E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవికి కమల్ స్ట్రాంగ్ వార్నింగ్.. భరత్ ను రెచ్చగొట్టిన రాజేశ్వరి.. కమల్ అరెస్ట్..

Intinti Ramayanam Today Episode: పల్లవికి కమల్ స్ట్రాంగ్ వార్నింగ్.. భరత్ ను రెచ్చగొట్టిన రాజేశ్వరి.. కమల్ అరెస్ట్..
Advertisement

Intinti Ramayanam Today Episode April 29th : రాత్రి వెళ్లి పడుకున్న భరత్ ఉదయం లేవగానే ఎదురుగా కమల్ కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు.. నువ్వేంటి ఇక్కడ ఇంత పొద్దున్నే ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. నా చెల్లెలిని కొడతావా అంటూ తన కోపాన్ని మొత్తం చూపిస్తాడు కమల్.. నా చెల్లెలు మీద చెయ్యి ఎత్తుతావా తన కంట్లో నీళ్లు వస్తేనే మేము తట్టుకోలేము అలాంటిది నువ్వు కొడతావా అంటూ భరత్ ని ఎవరు అడ్డుకున్న సరే వదలకుండా కమల్ దారుణంగా కొట్టేస్తాడు. ఇక చివరికి చక్రధర్ ఆపడంతో కమల్ అక్కడినుంచి వెళ్ళిపోతాడు. కొత్త ఇంట్లోకి వెళ్లినందుకు శ్రీయా చాలా సంతోషంగా ఉంటుంది. కానీ శ్రీకర్ మాత్రం నా అనుకున్న వాళ్లు ఎవరూ లేకుండా చాలా అందంగా ఉంది అంటూ బాధపడిపోతాడు.

కమల్ దెబ్బకు పల్లవి షాక్..

అందరూ కూడా హాల్లో మౌనంగా ఉండడం చూసిన పల్లవి వీళ్ళందరూ ఇలా సైలెంట్ గా ఏదో బాధ పడుతూ ఉంటే నాకు పబ్ లో మాస్ బీట్ వినిపిస్తున్నట్లు ఉంది అని పల్లవి అనుకుంటుంది. వీళ్ళందరూ ఎప్పుడు ఇలాగే ఉంటే నా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అని పల్లవి అనుకుంటుంది.. అప్పుడే ఇంటికి ఆవేశంగా ఉన్న కమల్ వస్తాడు. ఏంట్రా ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్లావు చెప్పకుండానే అక్షయ్ అడుగుతున్న సరే కమల్ మాత్రం నోరు విప్పకుండా ఉంటాడు.. కమల్ చేతికి రక్తం ఉండడంతో పల్లవి ఏదో జరిగినట్లు ఉంది అని అడ్డంగా బుక్ చేస్తుంది.. కమల్ ఏమీ లేదని ఎంత చెప్తున్నా సరే పల్లవి మాత్రం వినకుండా ఉండడంతో కమల్ పల్లవి పై సీరియస్ అవుతాడు. పక్కకు తీసుకొని వెళ్ళిన అవని అత్తయ్య బాధపడుతుంది నువ్వు ఏమీ అనద్దు అని అంటుంది.

పల్లవికి ఫోన్ చేసిన భరత్..

Advertisement

కమల్ తన్ని కొట్టాడని కోపంగా ఉన్న భరత్ పల్లవికి విషయం చెప్పాలని అనుకుంటాడు. నీ మీద కోపంతోనే కొట్టాడు అని పల్లవి ఇంకాస్త భరత్ కి నూరిపోస్తుంది. నువ్వు వాళ్లు నీ మీద చెయ్యి పడనివ్వకుండా ఏదో ఒకటి చేయాలి అప్పుడే వాళ్ళకి బుద్ధి వస్తుంది అని పల్లవి అంటుంది. భరత్ బల్లవి నన్ను కొట్టారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి అని అనుకుంటాడు. మీ అక్క బావల్ని కంట్రోల్లో పెట్టుకో అప్పుడే నువ్వు అనుకున్నది సాధిస్తావు అని పల్లవి చెప్పిన సలహా ప్రకారం భరత్ ఫాలో అవ్వాలి అనుకుంటాడు.. అవని అక్షలకు కొత్త టెన్షన్ పెట్టాలి అంటే కచ్చితంగా భరత్ ని ఇలా రెచ్చగొడుతూ ఉండాలి అని పల్లవి అంటుకుంటుంది.

భరత్ ను చూసి బాధపడ్డ రాజేశ్వరి…

ఉదయం రాజేశ్వరి ఇంటికి మేనేజర్ వస్తాడు. ఏమో సంతకాలు పెట్టాలి అని ఇంటికి వస్తాడు. రాజేశ్వరి ఆ సంతకాలు పెడుతున్న సమయంలో భరత్ డైరెక్ట్ ఇంటికి రావడంతో ఏంటి భరత్ ఆఫీస్ కి వెళ్లకుండా ఇంటికి వచ్చావు అని రాజేశ్వరి అడుగుతుంది. అయినా ఈ దెబ్బలేంటి? ఎవరు కొట్టారు నిన్ను చెప్పు అని రాజేశ్వరి బలవంతం చేసి అడుగుతుంది. ఇక భరత్ ప్రణతిని రాత్రి తాగొచ్చి కొట్టానని కమల్ నన్ను కొట్టాడు అని చెప్పగానే రాజేశ్వరి నా కొడుకుని వాడు కొడతాడు అని రెచ్చిపోతుంది. ఈరోజు కొట్టారు రేపు చంపేస్తారు వీళ్ళకి ఏదో ఒకటి చేస్తే తప్ప ఇంకొకసారి మన జోలికి రారు అని భరత్ ని రెచ్చగొట్టి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేలా చేస్తుంది రాజేశ్వరి.

కమల్ ను అరెస్ట్ చేసిన పోలీసులు..

Advertisement

పల్లవి కమల కోసం కాఫీ తీసుకొని వెళితే వద్దు అని చిరాకు పడతాడు. పల్లవి అత్తయ్యకు చెప్తాను అని చెప్పగానే కమల్ కాఫీ తాగినందుకు ఒప్పుకుంటాడు. ఇక అప్పుడే ఇంట్లోకి పోలీసులు రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. భరత్ ను కమల్ అనే వ్యక్తి కొట్టడంతో అతను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు అని పోలీసులు చెప్పగానే ఏంట్రా నువ్వు భరత్ నీ కొట్టావా అని అందరూ అడుగుతారు. మమ్మల్ని కొడితేనే అన్నయ్య ఏమి పట్టించుకోలేదు చెల్లెలు భర్త అని వదిలేశాడు. ఇప్పుడు ప్రణతిని కొడితే అస్సలు ఆగడు అని అనుకున్నాను నాకు ప్రణతి ఫోన్ చేసి చెప్పగానే ఉదయం లేచి నేనే వెళ్లి ఆ భరత్ నీకు కొట్టాను అని కమల్ నిజం చెప్తాడు. ఇక కమల్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు..

రాజేశ్వరికి పల్లవి వార్నింగ్..

ఆ కుటుంబం మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలి అని రాజేశ్వరి అనుకుంటుంది. ఈ క్రమంలో భారత్ ని రెచ్చగొట్టి వాళ్లకి దూరమయ్యేలా చేయాలి అని అనుకుంటుంది. ఇక పల్లవి కమ్మని పోలీస్ అరెస్ట్ చేశారని రాజేశ్వరి దగ్గరికి బయలుదేరుతుంది. రాజేశ్వరి చాలా సంతోషంగా తనలో తానే నవ్వుకుంటూ కనిపించడంతో భానుమతి ఏమైంది నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని అడుగుతుంది. భర్త వదిలేసి పోయాడు అని బాధపడుతూ కూర్చుంటావు అని అనుకున్నాను. కానీ నువ్వు ఎటువంటి బాధ లేకుండా బాగానే సంతోషంగా ఉన్నావు అని భానుమతి అడుగుతూ ఉండగా పల్లవి అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే అని అంటుంది. నా భర్తను ఎందుకు అరెస్ట్ చేయించావు అని పల్లవి అడుగుతుంది. ఆ మాట వినగానే భానుమతి ఒక్కసారిగా షాక్ అవుతుంది.

భరత్ పై మీనాక్షి సీరియస్..

భరత్ ఆఫీస్ కి వెళ్లకుండా అప్పుడు ఇంటికి రావడంతో మీనాక్షి ఏమైంది రా అని అడుగుతుంది. నేను ఆఫీస్ కి వెళ్ళలేదు పోలీస్ స్టేషన్ వెళ్లాను అని భరత్ అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. ఏంటి నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్లడమేంట్రా ఎందుకు వెళ్లావు అని అడగగానే కమల్ నన్ను కొట్టాడు కదా తన మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను అని అంటాడు. అవని ఆశలు అప్పుడే ఇంట్లోకి ఎంటర్ అవుతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read : ‘గుండెనిండా గుడిగంటలు ‘టీఆర్పీ రేటింగ్.. ఏప్రిల్ లో హైలెట్ ఎపిసోడ్స్..

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×