E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతి పూజలతో రోహిణికి షాక్.. పాపం రోహిణి పరిస్థితి.. బాలు సెటైర్లు..

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతి పూజలతో రోహిణికి షాక్.. పాపం రోహిణి పరిస్థితి.. బాలు సెటైర్లు..
Advertisement

Gundeninda GudiGantalu Today episode August 5th: నిన్నటి ఎపిసోడ్ లో.. మనోజ్ దగ్గరకు రోహిణి వస్తుంది. నువ్వు మీ నాన్న ఇచ్చిన 40 లక్షలు ఎవరో అమ్మాయి మోసం చేసి తీసుకెళ్లింది అని అన్నావు కదా.. ఆ అమ్మాయిని పట్టుకుంటే ఆ 40 లక్షలు మళ్ళీ మనకు వస్తాయి కదా అని రోహిణి అంటుంది. ఎప్పుడో ఆమె కెనడాకు వెళ్లిపోయింది ఇప్పుడు ఎలా దొరుకుతాయి అని మనోజ్ అంటాడు. ఏదోక ఏజెన్సీ ద్వారానే ఆమె కెనడాకు వెళ్లి ఉంటది. నువ్వే ఫ్లైట్ టికెట్ బుక్ చేసానన్నావు కదా అక్కడ వెళ్లి ఎంక్వయిరీ చేద్దామని ఇద్దరు అక్కడికి వెళ్తారు. ఆమె అడ్రస్ ని కనుక్కుంటారు. మీనా తనకు వాళ్ళ బాలు బండి కొనిచ్చాడని అందరికీ చెప్పాలని వెళ్తుంది. తన బస్తీకి వెళ్లి వాళ్ళ ఆయన స్కూటీ కొన్న విషయాన్ని అందరికీ చెప్తుంది. జాబ్ పోతే పోయింది స్కూటీ వల్ల మంచి గిరాకీలు వస్తున్నాయి అని మీనా చెప్పడంతో అక్కడివాళ్ళందరూ సంతోషంగా ఫీల్ అవుతారు. స్కూటీ వల్ల ఇలాంటి మంచి జరుగుతుందంటే మంచిదే కదా అని అంటారు.. ఇక వాళ్ళ అమ్మ పదం అయినా ఇంట్లోకి వెళ్దామని అంటుంది. ఇంట్లోకి వెళ్ళగానే శివ అక్కడికి వచ్చి అక్క మీద నాకేం కోపం లేదు బాలు మీదే నాకు కోపం..ప్రభావతి రోహిణితో పూజలు చేయించాలని అనుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానీకోస్తే.. రోహిణి నేను చేయలేనని చెప్పు మనోజ్ మనిద్దరం దూరంగా ఉండటం అంటే నా వల్ల కాదు అని అంటుంది.. కానీ ప్రభావతి మాత్రం ఇంట్లో వాళ్ళందరూ ఖచ్చితంగా రావాల్సిందే అని కండిషన్ పెడుతుంది. సత్యంని, మీనాని అందరినీ రెడీ అవ్వమని చెప్తుంది. శృతి మనము ఇలా చేయడం కరెక్టేనా అని అడుగుతుంది.. ప్రభావతిని శృతి ఇంత కష్టమైన పూజ చేయడం అవసరమా అని అడుగుతుంది. ప్రభావతి మాత్రం ఎంత కష్టమైనా పర్లేదు వాళ్ళ నాన్న కోసమే కదా చేయాల్సిందే అని అంటుంది..

Advertisement

ఇక అందరూ కలిసి గుడికి వెళ్ళాలి అని కూడా రమ్మని చెప్పు అని సత్యం అంటాడు. కల్పనాని ఎయిర్పోర్ట్ నుంచి పిక్ చేసుకున్న బాలు తాను వెళ్లేంతవరకీ తనకి పికప్ అండ్ డ్రాపింగ్ చేసేందుకు ఒప్పుకుంటాడు. మీనా ఫోన్ చేసి అర్జెంటుగా గుడికి రావాలని అడుగుతుంది. బాలు ఆమె పర్మిషన్ తీసుకొని గుడి దగ్గరికి వెళ్తాడు. అందరూ కలిసి గుడికి వెళ్తారు. బాలు కూడా అక్కడికి వచ్చి రోహిణి పూజ చేయడం ఇష్టం గా ఉండాలని..ఇలా ఉండకూడదు అని అంటాడు.

రోహిణిని పూజలు పేరుతో ప్రభావతి కక్ష తీర్చుకున్నట్లు ఉదయం లేవగానే చల్లనీటితో స్నానం చేస్తుంది. ఆ తర్వాత పంతులు దగ్గరకు తీసుకెళ్లి పూజ గురించి చెప్పిస్తుంది. పూజకు అంతా సిద్ధమే. 21 రోజు పాటు కఠినంగా ఇలాంటివి చేస్తేనే ఫలితం ఉంటుంది అని పంతులుగారు అంటారు. ఇక రోహిణి దేవుడి దగ్గరికి తీసుకెళ్లి వినాయకుడి దగ్గర గుంజలు తీయాలని చెప్తుంది. ఇప్పుడు ఇవన్నీ చేయడం అవసరమా అత్తయ్య అని రోహిణి అడుగుతుంటుంది. కానీ ప్రభావతి మాత్రం మీ నాన్న కోసం కచ్చితంగా నువ్వు చేయాల్సిందే అని అంటుంది.

Advertisement

బాలుకు మాత్రం ప్రభావతి ఇలాంటివి చేస్తుందంటే కచ్చితంగా వాళ్ళ నాన్న కోసం కాదు వాళ్ళ నాన్న ఆస్తులు రిలీజ్ అవ్వాలని అని అంటారు. బాలు వచ్చిన తర్వాత సెటైర్ల మీద సెటైర్లు వేస్తూ ప్రభావతిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇక ప్రభావతి రోహిణిని గుంజేలు తీసిన తర్వాత హారతి ఇవ్వాలని అడుగుతుంది. ఏమి హారతి ప్లేట్ ఇవ్వండి ఇస్తానని రోహిణి అంటుంది. ప్రభావతి మాత్రం ప్లేట్లో హారతి కాదమ్మా ఇలా ఇవ్వాలి హారతిని చేతిలో హారతి కర్పూరం వెలిగిస్తుంది. చేతులు కాలాయి ఈవిడ పిచ్చి ఏంటో నాకు అర్థం కావట్లేదని రోహిణి బాధపడుతూ ఉంటుంది.

Also Read: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

ఇక అది అయిపోయిన తర్వాత ప్రదక్షిణాలు చేయాలి అని ప్రభావతి అంటుంది. అంగప్రదక్షిణాలు చేయాలి అనగానే రోహిణి షాక్ అవుతుంది. పాలు మాత్రం మొత్తము సిలిండర్ దొల్లినట్టు డోళ్ళాలి అదే అంగప్రదక్షిణ అని బాలు క్లారిటీగా చెప్తాడు. రోహిణి చేస్తుంటే మనోజ్ కి ఫోన్ వస్తుంది. మనోజు అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతాడు. కల్పన అక్కడ మనోజ్ ని చూసి దాక్కుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Podarillu Today Episode : చక్రిని ఆడుకున్న మహా.. శైలు ఫుల్ హ్యాపీ.. పెద్ది పెళ్లి జరుగుతుందా..?

Illu Illalu Pillalu Today Episodes: రామరాజు మాటతో వేదవతి కన్నీళ్లు.. ధీరజ్ VS ప్రేమ.. శ్రీవల్లి పై అనుమానం..

Intinti Ramayanam Today Episode: శ్రీయ ఎమోషనల్.. మీనాక్షి పై అనుమానం.. కన్నీళ్లు పెట్టించే సీన్..

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. విన్నర్ ఎవరు..?

Monday Movies in Tv : సోమవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హౌస్ లోకి అడుగుపెట్టిన 16 మంది కంటెస్టెంట్స్ వీళ్లే!

గూగుల్ చేస్తే బిగ్ బాస్ నరేష్ అని రావాలి… కప్పు కొట్టే బయటకు వెళ్తా: పొట్టి నరేష్

డిగ్రీలో 5 సబ్జెక్టులు ఫెయిల్.. సింగపూర్ లో హౌస్ కీపింగ్ జాబ్.. . సుధీర్ రెడ్డి స్టోరీ ఇదే!

Big Stories

Advertisement
×