E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: కమల్ మనసు గొప్పది.. ప్రణతి మాటతో పల్లవి షాక్.. రాజేశ్వరిని చంపేశారా..?

Intinti Ramayanam Today Episode: కమల్ మనసు గొప్పది.. ప్రణతి మాటతో పల్లవి షాక్.. రాజేశ్వరిని చంపేశారా..?
Advertisement

Intinti Ramayanam Today Episode june 5th : అవని పల్లవి దగ్గరకు వెళ్లి ఎందుకు నువ్వు ఇంత మొండిగా ప్రవర్తిస్తున్నావు. అసలు మీ అమ్మ చనిపోవడానికి నేను కానీ మా అమ్మ కానీ ఎటువంటి కారణం కాదు అని ఎంత చెప్పినా సరే.. పల్లవి మాత్రం నాకల్లారా నేను చూశాను అని అంటుంది. మీ నాన్నకి మీ అమ్మని దగ్గర చేశావు మా అమ్మ వాళ్ళ ఎక్కడ దూరమవుతాడు అని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశావు అని పల్లవి అపార్థం చేసుకుంటుంది. తల్లి లాంటి పిన్ని నేనెందుకు చంపుతానని అవని ఎంత చెప్తున్నా సరే పల్లవి మాత్రం అస్సలు వినదు. నువ్వేం చెప్పినా నేను వినను నీ అంత చూసి అంతవరకు నేను వదిలిపెట్టను అని పల్లవి అవనికి వార్నింగ్ ఇస్తుంది. ఇంట్లో జరుగుతున్న పరిస్థితులను చూసి పార్వతీ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అవని నీ యెంతగా ఓదార్చడానికి ప్రయత్నించిన సరే తాను మాత్రం తన తల్లి దూరమైంది అని కన్నీళ్లు పెట్టుకుంటుంది.

కమల్ ప్లాన్ సక్సెస్..

అవని బాధపడుతుందని ఆరాధ్య వెళ్లి కమల్ని తీసుకొని వస్తుంది. బాబాయ్ అమ్మ ఏడుస్తుంది నువ్వు రా బాబాయ్ అని పిలుస్తుంది. బయటికి వచ్చిన కమల్ఎందుకు అందరూ ఇంతగా బాధపడిపోతున్నారు.. మీనాక్షి అత్తయ్యకు ఏమి కాదు మనమందరం ఉన్నాం కదా.. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే మేము ఎవరిని చూడలేకపోతున్నాం వదినా.. అందరికీ సమస్యలు వస్తే అందరూ ఎలా బాధపడకుండా చూసుకోవాలి అని నువ్వు ఎప్పుడూ ఆలోచిస్తావు అలాంటిది నువ్వు ఇప్పుడు బాధపడుతుంటే ఏం చేయాలో కూడా మాకు అర్థం కావడం లేదు అని కమల్ అంటాడు. మీ అందరి కోసం నేను వంట చేస్తాను మీరు తినాలి అని కమలంటాడు.. నేను చేసే వంటలు ఏంటో తెలుసా అని వెరైటీ వంటలు పేర్లు చెప్పడంతో అందరూ నవ్వుతారు. నవ్వుతూ ఉంటేనే బావుంటది వదిన మీకు తోడుగా మేమున్నాము నవ్వుతూ ఉంటే నువ్వు ఏ సమస్యనైనా పరిష్కరిస్తావు అని కమలంటాడు..

ఇంట్లోంచి వెళ్లిపోతున్న ప్రణతి..

Advertisement

పల్లవిని ఎంత బ్రతిమిలాడినా సరే భోజనం చేయడానికి రాను అని అంటుంది. రెండు రోజుల నుంచి ఏమి తినలేదు ఇలాగైతే ఎలా సిస్టర్ అని భరత్ అంటాడు. అమ్మ ఎలాగో లేదు ఆమె తలుచుకుంటూ నువ్వు నా బాధ పడిపోతూ ఉంటే ఎలాగా సిస్టర్ అని భరత్ పల్లవితో అంటాడు. నాకు అన్నీ మా అమ్మే అనుకున్నాను కానీ.. ఆమె లేకపోవడంతో నేను ఎవరి కోసం బతకాలి అని అనుకుంటున్నాను అని పల్లవి ఎమోషనల్ అవుతుంది.. అప్పుడే ప్రణతి బ్యాగ్ తీసుకొని కిందకు రావడంతో ఎక్కడికి బ్యాగ్ తీసుకుని వచ్చావు అని భరత్ అడుగుతాడు. ఇక్కడ ఎందుకు ఉండాలి ఎవరి కోసం ఉండాలి. ఎవరు ఎలాంటి వారు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అని ప్రణతి అనగానే పల్లవి నన్ను చూసి మాట్లాడుతున్నావ్ ఏంటి అని అంటుంది.

ప్రణతికి భరత్ వార్నింగ్..

ఎవరు ఎలాంటి వాళ్ళు నాకు ఇప్పుడు బాగా అర్థమైంది.. అయితే ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా నాకు లేదు నేను వెళ్ళిపోతాను అని ప్రణతి ఎంతగా చెబుతున్నా సరే భరత్ మాత్రం అస్సలు వినడు.. మీ ఇంటికి వదిలి నేను ఎక్కడికి రాను నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపో అని ప్రణతికి వార్నింగ్ ఇస్తాడు.. నువ్వు నీ భర్తని వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపో అంతే కానీ నా గురించి మాత్రం మాట్లాడద్దు అని పల్లవి అంటుంది. నేను రాజేశ్వరి అమ్మకి తలకరి పెట్టాను 11 రోజులు ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోకూడదు అని పంతులుగారు చెప్పారు. నేను రాను నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపో అని భరత్ ప్రణతికి వార్నింగ్ ఇస్తాడు.. ఆ మాటతో ప్రణతి ఇంకేమీ మాట్లాడకుండా మళ్ళీ తను పైకి వెళ్ళిపోతుంది.. భానుమతి వారిని ఎందుకే నీ సొంత తమ్ముడిలాగా చూస్తున్నావు వాడి వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వు అని అంటున్న సరే పల్లవి మాత్రం వీడిని అడ్డుపెట్టుకుని అవనిని ఆడుకుంటాను అని అంటుంది..

సిసిటీవీ పుటేజ్ చెకింగ్..

Advertisement

అసలు రాజేశ్వరి అత్తయ్య ఎలా చనిపోయింది అని అది నాకు క్లియర్ గా చెప్తే నేను ఈ కేస్ ని వాదించడానికి ఈజీ అవుతుంది వదినా అని శ్రీకర్ ఇంటి ముందు రాజేశ్వరి పడిపోయిన ప్లేస్ కి అందర్నీ తీసుకుని వెళ్తాడు.. అయితే అక్కడ రాజేశ్వరి ఎలా పడిపోయింది అన్న విషయాన్ని అవని పూసగుచ్చినట్లు చెబుతుంది.. అమ్మని గట్టిగా గొంతు పట్టుకొని నులిమింది తను ఊపిరాడక ఇబ్బంది పడుతుంటే నేను విడిపించాలని ప్రయత్నించాను అయితే రాజేశ్వరి పిన్ని మళ్లీ మా అమ్మని చంపేస్తాను అని వచ్చింది అప్పుడే ఆమె కాలు సరి కింద పడి ఆ రాయి మీద పడి తల పగిలింది.. అప్పటికే చాలా రక్తం పోయింది అది చూసిన పల్లవి నేను మా అమ్మ రాజేశ్వరి పిన్ని చంపడానికి ప్రయత్నించామని అపార్థం చేసుకుంటుంది అని అంటుంది.. ఈ విషయాన్ని చెప్తే అసలు కోర్టులో నమ్మరు వదిన ఎలా జరిగింది అన్నది నిరూపించాలి అని శ్రీకర్ అంటాడు ఇక్కడున్న సీసీ కెమెరాలను ఒకసారి పరిశీలిస్తే ఏమైనా జరిగింది తెలుస్తుంది ఏమో అని అనగానే అందరూ వెళ్లి కెమెరాలను చెక్ చేయాలనుకుంటారు..

అవనికి అనుమానం..

అక్కడున్న చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలించిన వాళ్ళు ఒక ఇంటికి వెళ్ళగానే సీసీటీవీ కెమెరా అని అనగానే కాస్త టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఏంటి సుబ్బారావు గారు ఎందుకు మీరు టెన్షన్ పడుతున్నారు అని కమల్ ఎంతగా అడుగుతున్నా సరే మా సీసీటీవీ కెమెరా పని చేయడం లేదు. వీడియో లేదు ఏమీ లేదు వెళ్లిపోండి అని కంగారు పడిపోతూ అనడంతో అవని వాళ్లకి అనుమానం వస్తుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి వాళ్ళు ఎందుకు కంగారు పడుతున్నారో మనం తెలుసుకుంటే అసలు మ్యాటర్ ఏంటో మనకి తెలిసిపోతుంది అని అవని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read : గుడ్ న్యూస్ చెప్పిన శృతి.. ఇండస్ట్రీకి గుడ్ చెప్పేస్తుందా..?

Related News

Gundeninda GudiGantalu Today episode: కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. బాలుకు నిజం తెలుస్తుందా..? ఇది కదా అసలు ట్విస్ట్..

Podarillu Today Episode : గ్రాండ్ గా బర్త్ డే వేడుక.. చక్రీ ప్లాన్ సక్సెస్.. చక్రీకి దిమ్మతిరిగే షాకిచ్చిన మహా..

Nindu Noorella Saavasam Serial Today Episode July 21st ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌కు నిజం చెప్పిన ఎస్సై  

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. నర్మదకు భద్రపై అనుమానం.. వేదవతి ఫుల్ హ్యాపీ..

Intinti Ramayanam Today Episode: పాపం మీనాక్షికి కన్నీళ్లు.. పల్లవి, కమల్ రొమాన్స్.. యోగా టీచర్ ఎంట్రీ అదుర్స్..

Brahmamudi Serial Today Episode July 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వచ్చిన రాజు   

Actress Sirisha : నటి శిరీష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Big Stories

Advertisement
×