E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవికి చెమటలు.. పార్వతికి మాటిచ్చిన అవని.. నిజం బయటపడుతుందా..?

Intinti Ramayanam Today Episode: పల్లవికి చెమటలు.. పార్వతికి మాటిచ్చిన అవని.. నిజం బయటపడుతుందా..?
Advertisement

Intinti Ramayanam Today Episode March 12th: నిన్నటి ఎపిసోడ్ లో.. ముగ్గురు అన్నదమ్ములు కలిసి వెళ్లడానికి రెడీ అవుతారు. ఇక అందరూ కలిసి సరదాగా కమల్ ని రెడీ చేసి ఆఫీస్ కి వెళ్లడానికి రెడీ అవుతారు. తన ముగ్గురు కొడుకులు సంతోషంగా ఉన్నారు అని పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. మేము ముఖ్యమైన అగ్రిమెంట్ ని చేయించుకోబోతున్నాము అని పార్వతి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ముగ్గురు అన్నదమ్ములు.. బయటికి వెళ్తుంటే అవని నువ్వు వాళ్లకి ఎదురు వెళ్ళమ్మా అనేసి పార్వతి అంటుంది. చక్రధర్ మాత్రం తాను చేసిన తప్పు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే నిజాలు అన్నీ బయటపెట్టాలి అని అనుకుంటాడు. అవినీకి చక్రధర్ ఫోన్ చేసి అసలు నిజాన్ని చెప్పాలని అనుకుంటాడు. అత్తయ్య నేను మామయ్యకి రాగిజావ చేసి తీసుకురమ్మంటారా అని అవని అడుగుతుంది. నేను చేస్తానులేమ్మా నువ్వు వెళ్లి నీ పని చూసుకో అనేసి పార్వతి అంటుంది.. చక్రధర్ ఫోన్ చెయ్యడంతో అవని హడావిడిగా వెళ్ళిపోతుంది. పల్లవి గురించి భయంకరమైన నిజాన్ని చక్రధర్ చెప్తాడు. ఇవాళ ఎలాగైన పల్లవి అంతు చూడాలని అవని ఫిక్స్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. రాజేంద్ర ప్రసాద్ ను చంపాలని చూసిన పల్లవి గురించి మొత్తం నిజాన్ని చెప్పేస్తాడు చక్రధర్. అవన్నీ మాత్రం ఆవేశంగా బయలుదేరుతుంది.. చక్రధర్ గురించి నిజాన్ని ఎవరికీ చెప్పొద్దు అని ఎంతగా బ్రతిమిలాడిన సరే అవని మాత్రం వినదు.. తను ఎంతైనా నీ సొంత చెల్లెలు నువ్వు ఇలాంటివి బయట పెట్టొద్దు తనకు ఒక ఛాన్స్ ఇవ్వు మారుతుంది అని చక్రధర్ బ్రతిమలాడుతాడు.. నువ్వు మారుతుంది అన్న నమ్మకం నాకు లేదు మా ఇంట్లో వాళ్లకి నేనైతే ద్రోహం చేయలేను పల్లవి గురించి అసలు నిజాన్ని బయట పెడతాను అని అవని ఆవేశంగా ఇంటికి వెళ్తుంది.. పల్లవి నీ ఏం చేస్తుందో తెలియదు వాళ్ళు చంపేస్తారు అని చక్రధర్ పల్లవికి ఆ నిజం చెప్తాడు పల్లవి షాక్ అవుతుంది..

Advertisement

అవని వస్తే ఇంట్లోని వాళ్ళందరికీ నిజం చెప్పేస్తుంది అని పల్లవి భయపడిపోతూ ఉంటుంది. ఎలాగైనా సరే అవని వచ్చేలోపు ఇంట్లోంచి బయటికి వెళ్లిపోవాలి అని పల్లవి అనుకుంటుంది. అయితే కమల్ ఇంటికి రావడం చూసి పల్లవి షాక్ అవుతుంది. ఏంటి బావ అప్పుడే వచ్చేసావు అని అడుగుతుంది.. ఆఫీసులో అన్నయ్య చెప్పిన పని అయిపోయింది అందుకే వచ్చేసాను అని కమలం అంటాడు. సరే అయితే నేను అర్జెంటు పని ఒకటి ఉంది బయటికి వెళ్ళొస్తాను అని పల్లవి ఎంత చెప్పినా సరే వినకుండా వెళ్తాను అని మొండిగా అంటుంది.. నువ్వు ముందు నాకు కాఫీ పెట్టి ఇవ్వాలి అని అంటారు. నేను అర్జెంటుగా వెళ్లాలి బావ అత్తయ్య గారికి చెప్తాను ఆగు అని ఎంత చెప్తున్నా సరే.. మొగుడికి కాఫీ ఇవ్వలేనంత అర్జెంటు పని నీకేం ఉంటుంది. ముందు కాఫీ పెట్టి తీసుకురా అనేసి కమల్ పల్లవికి వార్నింగ్ ఇస్తాడు.

కాఫీ పెట్టి ఇవ్వగానే ఎదురుగా అవని రావడంతో అవినీ వచ్చేస్తుంది ఇక నా చావు తద్యం అంటూ పల్లవి టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. అయితే ఇంట్లోకి రావాల్సిన అవని పక్కకు వెళ్ళిపోవడంతో ఏంటి ఆలోచిస్తున్నా ఎక్కడికి వెళ్ళింది అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. అయితే పల్లవి అవని చూసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఏంటి పల్లవి మా వదిన ని చూసి అంతగా టెన్షన్ పడిపోతున్నావు అని కమల్ అడుగుతాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అవని మౌనంగా వంటగదిలోకి వెళ్తుంది. కమల్ ఆరోగ్యకు మంచినీళ్లు తీసుకురాని లోపలికి పంపిస్తాడు అయితే అవని పార్వతి ఇద్దరు కూడా పల్లవి పై సీరియస్ గా ఉంటారు. పల్లవి మంచినీళ్లు తీసుకొని బయటకు వచ్చేస్తుంది.

Advertisement

అయితే పార్వతి అవని ఇంట్లోకి రాకముందు మాట్లాడుకున్నా విషయాన్ని గుర్తు చేసుకుంటారు. అవని ఇంట్లోకి వెళ్ళే టైం లో పార్వతి అవనీని పట్టుకొని బయటకు లాక్కొస్తుంది.. మీ మామయ్య గారిని చంపాలి అనుకునింది పల్లవి అని నాకు తెలుసు. నీకు ఫోన్ రాగానే నువ్వు టెన్షన్ పడిపోతూ వెళ్తుంటే నీ వెనకలే నేను వచ్చాను అని పార్వతి చెప్తుంది. మీ నాన్న నీకు చెప్పిన నిజాన్ని నువ్వు మీ నాన్న తో మాట్లాడిన తీరు అంతా నేను విన్నాను. ఇప్పుడు నువ్వు పల్లవి నే మీ మామయ్య గారిని చూసి చంపాలనుకునేది అన్న విషయాన్ని అందరికీ చెప్తే నా కొడుకులు జైలు పాలు అవుతారు అని పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.

Also Read :సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. వంటలక్క అవుట్..

నా భర్త ఇప్పుడు లేవలేని స్థితిలో ఉన్నాడు ఇక నా పిల్లలు కూడా జైలు పాలు అయితే.. నేను బ్రతకలేను అంటూ బాధపడుతుంది.. ఇక తర్వాత సరే అత్తయ్య మీ మాట ప్రకారం నేను పల్లవి గురించి ఏమీ చెప్పను. పల్లవిని మారేలా చేస్తాను. తనంతట తానే తప్పు తెలుసుకుని మావయ్యకి క్షమాపణ చెప్పేలా చేస్తాను అని అవని అంటుంది.. ఇక లోపలి నుంచి బయటికి వచ్చిన అవని చక్రధర్ శ్రీకర్లు రావడంతో వాళ్లకి మంచినీళ్లు ఇస్తుంది.. ఇందాకటి నుంచి మీ కోసమే వెయిట్ చేస్తున్నానండి వచ్చేసారా మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి అని అవని అనగానే పల్లవి ఫీజులు ఎగిరిపోతాయి.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×