MP DK Aruna: కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ 9 సార్లు పోటీచేసి ఏడుసార్లు ఓడిపోయారని, కేవలం రెండుసార్లు మాత్రమే గెలిచిన నేత ఇప్పుడు ఎమ్మెల్యే ఇంటిపై దాడికి పురమాయించడంపై పాలమూరు ఎంపీ డీకే అరుణ(DK Aruna) విమర్శించారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డిని ఆమె పరామర్శించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని పని చేస్తున్న ఎమ్మెల్యేని అడుగడుగునా ప్రభుత్వం అడ్డుకుంటోందని మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్(KCR), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని ఓడించి వెంకటరమణారెడ్డి జాయింట్ కిల్లర్ గా ప్రజల ఆశీర్వాదంతో గెలిచారన్నారు. అలాంటి వ్యక్తిపై కక్ష కట్టి అధికార పార్టీ అనేక రకాలుగా అణిచివేసే ప్రయత్నాలు చేస్రతోందని ఫైరయ్యారు.
అభివృద్ధి, అధికారిక కార్యక్రమాల్లో భాగస్వాములను చేయకుండా ఎమ్మెల్యేకి ప్రోటోకాల్, కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదన్నారు. మంత్రులు తమంతట తాము అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని వెళ్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు తమవే అని గొప్పలు చెబుతున్నారని చురకలంటించారు. అడుగడుగునా అణిచివేసే విధంగా ఎమ్మెల్యేపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కుట్రలు పన్నుతున్నారని డీకే అరుణ ఫైరయ్యారు. ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేయించి లేనిపోని అబద్ధపు ఆరోపణలు చేస్తూ బురదజల్లే కుతంత్రం పన్నుతున్నారన్నారు. కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణల్లో వాస్తవమే ఉంటే చర్చకు రావాలని ఎమ్మెల్యే కాటిపల్లి సవాల్ చేశారని, ఆరోపణలు చేస్తున్న నాయకుడు అధికారంలో ఉన్నారని, వాటిని నిరూపించడానికి ఎందుకు భయపడుతున్నారని డీకే అరుణ ప్రశ్నించారు.
Also Read: Sree Vishnu: చిరంజీవికి ఫ్యాన్ కానీ వారెవరు? అంటూనే జర్నలిస్ట్‌కి శ్రీ విష్ణు ఝలక్!
అధికారంలో ఉంటే ఎన్ని ఆరోపణలు అయినా చేయొచ్చనే భ్రమలో ఉన్నారని, తప్పుడు ఆరోపణలు చేయడం గొప్ప కాదని, ఆరోపణల్లో నిజం ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు. ఆరోపణలు నిరూపించకపోతే తప్పుడు ఆరోపణలు చేశామని ఒప్పుకుని, ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అహంకార ధోరణితో తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునే వారు బీజేపీలో ఎవరూ లేరని డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు. ఆరోపణలు నిరూపించే దమ్ముంటే కామారెడ్డి చౌరస్తాకు వస్తారా, సీఎం కార్యాలయానికి వస్తారో రావాలని అరుణ సవాల్ విసిరారు. బాన్సువాడ ఘటన ఎవరూ సహించరానిదని, ఈ ఘటన వెనుక ఎవరు ఉండి ప్రేరేపిస్తున్నారో వారే బాధ్యత వహించాలని స్పష్టంచేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని డీకే అరుణ స్పష్టంచేశారు.
Also Read: Gundeninda Gudigantalu : ‘గుండెనిండా గుడిగంటలు ‘ యాక్టర్స్ ఏజ్.. మీనా వయసు ఎంతంటే..?