BigTV English

Intinti Ramayanam Today Episode: పార్వతి మనసు విరగొట్టిన పల్లవి.. అవనిని ఘోరంగా అవమానించిన అక్షయ్..

Intinti Ramayanam Today Episode: పార్వతి మనసు విరగొట్టిన పల్లవి.. అవనిని ఘోరంగా అవమానించిన అక్షయ్..

Intinti Ramayanam Today Episode june 22nd: నిన్నటి ఎపిసోడ్ లో.. ఉదయం లేవగానే ఆరాధ్య కనిపించకపోవడంతో అవని వెతుక్కుంటూ ఉంటుంది. అందర్నీ కంగారుపడుతూ అవని అడుగుతుంది. ఆరాధ్య ఎక్కడికో వెళ్లిపోయింది కనిపించలేదు అని ఇందంతా వెతుకుతారు. బయట ఉన్న రాజేంద్రప్రసాద్ ని అవని ఆరాధ్య గురించి అడుగుతుంది.. అయితే ఎక్కడికి వెళ్ళిందో వెతుకుదాం పదండి అని అందరూ టెన్షన్ పడుతుంటారు. అప్పుడే అక్షయ్ ఈ ఆరాధ్యని తీసుకురావడం చూసి ఆరాధ్య నీ దగ్గరికి ఎలా వచ్చింది అని రాజేంద్రప్రసాద్ అడుగుతాడు. ఏమో నాకు తెలియదు నాన్న పొద్దున్నే చూసేలాగా నామీద పడుకుని ఉంది అని అక్షయ్ అంటాడు. అక్షయ్ మొత్తానికి ఆరాధ్యుని తీసుకుని వెళ్లి అవనికి అప్పగిస్తాడు. ఇక పల్లవి కొత్త ఇల్లు చూశానని అక్షయ దగ్గరకొస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. అవని కి పార్వతి వలనే దూరంగా ఉంచాలని లేకుంటే అక్షయ అవన్నీ కలిసిపోతారని పల్లవి మాస్టర్ ప్లాన్ వేసి ఒక ఇంటిని చూస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు ఉదయం పల్లవి వచ్చి కొత్త ఇల్లు దొరికింది వెళ్దాం అంటే అక్షయ్ నేను రాను అని అంటాడు. అవని అంటే నాకు కూడా కోపం అమ్మ నేను అవనితో కలుస్తానని మీరు అస్సలు అనుకోకండి.. నాకు నా కూతురు ఇప్పుడిప్పుడే దగ్గరవుతుంది. నా కూతుర్ని వదిలిపెట్టి నేను ఎలా వస్తానని అనుకుంటున్నావు అని అడుగుతాడు. భానుమతి వాడి కూతురు అంటే ఎంత ప్రాణమో తెలుసు కదా? వాడు కూతుర్ని వదిలిపెట్టి ఎలా వస్తాడు పల్లవి అని భానుమతి అంటుంది. వీళ్లు రివర్స్లో షాక్ ఇస్తారని అస్సలు ఊహించలేదు.. అయితే అవని స్కూల్ కి మీ నాన్నతో వెళ్ళు అని ఆరాధ్యను పంపిస్తుంది.

అక్కడే ఉన్న పల్లవి చూశారా అత్తయ్య అవని ఎలా కూతురిని అడ్డుపెట్టుకొని బావగారిని తన వైపు తిప్పుకునేలా ప్రయత్నాలు చేస్తుంది అని పుల్లలు పెడుతుంది. అక్షయ్ ని పిలుస్తారు.. ఏంటి ఆరాధ్య ఎలా వచ్చావు అంటే నువ్వు స్కూల్ కి తీసుకెళ్లాలి కదా నాన్న వెళ్దాం పద నడుచుకుంటూ వెళ్ళిపోదామని ఆరాధ్య అంటుంది. మీకు పని పాట లేదు కారు లేదని కూడా తెలిసి ఆరాధ్యను పంపించిందంటే అవని అక్క మిమ్మల్ని ఎగతాళి చేస్తుందని అర్థమవుతుంది బావగారు అని అంటుంది.


మీరు ఏ పని చేయకుండా ఖాళీగా ఉన్నారని అవని ఇలా ఇండైరెక్టుగా మిమ్మల్ని గుచ్చి చంపాలని అనుకుంటుంది. అందుకే మీరు ఖాళీగా ఉన్నారు కదా స్కూల్లో వదిలిపెడతారని మీ దగ్గరికి పంపించింది అని పల్లవి అంటుంది. పల్లవి ఆ మాట అనగానే అక్షయ్ సీరియస్ అవుతాడు. వెంటనే ఆరాధ్యని తీసుకొని అవని దగ్గరికి వెళ్తాడు. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను పనీపాటా లేకుండా ఖాళీగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావా.. రోజు నువ్వే ఆరాధ్యను స్కూల్ కి తీసుకెళ్తావ్.. ఇప్పుడు నన్ను ఎందుకు తీసుకెళ్లమంటున్నావ్ అని అరుస్తాడు.

Also Read: బాలుకు షాకివ్వబోతున్న ప్రభావతి.. సత్యం, మీనా మాటకు ఫిదా.. శోభా ప్లాన్ వర్కౌట్..?

నేను అర్జెంటుగా ఒక ఇంటర్వ్యూ కి వెళ్ళాలి అండి. అందుకే ఆరాధ్యను మిమ్మల్ని తీసుకెళ్లమని పంపించాను అని అవని అంటుంది. ఇక అక్షయ్ అవని మాటను అస్సలు వినడు.. ఇక స్కూల్ కి వెళ్ళిన ఆరాధ్యను తన ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తూ ఉంటారు. వాళ్లని ఆరాధ్య కొడుతుంది. ఇక ఆ అమ్మాయి వెళ్లి తన పేరెంట్స్ ని ఆరాధ్య వాళ్ళ ఇంటికి తీసుకొస్తుంది. అక్షయ్ ని వాళ్ళు దారుణంగా తిడతారు. అక్షయ్ వాళ్ళందరిని తీసుకొని అవనిని కడిగి పడేస్తాడు. నీ దగ్గర ఉంటే ఆరాధ్య ఎలా తయారవుతుందో చూసావా ఇంటి మీదకి గొడవలు తీసుకుని వచ్చింది అని అక్షయ్ అంటాడు. అక్కడి తో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

GudiGantalu Today episode: మీనా మిస్సింగ్.. ప్రభావతి ఇంట్లో టెన్షన్..లెటర్ తో ఇంట్లో బాంబ్..

Nindu Noorella Saavasam Serial Today october 5th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరును బంధించేందుకు చంభా కొత్త ప్లాన్‌    

Today Movies in TV : ఆదివారం టీవీల్లోకి రాబోతున్న చిత్రాలు.. ఆ ఒక్కటి వెరీ స్పెషల్..

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి నర్మద స్ట్రాంగ్ వార్నింగ్..కత్తి పట్టిన ప్రేమ.. ఇది కదా ట్విస్ట్ అంటే..

Big tv Kissik Talks: మహేష్ విట్టా లవ్ లో ఇన్ని  ట్విస్టులా.. నా ఆటోగ్రాఫ్ సినిమాని తలపిస్తోందిగా?

Big tv Kissik Talks: బిగ్ బాస్ నా జీవితాన్నే మార్చేసింది.. ఆ క్షణం ఎప్పటికీ మర్చిపోలేను?

Big tv Kissik Talks: పేరుకే గొప్ప నటుడు.. సొంత ఇల్లు కూడా లేదు.. ఇండస్ట్రీలో ఇంత మోసమా?

Bigtv Kissik Talks:  మహేష్ విట్టా సినిమాల్లోకి అలా వచ్చాడా? ట్విస్టులు చాలానే ఉన్నాయే.. ఫన్ బకెట్ లేకపోతే?

Big Stories

×