీ మెట్రోస్టేషన్ చెక్నాకా సిగ్నల్ సమీపంలో సాయంత్రం 6.15 గంటలకు బస్సులో మంటలు మొదలయ్యాయి. మహాదేవ్ ట్రావెలర్ కు చెందినది ఈ బస్సు. ఘటన సమయంలో బస్సులో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. అగ్నిప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ నిజర్ కపాడియా వాహనంలో ఉన్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆయన ప్రయాణికులను అలర్ట్ చేశాడు. వారంతా క్షేమంగా బయటపడ్డారు.
ఘటన సమయంలో ఓ వ్యక్తి తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బస్సు కాలిపోతున్న దృశ్యాలు, దట్టమైన పొగ ఆ వీడియోలో కనిపించాయి. ఘటనతో రోడ్డుపై కాసేపు భయాందోళన నెలకొన్నాయి. ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ముంబై అగ్నిమాపక దళం, పోలీసులు, 108 అంబులెన్స్, మెట్రో అధికారుల సిబ్బందిని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సాంకేతిక లోపం కారణంగా అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నప్పటికీ, అధికారులు ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించలేదు. పోలీసులు, అగ్నిమాపక శాఖలు ప్రాథమిక దర్యాప్తును పూర్తి చేసిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ALSO READ: సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!
#BREAKING A tourist bus caught fire under Oberoi Garden City Metro Station, Checknaka, Goregaon (E). MFB, Police, and 108 Ambulance responded. No injuries reported. @MumbaiPolice @mybmc @MMRDAOfficial l#Mumbai #Goregaon #BusFire #NewsUpdate pic.twitter.com/NtgdEla2do
— jarvis ☠️ (@Vishii14) September 4, 2026