E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవి పై అవనికి అనుమానం.. ఆధారాలను మాయం చేసిన పల్లవి..తండ్రి కొడుకులు కన్నీళ్లు..

Intinti Ramayanam Today Episode: పల్లవి పై అవనికి అనుమానం.. ఆధారాలను మాయం చేసిన పల్లవి..తండ్రి కొడుకులు కన్నీళ్లు..
Advertisement

Intinti Ramayanam Today Episode February 20th: నిన్నటి ఎపిసోడ్ లో.. అభి స్పృహ లోకి వచ్చారని అవని అక్షయ్ ఇద్దరు కూడా హుటాహుటిన ఆసుపత్రికి బయలుదేరుతారు. అక్కడ కానిస్టేబుల్ అభిని చూసుకుంటూ కనిపిస్తాడు.. అయితే అది నేను అలా చూసి అక్షయవని ఇద్దరు కూడా బాధపడతారు. కోసం నువ్వు హెల్ప్ చేయాలని వచ్చావు కానీ నీకే ఇలా అవుతుందని అసలు ఊహించలేదు అని అక్షయ్ అంటాడు. నువ్వు ఈ యాక్సిడెంట్ ఎలా అయింది రా అని అక్షయ్ అడుగుతాడు.. నేను సీసీటీవీ ఫుటేజ్ చూస్తుండగా నాకు ఒక బెదిరింపు కాలు వచ్చింది. ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు చేశారు అన్నది మాత్రం తెలుసుకోలేకపోయాము.. ఈ కేసుని ఇక్కడితో ఆపేయకపోతే నీ ప్రాణాలు పోతాయని వార్నింగ్ ఇచ్చారు.. కానీ నేను వాటిని లెక్కచేయకుండా మీకు నిజం గురించి చెప్పాలని వచ్చాను. అందుకే నన్ను చంపాలని చూసారు అని అక్షయకి అభి నిజం చెప్తాడు.. ఆ మాట వినగానే అక్షయ అవని ఇద్దరు కూడా షాక్ అవుతారు.. జీ టీవీ ఫుటేజ్ లో ఒక గ్రీన్ సారీ కట్టుకున్న లేడీ అని అభి చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. ఆ విషయాన్ని ఇంట్లో చెప్పి పల్లవికి అవని అక్షయ్ షాక్ ఇస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఆరాధ్య కోసం పాలు తీసుకొచ్చిన అవని ముందు ఈ పాలు తాగు అని ఎంత చెప్తున్నారు సరే ఆరాధ్య ఆగమ్మా నేను మంచి డ్రాయింగ్ వేశాను అని చెప్తుంది. పల్లవి పిన్ని దగ్గర ఉన్న బ్రేస్లైట్ ఇదే అమ్మ. నాకు ఇలాంటిదే కొనిస్తావా అని అడుగుతుంది ఆరాధ్య. పల్లవి దగ్గర ఉన్న బేస్ లైట్ ఇలాంటిదే అయితే ఆ ఎస్ఐ చెప్పిన బ్రేస్లెట్ కూడా ఇలాంటిదే నేమో.. కానీ ఆరాధ్య గీసింది ఆ ఎస్ఐ చెప్పింది కాస్త డిఫరెంట్ గా ఉంది. ఒకసారి పల్లవి దగ్గరికి వెళ్లి ఆ బ్రేస్లెట్ గురించి చూస్తే బాగుంటుంది అని అనుకుంటుంది అవని.. అవని ఆ బ్రేస్లెట్ గురించి పల్లవి రూంలో వెతుకుతూ ఉంటుంది.. ఇప్పుడు అక్కడికి వచ్చిన పల్లవి ఏం వెతుకుతున్నావు అని అడుగుతుంది..

Advertisement

పల్లవికి అనుమానం వస్తుంది అని ఐరన్ బాక్స్ కోసం వెతుకుతున్న అని అబద్ధం చెప్తుంది అవని. ఐరన్ బాక్స్ ఏమైనా తీసుకొచ్చావా ఎక్కడ పెట్టావు అని అవని కావాలని పల్లవిని అడుగుతుంది. నేను తీసుకోలేదు. ఇందాక కోటిలింగం తీసుకున్నాడు అతని దగ్గరకు వెళ్లి అడుగు అని పల్లవి చెప్పడంతో అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నువ్వు నా గురించి తెలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నావని నాకు అర్థమైంది నామీద నీకు అనుమానం వచ్చినట్లు ఉంది. నేను గ్రీన్ సారీ కట్టుకున్నట్లు జువెలరీ పెట్టుకున్నట్లు ఆధారాలు ఉండడం వల్లే కదా నువ్వు నన్ను పట్టుకోడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే నేను వాటిని తగలబెట్టేసాను ఇక నన్ను పట్టుకోవడం అంత సులువు కాదు అని పల్లవి అనుకుంటుంది.

ఈ ఆ తర్వాత అక్షయ శ్రీకర్ కమల్ ముగ్గురు కూడా క్రిమినల్ లాయర్ తో మాట్లాడి మర్డర్ చేయాలనుకునేది ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మీరు ఎంతగా ప్రయత్నాలు చేసినా సరే నా దగ్గర ఆధారాలు లేవు కాబట్టి.. మీకు దొరికే సమస్య లేదు అని పల్లవి అనుకుంటుంది. మీరు ఏం చేసినా ఎలా చేసినా నేను ఈ జన్మలో మీకు దొరకను అని పల్లవి తెగ ఫీల్ అవుతుంది. వాళ్ళందరూ వాళ్ళ తండ్రి కోసం టెన్షన్ పడుతూ ఉంటే అవని అక్కడికి వచ్చి మీరేం చేస్తున్నారు. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారు కదా దాని గురించి మీరు ఆలోచించండి. మావయ్య గారి గురించి నేను చూసుకుంటాను మావయ్య గారిని ఎవరు ఇలా చేయాలనుకున్నారో నేను తెలుసుకుంటాను అని అవని అంటుంది.

Advertisement

మీరు తనంతస్థాయికి రావాలి అని మావయ్య గారు ఎంతో కష్టపడి మీకు బిజినెస్ చేయడానికి సలహా ఇచ్చారు. ఆయన మీరు పైకొస్తే చూసి సంతోష పడతారు. ముందు మీరు బిజినెస్ గురించి ఫోకస్ చేయండి మావయ్య గారి గురించి నేను చూసుకుంటాను అని అవని మాట ఇవ్వడంతో అందరూ కూడా అలాగే అని చెప్తారు. తర్వాత రోజు ఉదయం కోటిలింగం తన రీల్స్ కోసం ఫోటోలకు ఫోజులిస్తూ ఉంటాడు.. అయితే అతని ఫోటోలను చూసి భానుమతి అలాగే పార్వతి నవ్వుకుంటారు. తింగర వేషాలు ఏంట్రా ఇలా ఉన్నాయి అని భానుమతి తనలో తానే మాట్లాడుకుంటుంది.. ఏంటి వీడు పిచ్చి చేష్టలు అర్థం కావడం లేదు అని పార్వతితో అంటుంది..

పోనీలే అత్తయ్య మంచివాడే కానీ అమాయకుడు అని పార్వతి అంటుంది.. అయితే భానుమతిని చూసిన కోటిలింగం ముసలిదానితో ఫోటో అంటూ అనడంతో.. ఏంట్రా నేను నీకు ముసలి దానిలా కనిపిస్తున్నానా.. బామ్మ అని మర్యాదగా పిలవడం రాదా అని కోటిలింగం ని భానుమతి కొడుతుంది. ఆ తర్వాత ముగ్గురు అన్నదమ్ములు అక్కడికొచ్చి నాన్న మేము ఇవాల్టి నుంచి బిజినెస్ చూసుకోవాలని అనుకుంటున్నాము. మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి అని అడుగుతారు.. ఇప్పుడు నాన్న ఈ పరిస్థితుల్లో ఉన్నాడు అని అక్షయ్ చాలా బాధపడిపోతూ ఉంటాడు. అది చూసిన కమల్ ఏంటి అన్నయ్య నువ్వు ఇలా బాధపడిపోతున్నావు నాన్న ఆశీర్వాదం కావాలి అంతే కదా ఇదిగో నాన్న ఆశీర్వదిస్తాడు అని అంటాడు..

Also Read : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ నర్మద ఆస్తులు.. ఒక్కో సీరియల్ కు రెమ్యూనరేషన్..?

ఆ తర్వాత వీళ్ళ ముగ్గురు బయటికి వెళ్లడం చూసిన మిగతా వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు.. శ్రేయ కూడా మొదట సంతోషంగా ఉన్నా సరే పల్లవి వచ్చి తన సంతోషానికి చిచ్చుపెట్టేస్తుంది.. నా మొగుడు అంటే వినడు కనీసం నీ మొగుడిని అయినా నీ మాట వినిలా కంట్రోల్లో పెట్టుకోవచ్చు కదా.. అక్షయ్ బావ నీ మొగుడిని నా మొగుడిని కుడి భుజం ఎడమ భుజం లాగా చేసుకున్నాడు.. అక్కడ బిజినెస్ లో మనకు వచ్చే లాభాలు ఏమీ లేవు.. నువ్వు ఇలా నోరు మూసుకొని ఉంటే ఎలా అని శ్రేయాని పల్లవి రెచ్చగొడుతుంది.. వాళ్లు ముగ్గురు వెళ్తుంటే శ్రేయ మీరు ఆగండి అని శ్రీకర్ని ఆపుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో పల్లవి బండారం బయటపడుతుందేమో చూడాలి..

 

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×