E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: చక్రధర్ ను అవమానించిన భానుమతి.. పల్లవికి అవని స్ట్రాంగ్ వార్నింగ్.. పార్వతి కన్నీళ్లు..

Intinti Ramayanam Today Episode: చక్రధర్ ను అవమానించిన భానుమతి.. పల్లవికి అవని స్ట్రాంగ్ వార్నింగ్.. పార్వతి కన్నీళ్లు..
Advertisement

Intinti Ramayanam Today Episode March 13th: నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేంద్ర ప్రసాద్ ను చంపాలని చూసిన పల్లవి గురించి మొత్తం నిజాన్ని చెప్పేస్తాడు చక్రధర్. అవన్నీ మాత్రం ఆవేశంగా బయలుదేరుతుంది.. చక్రధర్ గురించి నిజాన్ని ఎవరికీ చెప్పొద్దు అని ఎంతగా బ్రతిమిలాడిన సరే అవని మాత్రం వినదు.. తను ఎంతైనా నీ సొంత చెల్లెలు నువ్వు ఇలాంటివి బయట పెట్టొద్దు తనకు ఒక ఛాన్స్ ఇవ్వు మారుతుంది అని చక్రధర్ బ్రతిమలాడుతాడు.. నువ్వు మారుతుంది అన్న నమ్మకం నాకు లేదు మా ఇంట్లో వాళ్లకి నేనైతే ద్రోహం చేయలేను పల్లవి గురించి అసలు నిజాన్ని బయట పెడతాను అని అవని ఆవేశంగా ఇంటికి వెళ్తుంది..

పల్లవి నీ ఏం చేస్తుందో తెలియదు వాళ్ళు చంపేస్తారు అని చక్రధర్ పల్లవికి ఆ నిజం చెప్తాడు పల్లవి షాక్ అవుతుంది.. అవని వస్తే ఇంట్లోని వాళ్ళందరికీ నిజం చెప్పేస్తుంది అని పల్లవి భయపడిపోతూ ఉంటుంది. ఎలాగైనా సరే అవని వచ్చేలోపు ఇంట్లోంచి బయటికి వెళ్లిపోవాలి అని పల్లవి అనుకుంటుంది. పల్లవి అవని ని చూసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఏంటి పల్లవి మా వదిన ని చూసి అంతగా టెన్షన్ పడిపోతున్నావు అని కమల్ అడుగుతాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అవని మౌనంగా వంటగదిలోకి వెళ్తుంది. అవని తన గురించి ఎక్కడ నిజం చెప్పబోతుందో అని భయపడిపోతూ టెన్షన్ పడుతుంది పల్లవి. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బయటికి వచ్చిన అవని చక్రధర్ శ్రీకర్లు రావడంతో వాళ్లకి మంచినీళ్లు ఇస్తుంది అవని .. ఇందాకటి నుంచి మీ కోసమే వెయిట్ చేస్తున్నానండి వచ్చేసారా మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి అని అవని అనగానే పల్లవి ఫీజులు ఎగిరిపోతాయి.. దేని గురించి మాట్లాడాలి అని అక్షయ్ అంటాడు. మీతో ఒక విషయం చెప్పాలి అని పల్లవి ముందరే అవని అనడంతో ఎక్కడ నా గురించి నిజం చెప్తుందో అని టెన్షన్ పడిపోతుంది. అవని కోపంగా ఉండడం గమనించిన పల్లవి కచ్చితంగా ఈరోజు నా పని అయిపోతుంది అని అనుకుంటుంది. ఇక తర్వాత ఆరాధ్య ఎందుకు మీ అమ్మ అంత కోపంగా ఉంది ఏం చేశావు అని అక్షయ్ అడుగుతాడు. నేను ఏం చేయలేదు నాన్న పెద్దవాళ్ళు ఎవరో ఏదో ఒకటి చేసి ఉంటారు అందుకే మమ్మీ అంత కోపంగా ఉంది అనేసి అంటుంది.

రాజేశ్వరి తినిందో లేదో అని చక్రధర్ కనుక్కునేందుకు లోపలికి వస్తూ ఉంటాడు. అది గమనించిన రాజేశ్వరి చక్రధరిని లోపలికి రావద్దు అని అంటుంది.. అమ్మ ఆయన నాకు గదిలోకి వస్తే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని చెప్పు అని భానుమతికి చెప్తుంది. ఆ తర్వాత భానుమతి ఈ వయసులో నువ్వు అవని మీనాక్షిల గురించి చెప్పకపోతే ఏమైంది అని చక్రధర్ ను తిడుతుంది. నీకు ఆ తర్వాత ఈ వయసులో ఆయనకు వాళ్లు అవసరమయ్యారేమో నేను నా కూతురు అవసరం లేదేమో అని భానుమతితో సహా రాజేశ్వరి కూడా చక్రధర్ ని తిడుతుంది. ఇక చక్రధర్ ఏమి చేసేదిలేక మౌనంగా వెళ్ళిపోతాడు.

Advertisement

అవని ఎందుకు తన గురించి నిజం చెప్పలేదు అని పల్లవి టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. ఎలాగైనా సరే అవన్నీ అడిగి తెలుసుకోవాలని అవని వెనకాల తిరుగుతుంది. అవని మొక్కలకి నీళ్లు పోస్తుండగా వచ్చిన పల్లవి అక్క ఏంటి అక్క నా మీద చాలా సీరియస్ గా ఉన్నావు అని అడుగుతుంది. నాకు మా నాన్న ఏదేదో చెప్పాడు నీకు ఫోన్ చేసి కూడా మీ నాన్న అదే చెప్పాడు నాకు తెలుసు. నువ్వు చేసిన పనికి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి నిన్ను చంపేసేలా చేయొచ్చు. కానీ నిన్ను అలా చెప్పలేదు అంటే నేను నిన్ను వదిలేసినట్లు కాదు అని పల్లవి చంప పగలగొడుతుంది అవని.

ఇప్పటినుంచి నేను ఏది చెప్తే అది చేయాలి. నువ్వు నా కనుసైగల్లో ఉండాలి. లేదంటే మాత్రం నీ జీవితం ఏమైపోతుందో ఊహించుకోలేవు అని అవినీ పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత రాత్రి అందరూ భోజనానికి కూర్చుంటే పల్లవి మీరందరూ కూర్చొని నేను వడ్డిస్తాను అని వడ్డిస్తుంది. ఇదంతా చూసిన శ్రేయ ఇది ఎనిమిదో వింత లాగుంది ఎప్పుడు పల్లవి ఏ పని చేయదు. ఇప్పుడు ఇలా చేయడం కొత్తగా ఉంది అని అనుకుంటుంది. పార్వతి మాత్రం తన ముగ్గురు కొడుకులు ఆప్యాయత అనురాగాలు చూసి మురిసిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది.. అందరూ భోజనం చేసిన తర్వాత పార్వతీ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది.

Also Read :దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన పల్లవి.. ఫ్యాన్స్ హర్ట్..!

అక్కడికి వచ్చిన అవని ఏంటి అత్తయ్య మీరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అని అడుగుతుంది. ఇన్ని రోజులు నీ గురించి నేను తప్పుగా ఆలోచించానమ్మ నన్ను క్షమించు అని పార్వతి అంటుంది. కానీ అవని మాత్రం మీరు నా గురించి ఏం తప్పుగా అనుకోలేదు అత్తయ్య పొరపాటు అనుకున్నారు అంతే నేనెప్పుడూ పల్లవి గురించి ఇక నిజం చెప్పను మీరు కంగారు పడకండి అని అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. ఎపిసోడ్లో పల్లవి ఉదయాన్నే లేచి ఇల్లంతా ఉడ్చి ముగ్గు పెట్టడం చూసినా అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×