E-Paper
Advertisement

Podarillu Today Episode : మహాను అర్థం చేసుకున్న మాధవ్.. తాయారు శాపం నిజమైందా..?చివరిలో ట్విస్ట్..

Podarillu Today Episode : మహాను అర్థం చేసుకున్న మాధవ్.. తాయారు శాపం నిజమైందా..?చివరిలో ట్విస్ట్..
Advertisement

Podarillu Today Episode February 6th: నిన్నటి ఎపిసోడ్ లో..  బయట ఫోన్లో ఒక మెసేజ్ రావడం అందరూ చూస్తారు. వార్తల్లో చక్రి మహాల పెళ్లి గురించి చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. మా చక్రి చాలా ధైర్యం చేసి ఈ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటికైనా అర్థమైందా వాళ్ళిద్దరికీ పెళ్లి అయింది అని అంటూ కేశవ అంటాడు.. ఇక చక్రి మహాతో నేను మాట్లాడతాను అని లోపలికి వెళ్తాడు. మహాలక్ష్మి మాత్రం మీరు ఇంకా నిజం చెప్పలేదు కదా.. నాకు అర్థం అయిపోయింది నేనే ఈ విషయాన్ని అందరికీ చెప్పేస్తాను అని బయటకు వస్తుంది.. కానీ చక్రి మాత్రం మీరు ఏమి మాట్లాడకండి మా ఇంట్లో వాళ్ళు ఈ విషయం తెలిస్తే తట్టుకోలేరు అని ఆపుతాడు..

మహాను ఎలాగైనా కన్వెజ్ చేయాలని చక్రి అనుకుంటాడు.. అయితే బయటికి రాగానే మాధవ్ మళ్ళీ ఏమైంది రా ఎందుకు అమ్మాయి రెడీ అవ్వలేదు అని అడుగుతాడు. తను బాధపడుతుంది అన్నయ్య నేను ఎంత చెప్పినా కూడా వినడం లేదు అని చక్రి అంటాడు.. మహా మాత్రం ఈ విషయం ఎలాగైనా చెప్పి వాళ్ళు బాధపడిన సరే నిజం చెప్పాలని అనుకుంటుంది.. ఒకవైపు మాధవ్ వీళ్ళిద్దరి ఫంక్షన్ జరుగుతుందా లేదా అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శ్రీ మహా మాట్లాడుకుంటూ ఉంటే మాధవ్ లోపలికి వెళ్తాడు. ఏంటి మీరిద్దరు గొడవ పడుతున్నారు ఇంకా రెడీ అవ్వకుండానే అంటాడు.. అయితే చక్రి ఒకవైపు మాట్లాడుతూ ఉండగా నేను తీసుకొని వస్తానన్న మీరు వెళ్ళండి అని ఎంతగా చెప్తున్నా సరే మాధవ్ మాత్రం ఏంటి మా సమస్య ఏమైంది చెప్పు అని అంటాడు.. మా ఇంటికి ఒక శాపం ఉంది. మా ఇంట్లో ఏ ఆడపిల్ల అడుగుపెట్టదు అని అందరూ అంటున్నారు.. చక్రి పెళ్లి చేసుకుని రావడంతో ఆ శాపం పోయిందని మేము చాలా సంతోషంగా ఉన్నాము.. ఒకవైపు అందరూ అంటున్న సరే నేను పెళ్లి సంబంధాలు చూడడానికి వెళుతున్నాను కానీ ఏ ఒక్కటి కూడా సెట్ అవ్వడం లేదు..

అలా ఇప్పటికే చాలా సంబంధాలు చూశాను కానీ ఎక్కడో ఒకచోట ఏదో ఒక సంబంధం ఫిక్స్ అవుతుందని అనుకుంటున్నాను అని మాధవ్ అంటాడు.. మీరు మాకు చాలా చేశారు మా నాన్నతో సమానంగా మిమ్మల్ని నేను ఆరాధిస్తున్నాను.. రాత్రి మీ ఇంట్లో ఉంటే మీరు నాకు చాలానే చేశారు. మా ఇంట్లో వాళ్ళు ఇంట్లోంచి మమ్మల్ని గెంటేస్తే మీరు మాత్రం ఇంట్లోకి రానిచ్చి మమ్మల్ని చాలా గొప్పగా చూసుకున్నారు.. మీలాంటి మంచి వ్యక్తికి అబద్ధం చెప్పడం తప్పు అని మహా అంటుంది. ఏమైందమ్మా అంటే మీకు ఒక నిజం చెప్పాలని అనుకుంటున్నాను అని మహా అంటుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావ్ అని అంటాడు..

Advertisement

మీరు అనుకుంటున్నట్టు మేము నిజం పెళ్లి చేసుకోలేదు తప్పని పరిస్థితుల్లో అలా పెళ్లి జరిగిపోయింది అని మహా జరిగిన విషయాన్ని మాధవతో చెప్తుంది. ఇంట్లో వాళ్ళు ఏం చేశారు అన్న విషయాన్ని చెప్పడంతో మాధవ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నారు అని అనడంతో మాధవ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇక్కడ ఏం జరిగింది అన్నది మ్యాటర్ కాదు ఎలా జరిగింది అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ అని మహా అనడంతో మాధవ్ మాకు ఈ శాపం గురించి తెలుసమ్మా మా పరిస్థితి ఇంతే అని మేము సరిపెట్టుకుంటాము బయట ఫంక్షన్ గురించి నేను చూసుకుంటాను.. భయపడకు అని మాధవ్ అంటాడు.

మాధవ్ కి మహా క్షమాపణ చెప్తుంది. నువ్వేమీ తప్పు చేయలేదు కదా ఎందుకు ఇన్నిసార్లు క్షమాపణ చెప్తావ్ అదంతా నేను చూసుకుంటాను నిన్ను బాగా ఇబ్బంది పెట్టి ఉంటే మమ్మల్ని క్షమించు అని మాట అంటాడు. చక్రి మాత్రమే బయటికి రావడంతో అందరూ ఒక్కసారిగా ఏమైంది పెళ్ళికొడుకు మాత్రమే వస్తున్నారు అమ్మాయి రావడం లేదు అని అనుకుంటారు. మీకోసం నేను భోజనాలు ఏర్పాటు చేశాను ముందు భోజనం చేయండి అనగానే ఏంటి ఇప్పుడు ఫంక్షన్ లేదా భోజనాలు తినమని అంటున్నారు అని అందరూ ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ ఫంక్షన్ గురించి మాట్లాడు పోతుంటే మహా పెద్ది అని పిలుస్తుంది కాస్త ఆలస్యమైంది క్షమించండి అని అడుగుతుంది.

Also Read : నిజం తెలుసుకున్న ప్రభావతి.. రోహిణికి మీనా స్ట్రాంగ్ కౌంటర్.. రోహిణి కొత్త కష్టాలు..

మహా స్టేజ్ మీదకు రావడంతో అక్కడున్న వాళ్ళందరూ సంతోషంగా మహనీయులు పిలుస్తారు మహా మమ్మల్ని అర్థం చేసుకుంది అని మాధవ్ కూడా చాలా సంతోషంగా ఉంటాడు అక్కడున్న వారిలో ఒక ఆవిడ చక్రి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి తయారు శాపానికి పవర్ పోయిందనుకుంటాను అని అనడంతో తయారు సీరియస్ అవుతుంది . అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×