E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ వర్కౌట్.. భానుమతి కోరిక నెరవేరుతుందా..? శ్రీయకు మైండ్ బ్లాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ వర్కౌట్.. భానుమతి కోరిక నెరవేరుతుందా..? శ్రీయకు మైండ్ బ్లాక్..
Advertisement

Intinti Ramayanam Today Episode January 12th : నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ తమ్ముళ్లతో కలిసి బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటాడు.. ఈ విషయం తమ్ముళ్లతో చెప్తాడు.. అక్షయ్ తీసుకున్న నిర్ణయానికి రాజేంద్రప్రసాద్ చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు.. శ్రీయ తల్లి కాబోతున్న సందర్భంగా చాలా సంతోషంగా ఇంట్లోని వాళ్ళందరూ ఉంటారు. అవని దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసుకోవాలని పల్లవి శతవిధాలా ప్రయత్నిస్తుంది.. పార్వతి భానుమతి కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా శ్రీయ నీరసంగా ఉంది అని వస్తుంది.. శ్రీయాకు దగ్గరుండి మరి సేవలు చేస్తారు.. శ్రేయ కి ఏమడిగితే అది అన్ని దగ్గరుండి తీసుకొచ్చి ఇస్తారు.. నాకు ఆకలేస్తుంది ఏదైనా తినాలనిపిస్తుంది అని పులిహార కావాలని అడుగుతుంది.. శ్రీయాకు సేవలు చేయడం చూసిన పల్లవి కుళ్ళుకుంటుంది.. ఎలాగైనా సరే దీని కడుపు పోతే బాగుంటుంది అని అనుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నేను తల్లవ్వాలి అనుకున్నాను.. కానీ అది నాకన్నా ముందు తల్లి అయింది. దానికి సేవలు చేస్తుంటే నా కడుపు రగిలిపోతుంది.. ఏదైనా చేసి నేను ప్రెగ్నెంట్ అవ్వాలి లేదంటే నన్ను బానిసలాగా చూస్తారు.. నాకు చాలా గిల్టీగా ఉంది అని పల్లవి బాధ పడుతూ ఉంటుంది. ఇక శ్రేయ ఈ శ్రీకర్ ఎక్కడికి వెళ్ళాడు ఏంటో తెలియట్లేదు కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అని టెన్షన్ పడిపోతూ శ్రీకర్ కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఏంటి ఎక్కడికి వెళ్ళాడు కనీసం ఫోన్ అయినా చేసి చెప్తే నేను టెన్షన్ పడకుండా ఉంటాను కదా అనేసి శ్రియ అనుకుంటుంది..

Advertisement

అప్పుడే వెనకాల నుంచి వచ్చిన శ్రీకర్ శ్రీయాని హగ్ చేసుకుంటాడు. ఏంటి ఎక్కడికి వెళ్లావు. ఎక్కడికి వెళ్లావు కనీసం చెప్తే నేను టెన్షన్ పడకుండా ఉంటాను కదా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావ్ శ్రీకర్ అనేసి శ్రీయ అంటుంది. నీకు ఒక ముఖ్యమైన విషయం చెబుదామని అనుకున్నాను అయితే ఫోన్ లో ఆ విషయం చెప్తే గుడ్ న్యూస్ ఎలా అవుతుంది? నేను చెప్పిన తర్వాత నీ ఫేస్ లో చూసే ఫీలింగ్స్ నాకు చాలా సంతోషాన్ని స్థాయి అందుకే నీకు ఈ గుడ్ న్యూస్ ని నేరుగా షేర్ చేసుకోవాలి అనుకున్నాను అని శ్రీకర్ అంటాడు. ఏంటా గుడ్ న్యూస్ అని శ్రేయ అడుగుతుంది.. నేను అక్షయ అన్నయ్య కలిసి ఒక బిజినెస్ ని మొదలు పెట్టబోతున్నాము.. ఆ బిజినెస్ ఏంటి అనేది నీకు తెలిస్తే షాక్ అవుతావు అని అంటాడు శ్రీకర్.

అది కన్స్ట్రక్షన్ బిజినెస్.. అన్నయ్య కి ఇందులో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అన్నయ్య మా ఇద్దరితో కలిసి బిజినెస్ చేయాలని అనుకుంటున్నాడు అని శ్రీకర్ చెప్పగానే శ్రీయా షాక్ అవుతుంది.. నీకు కొంచెం కూడా బుర్ర లేదా మీ అన్నయ్య కావాలని నిన్ను లాక్ చేసేసాడు.. ఇంట్లోంచి వెళ్లిపోవాలని అనుకున్నాం కదా అలా వెళ్ళిపోకుండా నేను ఇక్కడే ఉండేలా చేస్తున్నాడని శ్రేయ అంటుంది. ఆ తర్వాత పల్లవి దగ్గరికి కమల్ వస్తాడు.. నీకు గుడ్ న్యూస్ ని చెప్పడానికే ఇక్కడికి వచ్చాను.. ఒక స్వీట్ తీసుకుని ఆ న్యూస్ ఏంటో తెలుసుకొ అని కమల్ అంటాడు..

Advertisement

అన్నయ్యతో కలిసి మేము బిజినెస్ చేయబోతున్నాము నువ్వు ఇకమీదట నుంచి నీ భర్త ఏం చేస్తున్నాడని ఎవరైనా అడిగితే బిజినెస్ మాన్ అని చెప్పుకొని అంటాడు.. ఇంకా పల్లవికి స్వీట్ తినిపించి పాలు తాగిస్తాడు ఇలా చేయడం వల్ల మూడ్ వస్తుంది అని కమలంటాడు.. ఇద్దరు కలిసి ఆ రాత్రిని సరదాగా గడుపుతారు. ఇక తర్వాత ఉదయం లేవగానే శ్రీయ కి అందరూ సేవలు చేయడం చూసినా పల్లవి కుళ్ళుకుంటుంది. శ్రియకి ఇచ్చిన బాదంపాలను భానుమతి పల్లవికిస్తుంది కానీ పల్లవి నీకు ఎలా కనిపిస్తున్నాను అని అరుస్తుంది.

Also Read :రోహిణిని బుక్ చేసిన మీనా.. ప్రభావతి సీరియస్..మనోజ్, రోహిణి మధ్య చిచ్చు..

ఆ తర్వాత శ్రియా కి సాంబ్రాణి వేస్తుంటే పల్లవి కి వాంతి వచ్చినట్లు ఉందని వెళ్లి వాంతి చేసుకుంటుంది.. అయితే ఏంటే తల్లి కాబోతున్నావా అని భానుమతి అడుగుతుంది.. అవును నిన్ను తల్లి కాబోతున్నానని చెప్పగానే ఇంట్లోని వాళ్ళందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు.. కమల్ సంగటి అయితే చెప్పనక్కర్లేదు పల్లవి నెత్తుకుని గిరగిర తిప్పి తన సంతోషాన్ని అందరికీ చూపిస్తాడు.. సూత్రధారులు పల్లవి గుడ్ న్యూస్ చెప్పిందని ఇంట్లోని వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

 

Related News

Saturday Movies in Tv : శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. డోంట్ మిస్..

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Big Stories

Advertisement
×