AP SSC Results-2026: దేశవ్యాప్తంగా విద్యార్థులు పరీక్షా ఫలితాల విడుదల సీజన్ మొదలైంది. తెలంగాణ బుధవారం పదో తరగతి ఫలితాలు వెల్లడికానున్నాయి. దీంతో ఏపీ ఎప్పుడంటూ చర్చించుకోవడం మొదలైంది. ఈ నేపథ్యంలో గురువారం పదో తరగతి ఫలితాలను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఏపీ పదో తరగతి విద్యార్థులకు శుభవార్త
ఏపీలో పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఫలితాలకు సంబంధించి మరొక వార్త. ఏప్రిల్ 30న అనగా గురువారం ఫలితాలు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను ఎక్స్ వేదికగా విడుదల చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఎస్ఎస్సీ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఇక ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు 6.30 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. విద్యార్థులు పరీక్షల ఫలితాలను వెబ్‌సైట్, మన మిత్ర వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్‌తో results.bse.ap.gov.in, https://www.manabadi.co.in/ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. దీనికితోడు మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.
గురువారం ఫలితాలకు విడుదల!విద్యార్థులు పేరు, పుట్టిన తేదీ చెక్ చేసుకోవాలి
ముందుగా bse.ap.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో AP SSC Results 2026 అనే ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. విద్యార్థులు వారి రోల్ నంబర్ నమోదు చేయాలి. సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయగానే విద్యార్థుల మార్కులు, గ్రేడ్లు దర్శమిస్తాయి.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. అదే సమయంలో విద్యార్థులు తమ పేరు, పుట్టిన తేదీ సరిగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. లేదంటే వెంటనే పాఠశాలను సంప్రదించండి. ఈ మధ్యకాలంలో చాలామంది పేరులో తప్పులు పడిన సందర్భాలు ఉన్నాయి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి వాట్సాప్ ద్వారా ఆప్షన్స్ సెలక్ట్ చేసుకోవాలి.
ALSO READ: డిగ్రీ అర్హతతో 1,865 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా వెకెన్సీలు
హాల్ టికెట్ నెంబర్ పంపితే మార్కుల వివరాలు వెంటనే వస్తాయి. మార్కులకు సంబంధించి ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది ఏపీ ప్రభుత్వం. విద్యార్థుల జవాబు పత్రాలు వాల్యూషన్ చేసిన తర్వాత మార్కులను కౌంట్ చేసి పేపర్ రికార్డుల్లో నమోదు చేయనుంది. ఆ తర్వాత ట్యాబ్‌లలో కూడా అప్లోడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.