BigTV English

Tollywood Directors : భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్..!

Tollywood Directors : భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్..!

Tollywood Directors : తెలుగు చిత్ర పరిశ్రమలో అనేకమంది స్టార్ డైరెక్టర్లు ఉన్నారు. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు. ఒక సినిమా హిట్ అవ్వాలన్నా, డిజాస్టర్ అవ్వాలన్నా ముఖ్య పాత్ర డైరెక్టర్ దే. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ డైరెక్టర్లు తమ సినిమాలతో అభిమానుల మనసు దోచుకున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న వారి రెమ్యూనరేషన్ గురించి తెలుసుకోవాలని సినీ అభిమానులు గూగుల్లో తెగ వెతికిస్తూ ఉంటారు. భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్న డైరెక్టర్లకు రెమ్యూనరేషన్ కూడా భారీగా ఉంటుందని అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది. మరి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్స్ ఎవరు? వారి రెమ్యునరేషన్ ఎంత? అన్నది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..


సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పాటు దర్శకులకు కూడా ఒక మార్కెట్ క్రియేట్ అవుతుంది. ఒక సినిమా విడుదల అవుతోంది అంటే దర్శకుడు ఎవరనే విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని జనాలు థియేటర్లకు వెళ్తున్నారు. ప్రస్తుతం అందరి చూపు పెద్ద దర్శకుల పైనే ఉంది. వారు తీసుకునే రెమ్యూనరేషన్ ఎంత అయ్యి ఉంటుందనేది అందరిలో ఒక ఆసక్తిని కలిగిస్తోంది. అయితే భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఇండియన్ డైరెక్టర్స్ ఎవరో ఓ లుక్ వేద్దాం..

రాజమౌళి..


తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన ఏకైక దర్శకుడు రాజమౌళి. ఈయన తెరకెక్కించిన బాహుబలి, త్రిబుల్ ఆర్ చిత్రాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈయనకు ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉంది. దానికి తగ్గట్లుగానే ఆయన రెమ్యూనరేషన్ కూడా దాదాపు 100 కోట్ల వరకు ఉంటుందని టాక్..

సుకుమార్..

పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా టాక్ తెచ్చుకున్న డైరెక్టర్ సుకుమార్. గతంలో ఈయన ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్ చిత్రాలను ఇండస్ట్రీకి అందించారు. కానీ పుష్ప తర్వాత ఆయన లైఫ్ పూర్తిగా మారిపోయింది. లెక్కలు మాస్టర్ కాస్త మాస్ డైరెక్టర్ గా మారాడు. ప్రస్తుతం ఈయన స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఒక్కో సినిమాకు సుకుమార్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ 40 నుంచి 50 కోట్లను టాక్..

త్రివిక్రమ్ శ్రీనివాస్..

మహేష్ బాబుతో ముచ్చటగా మూడోసారి జతకట్టిన గురూజీ ఇప్పుడు ఒక్క సినిమాకి 35 నుండి 40 కోట్లు తీసుకుంటున్నాడు..

అనిల్ రావిపూడి..

తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వరుసగా హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్న డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకరు. ఈయన గతేడాది ఎఫ్ 3 సినిమాతో మంచి హిట్ని అందుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సాలిడ్ హిడ్ని తన ఖాతాలో వేసుకున్నారు.. ఈ డైరెక్టర్ ఒక్క సినిమాకి 20 నుంచి 25 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడు..

Also Read: ‘వీరమల్లు’ నుంచి మరో సప్రైజ్ రెడీ.. ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా!

వీళ్లే కాదు ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులే ఉన్నారు. ఊర మాస్ సినిమాకి కేరాఫ్ అడ్రస్ గా మారిన బోయపాటి శ్రీను సినిమాకి 20 నుంచి 25 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. దర్శకుడు పరశురాం బుజ్జి ఇప్పుడు సినిమాకి 10 నుండి 15 కోట్లు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న కొరటాల సినిమాకి 25 నుంచి 30 కోట్లు తీసుకుంటున్నాడు. అలాగే దర్శకుడు వంశీ పైడిపల్లి. ఒక్క సినిమాకి 25 నుండి 25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.. సురేందర్ రెడ్డి ఒక్క సినిమాకి గాను 5 నుండి 10 కోట్లు తీసుకుంటున్నాడు.. ప్రస్తుతం వీరిలో కొంతమంది డైరెక్టర్లు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

Related News

Betting App Case: ఈ రోజు మంచు లక్ష్మీ వంతు… విచారణపై ఉత్కంఠ!

Film industry: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

The Raja Saab :ప్రభాస్ సినిమాపై హైకోర్టులో కేసు… 218 కోట్ల మోసం?

Tollywood: 50 సెకండ్ల యాడ్ కోసం రూ.5 కోట్లు.. ఈమెకు స్టార్ హీరోలకు మించి డిమాండ్!

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ అకౌంట్ లోకి మరో బిగ్ బ్రాండ్..

War 2 : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎన్టీఆ

Big Stories

×