E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: భానుమతికి దెయ్యం పట్టిందా? కమల్ ప్లాన్ రివర్స్.. అక్షయ్ ప్రణతిని మారుస్తాడా..?

Intinti Ramayanam Today Episode: భానుమతికి దెయ్యం పట్టిందా? కమల్ ప్లాన్ రివర్స్.. అక్షయ్ ప్రణతిని మారుస్తాడా..?
Advertisement

Intinti Ramayanam Today Episode August 5 th: నిన్నటి ఎపిసోడ్ లో..  అవని పాయసం చేసి రాజేంద్రప్రసాద్ దగ్గరికి తీసుకొస్తుంది. భోజనం చేశాక కాఫీలు టీలు వద్దమ్మా అని అడుగుతాడు. అయ్యో మావయ్య ఇది కాఫీ కాదు పాయసం తీసుకోండి అని అంటుంది. ఈ టైంలో పాయసం చేసావ్ ఏంటమ్మా అని రాజేంద్రప్రసాద్ అడుగుతాడు. ఆయన మన మాటకు విలువిచ్చాడు అందుకే ఈ స్వీట్ చేశాను అని అంటుంది. నాకెందుకు అనుమానంగా ఉంది అని రాజేంద్రప్రసాద్ అంటాడు.. అక్షయ్ కి ఇస్తాను అని అనగానే పెళ్లి ఇవ్వమ్మా అని అంటాడు. అక్షయ్ డాక్టరు మెడిసిన్ తో పాటి ఇది కూడా ఇవ్వమని అన్నారా అని అంటాడు. మీరు ప్రణతి భరత్లను సపోర్ట్ చేస్తూ ఇలా మాట్లాడారు కదా నేను సంతోషంతో మీకోసం పాయసం చేసి తీసుకొచ్చాను. మీరు తినండి అని అడుగుతుంది. వీళ్ళందరూ నేను నిజంగానే వీళ్లకు సపోర్ట్ చేస్తున్నానని అనుకుంటున్నారు అని అక్షయ్ ఆలోచిస్తూ ఉంటాడు.

ఇక తర్వాత భానుమతికి కమల్ చుక్కలు చూపిస్తాడు. నువ్వు ప్రణతి పెళ్లికి సపోర్ట్ చేయట్లేదు అందుకే నేను చంపేసి నా దగ్గరికి తీసుకుపోతాను అని బెదిరిస్తాడు. దానికి భానుమతి భయపడుతుంది. నేను ఏదో ఒకటి చేస్తాను లేండి అని భానుమతి కమలాకర్ని బ్రతిమలాడుతుంది. ప్రణతి పెళ్లికి పార్వతిని ఒప్పించు అని అంటాడు. లేకుంటే ఖచ్చితంగా చస్తావు అని బెదిరిస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పార్వతికి తెలియకుండా ప్రణతి భరత్ ల పెళ్లి చేయాలని రాజేంద్రప్రసాద్ అనుకుంటాడు. కానీ అవని మాత్రం  మీరు చేస్తున్న తప్పు మామయ్య అత్తయ్య గారిని ఒప్పించే పెళ్లి చేస్తే బెటర్ అని అంటుంది. రాజేంద్రప్రసాద్ అలా చేయడం కాదు ఇప్పుడు ఇలా చేస్తేనే మీ అత్తయ్య దారికి వస్తుందని అంటాడు. అవని మాత్రం అస్సలు ఒప్పుకోదు. అక్షయ్ గూడ అవనికి సపోర్టుగా మాట్లాడుతాడు. అటు ఉదయం లేవగానే భానుమతి అందరితో ప్రణతి పెళ్లి చేయాల్సిందే అని అంటుంది. ఇంటి పెద్దగా నిర్ణయం తీసుకునే హక్కు నాకుంది. నా నిర్ణయాన్ని ఎవరు కాదనరని నా నమ్మకమని అంటుంది.

కానీ పార్వతి మాత్రం అసలు ఒప్పుకోను అని అంటుంది. అన్నయ్యని ఎవరు కాదనకూడదు అని భానుమతి అంటుంది. పార్వతి మాత్రం నా కూతురు పెళ్లి నా ఇష్టమైన వాడితోనే చేస్తాను అత్తయ్య ఈ దాంట్లో నా నిర్ణయం మార్చుకోను అని చెప్తుంది. కానీ భానుమతి మాత్రం నా నిర్ణయం కాదంటే నేను చచ్చిపోతాను అని అసలు నిజం అని బయట పెట్టేస్తుంది. ఆయన నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు అని అంటుంది. ఏంటి ఎవరు చేశారు ఎవరు చెప్పారు అని ఇంట్లో వాళ్ళందరూ అడుగుతారు.

Advertisement

మన గదిలో ఉన్న కత్తి విషయాన్ని చూపించాలని భానుమతి అక్కడికి వెళుతుంది. కానీ భానుమతి అక్కడ చూపించిన విధంగా కత్తి విషం ఏవి లేవు.. నువ్వు కచ్చితంగా దొరికిపోతావని నేను మార్చేశాను అని కమల్ అనుకుంటాడు.. ఏదో దయ్యం పట్టింది అమ్మమ్మ మిరపకాయలు పోగేస్తే పోతుంది అని పల్లవి మిరపకాయలతో పొగ వేస్తుంది. ఇక అక్షయ్ ప్రణతి తో ఒక విషయం చెప్పాలని అంటాడు.. అయితే ప్రణతి కూడా నేను మీకు ఒక విషయం చెప్పాలి అన్నయ్య అని అంటుంది.

నాకు భరత్ ని పెళ్లి చేసుకోవాలని ఉంది అన్నయ్య నువ్వు ఒప్పుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు నీ పెళ్లి కప్పుకోవడం చాలా సంతోషంగా ఉంది నేను అసలు ఊహించలేదు అన్నయ్య అని అంటుంది. నన్ను బాగా చూసుకుంటుంది నాకు అన్నిట్లో సపోర్ట్ గా ఉంటుందని అనాధాశ్రమంలో పెరుగుతున్న ఒక అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు ఆ అమ్మాయి వల్లే మన కుటుంబం ఇలా ముక్కలైంది అన్న విషయం నీకు తెలిసిందే.. నువ్వు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకో అని అంటాడు.

Also Read : ప్రభావతి పూజలతో రోహిణికి షాక్.. పాపం రోహిణి పరిస్థితి.. బాలు సెటైర్లు..

వదినని నువ్వు అర్థం చేసుకోలేదు అన్నయ్య అపార్థం చేసుకున్నావు అందుకే దూరం పెట్టావు ఇప్పుడు గొడవలు కూడా అందుకే వస్తున్నాయని ప్రణతి అంటుంది. ఇక అవని పార్వతితో ప్రణతి పెళ్లి విషయం గురించి మాట్లాడాలని అనుకుంటుంది. ఆ ఇంటికి వెళ్ళగానే పార్వతి నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకున్న నీతో నేనేంది మాట్లాడేదేని పార్వతి అంటుంది.. ఏం చెప్తుందో వినొచ్చు కదా.. పల్లవి అప్పుడే వచ్చి నువ్వు నీ తమ్ముడి పెళ్లి చేయాలని అనుకుంటున్నావా? నువ్వు ఎవరూ లేరు ఒంటరిగా ఉన్నాను అంటున్నావ్ కదా.. నువ్వు ప్రతిసారి ఇక్కడికి వస్తున్నావు. అది నువ్వు ఆలోచించవా అని పల్లవి అంటుంది. ఎక్కడిదో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×