BigTV English

Raanjhanaa AI Climax: ధనుష్ కామెంట్స్ పై నిర్మాతలు సీరియస్… మాటమార్చాడు?

Raanjhanaa AI Climax: ధనుష్ కామెంట్స్ పై నిర్మాతలు సీరియస్… మాటమార్చాడు?

Raanjhanaa AI Climax:ధనుష్ (Dhanush) హీరోగా ఆనంద్ ఎల్.రాయ్ (Anand L.Rai) దర్శకత్వంలో 2013లో విడుదలైన రొమాంటిక్ డ్రామా చిత్రం రాంఝనా (Raanjhanaa) .. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది. ముఖ్యంగా యువతను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాను మళ్ళీ ఆగస్టు ఒకటిన ఈ ఏడాది రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే అంతా బాగానే ఉన్నా.. ఈ సినిమా క్లైమాక్స్ ను ఏఐ సహాయంతో మార్చేశారు అని.. బాధతో మిగిలిన సాడ్ ఎండింగ్ ను హ్యాపీ ఎండింగ్ గా మార్చేశారు అని హీరో ధనుష్ అసహనం వ్యక్తం చేశారు.


ఏఐతో క్లైమాక్స్ మార్చడంపై ధనుష్ అసహనం..

ముఖ్యంగా ” ఏఐతో రూపొందించిన క్లైమాక్స్ తో ‘రాంఝనా’ సినిమాను రీ రిలీజ్ చేయడం నన్ను అసహనానికి గురిచేసింది. ఇది సినిమా ఆత్మని కోల్పోయేలా చేసింది. ఏఐ వినియోగానికి నేను అభ్యంతరం వ్యక్తం చేసినా.. సదరు సంబంధిత పార్టీలు మాత్రం ఈ విషయంలో ముందుకు వెళ్లడం నన్ను మరింత బాధకు గురిచేసాయి. 12 సంవత్సరాల క్రితం నేను కమిట్ అయిన సినిమా ఇది కాదు” అంటూ సదరు సంబంధిత నిర్మాణ సంస్థను ప్రస్తావించకుండా ఎక్స్ ద్వారా పోస్ట్ చేశారు ధనుష్. ఇకపోతే ఈ సినిమా క్లైమాక్స్ చూసిన తర్వాత చాలామంది నెటిజన్స్ మాత్రం పాజిటివ్ కామెంట్లు చేశారు. సాడ్ ఎండింగ్ కంటే.. ఏఐ ఉపయోగించి చేసిన ఈ హ్యాపీ ఎండింగ్ చాలా బాగుంది అంటూ కామెంట్లు చేశారు. అయినా సరే ధనుష్ మాత్రం ఇలా ఏఐ టూల్స్ ఉపయోగించి సినిమా క్లైమాక్స్ ను మార్చడం వల్ల అటు కళాకారులకు తీరని నష్టం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.


ధనుష్ వ్యాఖ్యలపై ఇరోస్ ఇంటర్నేషనల్ సంస్థ క్లారిటీ..

అయితే ఇప్పుడు తాజాగా ఏఐ క్లైమాక్స్ విషయంలో ధనుష్ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాణ సంస్థ ఇరోస్ ఇంటర్నేషనల్ సంస్థ స్పందించింది. “ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహాయంతో క్లైమాక్స్ మార్పు గురించి తమ ప్రతినిధి.. ధనుష్ టీంను నేరుగా సంప్రదించిందని, అయితే విడుదలకు ముందు వారు ఎటువంటి అభ్యంతరం తెలపలేదు” అని స్పష్టం చేసింది. అంతేకాదు హీరో మాట మార్చాడు అంటూ ఇండైరెక్టుగా కామెంట్లు చేసింది ఇరోస్ ఇంటర్నేషనల్ సంస్థ. ఇక ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవ్వడంతో ధనుష్ పై కొంతమంది ఫ్యాన్స్ మండిపడుతున్నారు.. అటు నయనతార విషయాన్ని కూడా రంగంలోకి లాగుతూ ధనుష్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు . మొత్తానికైతే ఇప్పుడు ధనుష్ వార్తలను తిప్పికొడుతూ ఇరోస్ ఇంటర్నేషనల్ సంస్థ క్లారిటీ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

రొమాంటిక్ డ్రామాగా రాంఝనా..

రాంఝనా సినిమా విషయానికి వస్తే.. ధనుష్ హీరోగా.. సోనమ్ కపూర్ హీరోయిన్ గా నటించిన చిత్రం ఇది. 2013లో విడుదలైన హిందీ భాష రొమాంటిక్ డ్రామా చిత్రం.. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని.. హిమాన్షు శర్మ రచించారు. ఇరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కృషికా లుల్లా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో అభయ్ డియోల్ , మహమ్మద్ జీషబ్ అయ్యూబ్, స్వరా భాస్కర్ నటించారు. 2013 జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం తమిళ డబ్బింగ్ వెర్షన్ ‘అంబికాపతి’ ఒక వారం తర్వాత విడుదలైంది. ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ (AR Rahman) సంగీతం అందించారు.

also read:NFA -2025: గుట్టుచప్పుడు కాకుండా తీసుకోవడానికి పెన్షన్ కాదు.. నేషనల్ అవార్డు ఇవ్వడంపై సీనియర్ నటి ఫైర్!

Related News

Pushpa Song AGT -2025 : అది పుష్ప సాంగ్ కాదు… అల్లు అర్జున్ పరువు తీశారు కదయ్యా

Megastar Chiranjeevi : ఎమ్మెల్యేగా చిరు పోటీ… స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

Telugu Sequel Movies : ఈ రెండు పార్ట్స్‌ గోలేంటి రాజా… మన దరిద్రం కాకపోతే ?

Balakrishna: మళ్లీ డ్యూయల్ రోల్ లో బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు.. వర్కౌట్ అయ్యేనా?

Big Stories

×