BigTV English

Jagan-KCR: కేసీఆర్-జగన్‌లకు పొంచివున్న గండం.. ఒకేసారి అరెస్ట్?

Jagan-KCR: కేసీఆర్-జగన్‌లకు పొంచివున్న గండం.. ఒకేసారి అరెస్ట్?

Jagan-KCR: వైసీపీని బీఆర్ఎస్ ఫాలో అవుతుందా? బీఆర్ఎస్‌ని వైసీపీ ఫాలో అవుతుందా? ఈ రెండు పార్టీ నేతలు మాటలు ఒకేలా ఉంటాయని రాజకీయ పార్టీల నేతలు ఎందుకు పదేపదే చెబుతున్నారు? ఇప్పుడు ఇద్దరు అధినేతలకు కష్టాలు తప్పవా? అరెస్టుల భయం వెంటాడుతోందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


గడిచిన పదేళ్లు తెలంగాణను బీఆర్ఎస్ పాలించింది. ఏపీని వైసీపీ ఐదేళ్లు రూలింగ్ చేసింది. పాలనలో అనుభవం లేని కారణంగా వారి వారి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఆ పార్టీ నేతలను వెంటాడుతున్నాయి. ఫలితంగా ఇద్దరు మాజీ సీఎంలకు అరెస్టు కత్తి మెడ మీద వేలాడుతోంది. ఏపీలో జగన్‌కి లిక్కర్ కేసు కాగా, తెలంగాణలో కేసీఆర్‌కు కాళేశ్వరం వ్యవహారం వంతైంది.

ఈ రెండు పార్టీల నేతల ఆలోచనలు ఒకేలా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. లిక్కర్ కేసు ఫేక్ అంటే అంటూ వైసీపీ నేతలు మీడియా ముందుకొచ్చి ఒకటే రీసౌండ్ చేస్తున్నారు. కాళ్వేశ్వరం కమిషన్ నివేదిక విషయంలో బీఆర్ఎస్ అదే పంథాను అనుసరిస్తున్నాయి.


ఈ రెండు అంశాలను ఆయా పార్టీలు రాజకీయ రంగు అంటించి తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి కూడా. పీసీ ఘోష్ కమిషన్.. పక్కా పొలిటికల్ కమిషన్ బీఆర్ఎస్ చెబుతుండగా, అటు వైసీపీ కూడా లిక్కర్ కేసు విషయంలో అదే విధంగా చెబుతోంది.

ALSO READ: సీబీఐ దిగితే  కారు షెడ్డుకే..  డజను మాజీలు, అరడజను ఎమ్మెల్యేలు

ఈ క్రమంలో ఎవరు ముందు అరెస్టు అవుతారనే అనేదానిపై పొలిటికల్ సర్కిల్స్‌లో రకరకాల ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. కేసీఆర్ కంటే ముందు జగన్ ఉంటారని అంటున్నారు. ఎందుకంటే లిక్కర్ కేసు దాదాపు ఫైనల్ స్టేజ్‌కి వచ్చినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాదిలో జగన్ మావయ్య అరెస్టు కావడం ఖాయమని చర్చ లేకపోలేదు.

ఇక కేసీఆర్‌ది అదే పరిస్థితి. ఈ కేసు విచారణ సిట్‌ లేదా సీబీఐకి ఇచ్చినా అధినేతను విచారించి అదుపులోకి తీసుకునేందుకు వచ్చే ఏడాది పట్టవచ్చని అంటున్నారు. అవినీతి మరకలు అట్టకుండా ఉండేందుకు అధినేతలిద్దరు తెరవెనుక తమవంతు ప్రయత్నాలు మొదలుపెట్టేశారు.

బెంగుళూరు వేదికగా వైసీపీ అధినేత జగన్ బీజేపీ పెద్దలతో మాట్టాడే ప్రయత్నం చేశారు. అవేమీ ఫలించక బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ గురించి చెప్పనక్కర్లేదు. మా పార్టీని బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని కవిత స్వయంగా వెల్లడించారు. మంగళవారం కొందరు బీఆర్ఎస్ నేతలు హస్తిన బాటపట్టారు. బీజేపీ పెద్దలతో వారు మాట్లాడే అవకాశముందని అంటున్నారు. మొత్తానికి కాళేశ్వరం వ్యవహారంలో తెర వెనుక ముమ్మరంగా బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.

Related News

Congress: బీసీ రిజర్వేషన్ల కోసం.. హస్తినలో తెలంగాణ కాంగ్రెస్ మహాధర్నా

Weather Alert: బీ అలర్ట్..! తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కుండపోత వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు..

KTR In Delhi: కేటీఆర్ ఢిల్లీ ముచ్చట్లు.. ఆ భేటీ ఉద్దేశమేంటి?

KCR Big Sketch: గువ్వల రిజైన్ వెనుక కేసీఆర్ కొత్త స్కెచ్ ?

Farmers: సొంత భూమి ఉంటే చాలన్నా.. సింపుల్‌గా రూ.50వేలు పొందండిలా..?

Chiranjeevi: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో చిరంజీవి? కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కేటీఆర్

Big Stories

×