E-Paper
Advertisement

కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు.. ఆరు రాష్ట్రాలకు ఏఐసీసీ కొత్త నేతలు, ఏపీకి పివి మోహన్‌

కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు.. ఆరు రాష్ట్రాలకు ఏఐసీసీ కొత్త నేతలు, ఏపీకి పివి మోహన్‌
Advertisement

Delhi: దేశంలో ప్రజలు మారుతున్నారు.. రాజకీయాల్లో అంతే వేగంగా మార్పులు వస్తున్నాయి. ట్రెండ్‌కు తగ్గట్టుగా ఇటీవల బీజేపీ భారీగా మార్పులు చోటుకున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ వంతైంది. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలతో మరికొన్నింటికి కొత్త ఇన్‌ఛార్జులను నియమించింది పార్టీ హైకమాండ్. ఈసారి యువకులకు అవకాశం కల్పించినట్టు పార్టీ పెద్దలు చెబుతున్నారు.

కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు

కాంగ్రెస్ పార్టీలో భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. యువకుల నేతలకు కీలక పగ్గాలు అప్పగిస్తోంది పార్టీ హైకమాండ్. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీసుకున్న ఈ నిర్ణయాలను ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలకు ఏఐసీసీ ఇన్‌ఛార్జులను మార్చింది. ఆంధ్రప్రదేశ్ ఇన్‌చార్జ్‎గా గతంలో ఎంపీ మాణిక్యం ఠాకూర్ ఉండేవారు, ఆయన స్థానంలో కొత్తగా పీవీ మోహన్ నియమితులయ్యారు. మహారాష్ట్ర ఇన్‌చార్జ్‎గా శ్రీవెల్లప్రసాద్‌కు బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్.

ఆరు రాష్ట్రాలకు ఏఐసీసీ కొత్త నేతలు

Advertisement

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్ పార్టీ ఇన్‌ఛార్జ్‌గాసచిన్ పైలట్‌ను నియమించింది. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఘన విజయం సాధించడంలో ఎన్నికల పరిశీలకుడిగా కీలక పాత్ర పోషించారు సచిన్ పైలట్‌. గతంలో భూపేష్ బఘేల్.. పంజాబ్ వ్యవహారాలను చూసేవారు. ఆయన్ని అస్సాంకు మార్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలకు ఏఐసీసీ పుల్ స్టాప్ పెట్టింది. మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ-ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వర్గాల మధ్య తీవ్రమైన అంతర్గత విభేదాలున్న తరుణంలో ఈ మార్పు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

ఏపీకి పివి మోహన్‌, పంజాబ్‌కు సచిన్ పైలట్

కర్ణాటకలో ముఖ్యమంత్రి బాధ్యతలను సిద్ధరామయ్య నుండి డికె శివకుమార్‌కు సజావుగా బదిలీ చేయడంలో కీలక పాత్ర పోషించినందుకు సూర్జేవాలాకు తగిన గుర్తింపు లభించింది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌గా రణదీప్ సూర్జేవాలా బాధ్యతలు అప్పగించింది. దీనికితోడు కర్ణాటక అదనపు బాధ్యతలు చూస్తున్నారు. అస్సాంకు మాజీ సీఎం భూపేష్ బఘేల్, ఛత్తీస్‌గఢ్‎కు సుఖ్‌దేవ్ భగత్‌ను ఏఐసీసీ ఇంచార్జులుగా వ్యవహరిస్తారు. ఆకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల ఇన్‌చార్జులను మార్చడం పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది.

Advertisement

ALSO READ:  డేంజర్ బెల్స్.. నేపాల్ వరదల ఎఫెక్ట్‌కు బీహార్ అతలాకుతలం!

ఇప్పటివరకు గుజరాత్ వ్యవహారాలు చూసిన ముకుల్ వాస్నిక్‌కు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతారు. పదవీ విరమణ చేస్తున్న ప్రధాన కార్యదర్శులకు, ఇన్‌చార్జ్‌లకు కృతజ్ఞతలు తెలిపింది కాంగ్రెస్ నాయకత్వం. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైంది. దీనికి బాధ్యత వహిస్తూ జితేంద్రసింగ్ రాజీనామా చేశారు. మహారాష్ట్ర వ్యవహారాలు చూసిన రమేష్ చెన్నితాల కేరళ హోంమంత్రి అయ్యారు. మణికం ఠాగూర్‌ను తమిళనాడు కొత్త పీసీసీ అధ్యక్షుడిగా నియమించిన విషయం తెల్సిందే.

Related News

డేంజర్ బెల్స్.. నేపాల్ వరదల ఎఫెక్ట్‌కు బీహార్ అతలాకుతలం!

జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ యాసిర్ ఖతం!

లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి, త్రిస్సూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

మంటల్లో టూరిస్టు బస్సు.. ప్రయాణికులు-డ్రైవర్ సేఫ్, ముంబైలో ఘటన

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

Big Stories

Advertisement
×