BigTV English

Intinti Ramayanam Today Episode : పార్వతి మనసును చెడగొట్టిన భానుమతి.. అవనిని అడ్డంగా ఇరికించిన పల్లవి..

Intinti Ramayanam Today Episode : పార్వతి మనసును చెడగొట్టిన భానుమతి.. అవనిని అడ్డంగా ఇరికించిన పల్లవి..

Intinti Ramayanam Today Episode December 18th : నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేంద్ర ప్రసాద్ అక్షయ్ ఇవ్వడంతో పార్వతీ బాధపడుతుంది. నేనెప్పుడూ వాడ్ని కొడుకు కాదని అనుకోలేదు మీరు ఆస్తిని వేరుచేసి వాడు నా కొడుకు కాదని గుర్తు చేస్తున్నారని పార్వతి బాధపడుతుంది. రాజేంద్రప్రసాద్ మాత్రం చెప్పిన పార్వతీ వినిపించుకోదు. రాజేంద్రప్రసాద్ తో పార్వతీ గొడవ పడుతుంది. అప్పుడే అవని వచ్చి భోజనం రెడీ అయింది మిమ్మల్ని పిలవడానికి వచ్చానండి అని అంటుంది మేము వస్తాం నువ్వు వెళ్ళు అవని అనేసి పార్వతి అంటుంది.. ఇక కమల్ ఆకలేస్తుందని బయట అరుస్తూ ఉంటాడు. వదిన గురించి ఇంకొకసారి తప్పుగా మాట్లాడాలంటే ఈసారి పాములు తెల్లు నువ్వు కూర్చుని కుర్చీలో ఉంటాయని కమల్ భానుమతితో అంటాడు. అందరూ కలిసి భోజనం చేస్తుంటే పార్వతి మాత్రం భోజనం చేయకుండా కూర్చుంటుంది.. అక్షయ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భానుమతి నువ్వు గాజులు ఇవ్వడం వల్లే పార్వతి అలా బాధ పడుతుందనేసి అంటుంది. రాజేంద్రప్రసాద్ లోపలికి భోజనం తీసుకుని వెళ్తాడు. అక్షయ్ నీ కొడుకు కాదని నా మొదటి భార్య కొడుకు అని అందరికీ తెలిసిపోతుంది తర్వాత వాళ్లలో వాళ్లకే భేదాభిప్రాయాలు వస్తాయి. ఇక అవని అక్షయ దగ్గరికి ఫ్రూట్స్ తీసుకుని వెళుతుంది. అవని పై సీరియస్ అవుతాడు. సోఫాలో కూర్చుని బాధపడుతూ ఉంటే భానుమతి పార్వతి దగ్గరికి వెళుతుంది. ఆస్తిలో సగం వాటాని అక్షయ పేరు మీద రాశారు అనగానే భానుమతి షాక్ అవుతుంది. రాజేంద్రప్రసాద్ సగం ఆస్తి అక్షయ్ కి రాసాడా అనేసి అడుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. భానుమతి పార్వతి మాట్లాడుకుంటూ ఉంటారు. రాజేంద్రప్రసాద్ సగమ ఆస్తిని అక్షయ పేరు మీద రాశాడని పార్వతి భానుమతితో అంటుంది. దానికి పార్వతి అక్షయ్ నా కొడుకు కాదని మీ కొడుకు నాకు ఈ రోజు గుర్తు చేశారు అత్తయ్య నాకు ఎంత బాధగా ఉంటుంది. ఇది రాసినందుకు నాకు బాధ లేదు తన తల్లి ఆస్తి అని నన్ను వేరు చేసి చూడడమే బాధగా ఉంది ఇన్ని రోజులు నేను ఏ రోజైనా అక్షయ్ ని నా కొడుకు కాదని అనుకున్నాను అని పార్వతి బాధపడుతుంది.. అప్పుడే రాజేంద్రప్రసాద్ అక్కడికి వస్తాడు. పార్వతి నువ్వు ఇక్కడ ఉన్నావా పద వెళ్దాం అనేసి అడుగుతాడు. దానికి భానుమతి రాజేంద్ర ప్రసాద్ ను నిలదీస్తుంది. అక్షయ పేరు మీద సగం ఆస్తి రాసావా చెప్పు రాజేంద్ర అని అడుగుతుంది. నేనెందుకు రాశాను నాకు తెలుసు నేను ఒక క్లారిటీతోనే రాసానమ్మ దీని గురించి ఎవరు నన్ను ప్రశ్నించాల్సిన అవసరం లేదు అనేసి రాజన్న ప్రసాద్ అంటాడు. ఇక రాజేంద్రప్రసాద్ వెళ్ళగానే పార్వతీ మనసులో అవనిపై అనుమానం వచ్చేలా భానుమతి మాట్లాడుతుంది. మీ ఆయన ఆ అక్షయ్ పేరు మీద ఆస్తి రాయడానికి కారణం అవనినే అంటుంది.

అవని మంచిగా కనిపించేంత మంచిది కాదు మీ ఆయన మీద ఏదో లేనిపోని డైలాగులు చెప్పి ఆస్తిని తన భర్త పేరు మీద రాసుకోవాలని అనుకుంది. మనసును మార్చేసింది అందుకే రాజేంద్ర ఆస్తి సగం అక్షయ పేరు మీద రాశాడనేసి అంటుంది. ఈరోజు కాకపోయినా ఎప్పుడైనా నీకు బయటపడతాయి అప్పుడు నేను చెప్పింది నిజమే నమ్ముతావు అవని గురించి నిజం తెలుసుకుంటావని భానుమతి పార్వతి మనసులో అనుమానం అనే బీజాన్ని నాటుతుంది. పల్లవి అక్షయ్ సోఫాలో పడుకోవడం చూసి అవని దగ్గరకొచ్చి అడుగుతుంది.. దానికి అవని నీకు మేం గొడవలు పడితే సంతోషంగా ఉంది కదా అనేసి అడుగుతుంది. ఇంత పెద్ద ఇంట్లో గదిలో ఏసీ వేసుకొని పడుకోవాల్సిన బావగారు ఇలా సోఫాలో పడుకోవడం ఏంటి? సోఫాలో పడుకోవడం కాదు మీరు త్వరలోనే పడుకునే రోజు వస్తుందని పల్లవి అవన్నీ తో చాలెంజ్ చేస్తుంది. కోరిక నెరవేరుతుందని పల్లవి అనగానే అవని నీ కోరిక ఎప్పటికీ నెరవేరదు నేను చూసుకుంటాను అనేసి అనగానే అది చూద్దాం నువ్వు చాలెంజ్ చేస్తే నాకు ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది అక్క సరే నేను వెళ్తున్నా అని పల్లవి వెళ్ళిపోతుంది.


పై నుంచి పార్వతి రావడం చూసి అక్క ఈ ఆస్తిని నాకు దక్కనివ్వవా అనేసి నాటకం మొదలు పెడుతుంది. ఈ ఆస్తిలోనికు చిల్లి గవ్వ కూడా రానివ్వను మొత్తం మా ఆయన చేతిలోనే ఉండేలా చేస్తాను అనేసి అవని అంటుంది. ఎప్పుడు డబ్బులు పుట్టి పెరిగాను మరి నువ్వు డబ్బు కోసం ఆశపడుతున్నావ్ నాకు అంత ఆశ లేదు అక్క నువ్వు ఏదంటే అదేను అని వెళ్ళిపోతుంది. ఇక పార్వతి చెప్తే ఏదో అనుకున్నాను అవని మనసులో ఎంత ఉందా అనేసి ఆలోచనలో పడుతుంది. తర్వాత రోజు ఉదయం అవని తులసి కోట దగ్గర పూజ చేయడానికి వెళుతుంది. అత్తయ్య 5 గంటలకే లేసి పూజ చేస్తుంది కదా మరి ఇంకా పూజ చేయలేదు ఏంటి అని పూజ చేస్తుంది. లోపలికి వెళ్లి పార్వతీని పిలుస్తుంది పార్వతి మెలకువగా ఉండి కూడా అవని పిలిచిన పలకదు. గాజులు ఇచ్చినందుకు కోపంగా ఉన్నట్టుంది అత్తయ్య అని మీకు చెప్పకుండా గాజులు ఇచ్చినందుకు నన్ను క్షమించండి అత్తయ్య అనేసి అంటుంది. అయినా పార్వతీ పలకదు బయటకు వచ్చి ప్రసాద్ దగ్గరకొచ్చి అత్తయ్య మాట్లాడట్లేదు మెలకువగా ఉంది మావయ్య అనేసి అడుగుతుంది. అప్పుడే భానుమతి అక్కడికి వచ్చి పెళ్లయిన ఇన్నేళ్లలో నా కోడలు ఎప్పుడు ఇంత సేపు పడుకోవడం చూడలేదు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు దానం చేసుకుంటూ పోతుండు ఇదేదో నీ ఆస్తి రాసిచ్చినట్టు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావని నోటికి వచ్చినట్లు తిడుతుంది. ఇక కమల్ రావడం చూసి భానుమతి నోరు మూసుకుంటుంది. ఇక అందరూ ఎవరి పాటికీ వాళ్ళు వెళ్ళిపోతారు. ఆరాధ్య అవని దగ్గరకొచ్చి నాకు రోజు గుడ్ మార్నింగ్ చిట్టితల్లి అని నానమ్మ లేపి మరి నాకు స్నానం చేయించేది కానీ ఈరోజు నానమ్మ నాకు విష్ చేయలేదు స్నానం చేయించలేదు నేనే స్నానం చేశాను అనేసి అంటుంది. వెరీ గుడ్ అని అవని అంటుంది. నా మీద కోపం ఆరాధ్య మీద చూపిస్తున్నట్టుంది అందుకే ఆరాద్యను పట్టించుకోవట్లేదు అనేసి అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Dhee Bhoomika : ఢీ కంటెస్టెంట్ కి భారీ యాక్సిడెంట్… కారు తుక్కు తుక్కు

Smriti Irani: ఒక్క ఎపిసోడ్ లక్షల్లో రెమ్యూనరేషన్.. ఏమాత్రం తగ్గని మాజీ మంత్రి క్రేజ్!

Bindas Brothers: పేరుకే సెలబ్రిటీలం… సంపాదన మాత్రం నిల్.. బిందాస్ బ్రదర్స్ కన్నీటి కష్టాలు!

Big TV Kissik talks: తట్టుకోలేక సూసైడ్ అటెంమ్ట్ చేశా.. కిస్సిక్ షోలో అమర్‌దీప్ ఎమోషనల్!

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today August 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర విషయంలో ఆరుతో బాధపడ్డ మిస్సమ్మ

Big Stories

×