E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  
Advertisement

Brahmamudi serial today Episode: రాజు తమ ఇంటికి రావాలని ఇంటి ముందు టెంట్‌ వేసుకుని ఇందు ధర్నా చేస్తుంది. ఇందుకు సపోర్టుగా చలపతి, లక్ష్మీ కూడా ధర్నా చేస్తుంటారు. వాళ్లను చూసి రాజు షాక్‌ అవుతాడు. మీరు ఇలా చేస్తే.. మన ఇంటి పరువే పోతుంది.. అంటూ చెప్పినా..? చలపతి, లక్ష్మీ అస్సలు వినరు. రాజు కోపంగా మీకు నాకన్నా తనే ఎక్కువ అయిపోయిందా..? మీరు కొడుకును కదా సపోర్ట్‌ చేయాల్సింది అంటే.. లేదురా మాకు మీరిద్దరూ సమానమే అంటుంది లక్ష్మీ. దీంతో రాజు అమ్మా నువ్వు మీరు ఇలా చేస్తే మన పరువు పోతుందే.. ఇక్కడ చుట్టుపక్కల నా పరువు పోతుంది. అసలు మీరు బాగా ఆలోచించండి మీరు ఇలా చేస్తే మన వెంకీ గాడికి ఎవరు పిల్లను ఇస్తారు..? అంటూ చెప్పగానే..

అలాంటిదేం లేదు నాన్న.. ఇది చూసిన ఎవరైనా వెంకీ గాడికి పిల్లలను ఇవ్వడానికి పోటీ పడతారు. ఎందుకంటే కోడలికి భర్తతో ఏదైనా గొడవ జరిగితే అత్తా మామ కోడలికి సపోర్ట్‌గా ఉంటారని నమ్ముతారు అంటూ చలపతి చెప్పగానే.. రాజు షాక్‌ అవుతాడు. ఇంతలో ఇరుగుపొరుగా వాళ్లు వచ్చి ఇందును రెచ్చగొడుతూ.. రాజు మీద కేసు పెట్టమని రాజుతో విడాకులు తీసుకోమని చెప్తుంటారు.. ఇందు ఇరిటేటింగ్‌ గా ఆంటీ ఏమీ వద్దు అంటీ అంటూ చెప్పినా వినకుండా ఇందును కన్వీన్స్‌ చేయాలని చూస్తారు. రాజు కోపంగా వాళ్లను తిట్టి అక్కడి నుంచి వెళ్లగొడతాడు. వాళ్లందరూ వెళ్లిపోయారు ఇప్పటికైనా ధర్నా ఆపేసి నువ్వు వెళ్లిపో అనగానే.. అసలు వినేది లేదు.. అంటూ ఇందు మొండికేయగానే.. నీ ఇష్టం ఉన్నది చేసుకోవే అంటూ రాజు ఇంట్లోంచి వెళ్లి డోర్‌ వేసుకుంటాడు.

Advertisement

చలపతి, లక్ష్మీ అసలు వీడికి ఇంత మొండితనం ఏంటమ్మా..? ధర్నా చేసినా వాడు రానంటున్నాడు.. అసలు వీడు మారతాడా..? లేదా..? అనగానే.. ఇందు ఎలా మారడో నేను చూస్తాను అంటూ ఇందు చెప్తుంది. అప్పుడే చుట్టుపక్కల ఉన్న మగవాళ్లు వస్తారు. ఏం జరిగింది అంటూ అడుగుతారు. ఇందు ఏడుస్తున్నట్టు నటిస్తూ.. రాజు తనతో కాపురం చేయడానికి తమ ఇంటికి రావడం లేదని చెప్తుంది. వాళ్లంతా రాజును బయటకు పిలిచి తిడతారు. రాజు కోపంగా వాళ్లను తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోమ్మని చెప్పగానే.. వాళ్లు తాము వెళ్లమని.. తమ గ్రూప్‌లో ఈ విషయం గురించి పోస్ట్‌ పెడతామని రాష్ట్ర వ్యాప్తంగా తమ గ్రూపులో లక్ష్మల మంది ఉన్నారని అందరూ ఇక్కడకు వస్తారని చెప్తారు. దీంతో రాజు భయంతో అమ్మో ఇంకా లాగితే వీళ్లు ఏదో చేసేటట్టు ఉన్నారు. ఇక బెట్టు చేయకుండా ఇందుతో వెళ్లడమే బెటర్‌ అని మనసులో అనుకుంటాడు.

ఇంతలో ఆ వ్యక్తి తమ గ్రూప్‌లో వాయిస్‌ మెసేజ్‌ పెడతాడు. ఆ వ్యక్తి వాయిస్‌ మెసేజ్‌ విన్న రాజు భయంతో వెంటనే ఇందుకు తనతో వస్తానని చెప్తాడు, ఇందు సంతోషంగా ఫీలవుతుంది. అక్కడకు వచ్చిన వాళ్లందరికీ థాంక్స్‌ చెప్తుంది. రాజును వెంటనే వెళ్లమని వాళ్లందరూ చెప్పగానే.. రాజు బ్యాగు సర్దుకుని వచ్చి  నసుగుతుంటే.. అందరూ కలిసి కోపంగా ఇంకా లేట్‌ చేస్తావేంటి..? వెళ్లు అనగానే.. కనీసం ఆటో అయినా బుక్ చేసుకోనివ్వండి అని చెప్పగానే.. అప్పుడే వెంకట్‌ ఆటో రెడీ అంటూ ఆటోలో వస్తాడు. రాజు షాక్‌ అవుతాడు. అందరూ కలిసి రాజు, ఇందులను ఆటో ఎక్కించి అత్తగారింటికి సాగనంపుతారు. ఇంతలో ఈరోజు బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Big Stories

Advertisement
×